Trending:


ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి టెన్త్‌లో 593 మార్కులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో కర్నూలు జిల్లాకు చెందిన షైక్ హ్యూమేరా ఇక్బాల్ అనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సత్తా చాటారు. కర్నూల్ పట్టణంలోని పాతబస్తీలో గల కడపుర వీధిలో నివాసం ఉంటున్న షేక్ ఇక్బాల్ బాషా, షేక్ ఆసియా తాసిన్ దంపతుల కుమార్తె షేక్ హ్యూమేరా ఇక్బాల్ అనే విద్యార్థిని కర్నూల్ పట్టణంలోని కంట్రోల్ రూమ్ సమీపంలో ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 10వ...


TS DOST 2024: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు మార్గం 'దోస్త్' - నోటిఫికేషన్‌ ఎప్పుడంటే?

DOST: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన 'డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ(దోస్త్‌)' ఏప్రిల్ 27 లేదా మే 1న వెలువడే అవకాశం ఉంది. అదేసమయంలో 'దోస్త్' ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఏప్రిల్ 24న ఇంటర్‌మీడియట్‌ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో.. ఉన్నత విద్యామండలి డిగ్రీ ప్రవేశ షెడ్యూలు ప్రకటించడానికి సన్నాహాలు చేస్తోంది. దోస్త్‌...


కుత్బుల్లాపూర్ లో విషాదం.. నీటి సంపులో మహిళా మృతదేహం

కుత్బుల్లాపూర్ లో విషాదం.. నీటి సంపులో మహిళా మృతదేహం కుత్బుల్లాపూర్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. నీటి సంపులో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న ఓ మహిళ మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. బౌరంపేట్ స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు.. సంపు నుండి మృతదేహాన్ని వెలికి తీశారు. మహిళను బండరాయితో మోది హత్యచేసి ఈడ్చికెళ్ళి  సం...


ఇంద్రవెల్లి ఘటనకు 43 ఏళ్లు…

జల్.. జమీన్… జంగిల్ నినాదంతో ఆదివాసి గిరిజనుల హక్కుల కోసం అడవి బిడ్డలు చేసిన పోరాటంపై కురిసిన తుపాకీ గుండ్ల వర్షం కురిసింది. ఈ పోరాటంలో 13 మంది అమరులయ్యారు. ఇది నెత్తుటి గాయన్ని మిగిల్చింది. 43 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన ఆదివాసి గిరిజనుల గుండెల్లో మాత్రం అది మానని గాయంగానే మిగిలిపోయింది. మరోవైపు ఈ ఘటనకు నిదర్శనంగా నిలుస్తున్నఇంద్రవెల్లిలోని నిలువెత్తు స్మారక స్థూపం ఆ దారి వెంట వచ్చి పోయే వారికి నాడు జరిగిన సంఘటనలో అమరత్వం పొందిన ఆదివాసీ...


నిర్లక్ష్యంతో జరిగే అగ్ని ప్రమాదాలే ఎక్కువ .. అవేంటో తెలుసుకోండి మరి!

వేసవి నేపథ్యంలో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అధికంగా అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. అయితే అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి.. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి ప్రాణనష్టాలు, ఆస్తి నష్టం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశాలపై లోకల్ 18 ప్రత్యేక కథనం మీకోసం అందిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణంతో పాటు వేములవాడ పట్టణంలో కూడా ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించామని వేములవాడ ఫైర్ స్టేషన్...


నడిగడ్డ రోడ్లను పట్టించుకోలే

నడిగడ్డ రోడ్లను పట్టించుకోలే పదేండ్లుగా రిపేర్లు చేయక తిప్పలు పడుతున్న ప్రజలు గద్వాల, వెలుగు : పదేండ్లుగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక్క రోడ్డు రిపేరుకు నోచుకోలేదు. కొత్త రోడ్లు వేయకపోవడంతో జిల్లాలోని రోడ్లన్నీ అధ్వానంగా మారి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రోడ్లపై వెట్ మిక్స్ వేసి బీటీ వేయకపోవడంతో, కంకర రోడ్లపై ప్రయాణం చేయాలంటేనే భయపడుతున్నారు. ...


వీరాంజనేయస్వామికి 12సార్లు మన్యసూక్త అభిషేకాలు.. తరలివచ్చిన భక్తజనం!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం సంకట విమోచన భక్త వీరాంజనేయ స్వామి వారి ఆలయం (జోడాంజనేయ స్వామి) ఆలయంలో హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా 12 మన్య సూక్త అభిషేక పూజలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు, చాలీసా పారాయణతో పాటు హనుమాన్ దండకాన్ని ఆలయ అర్చకులు లక్ష్మణ పంతులు, అనంతచార్యులు అధ్వర్యంలో నిర్వహించారు.ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా అగ్రహారం ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని...


హనుమాన్ ఆలయంలోని ఆభరణాల దొంగ అరెస్ట్

హనుమాన్ ఆలయంలోని ఆభరణాల దొంగ అరెస్ట్ ముషీరాబాద్,వెలుగు: హనుమాన్ ఆలయంలో దేవతామూర్తుల తిలకం ఆభరణాలు, తాళిబొట్టు చోరీ చేసిన పాత నేరస్తులు అరెస్ట్ అయ్యారు. నిందితుల వద్ద రూ. 6 లక్షల విలువైన సొత్తుతోపాటు 3 బైకులను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపారు.  చిక్కడపల్లి ఏసీపీ ఎల్. రమేష్ కుమార్  సోమవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. గాంధీ ఆస్పత్రి ఫుట...


తిరుగుబాటు నా నేచర్ .. కాంగ్రెస్ నేత విజయశాంతి ట్వీట్

తిరుగుబాటు నా నేచర్ .. కాంగ్రెస్ నేత విజయశాంతి ట్వీట్ హైదరాబాద్, వెలుగు: తన స్వభావం తిరుగుబాటని, సిని మాల్లో చేసిన పాత్రల ప్రేరణే ఇం దుకు కారణం కావొచ్చని కాంగ్రెస్ నేత విజయశాంతి మంగళవారం ట్వీట్  చేశారు. ప్రభుత్వం వైపు కన్నా ప్రజల వైపు ఉండటమే తన మనస్తత్వం అని, తానిలా చెప్పడా న్ని కొందరు విమర్శించినప్పటికీ.. అదే ధోరణితో ముందుకెళ్తానని పేర్కొన్నారు. ప...


హనుమాన్ భక్తులకు రేడియం స్టిక్కర్లు

హనుమాన్ భక్తులకు రేడియం స్టిక్కర్లు జగిత్యాల రూరల్ వెలుగు: కాలినడకన కొండగట్టు హనుమాన్ దర్శనానికి వెళ్లే భక్తులకు సోమవారం తిప్పన్న పేట క్రాస్ రోడ్డు వద్ద రూరల్ ఎస్ఐ సుధాకర్ రేడియం స్టిక్కర్లు అతికించారు. వాహనదారులకు చీకట్లో కూడా నడిచి వెళ్లే భక్తులు కనిపించేలా వీటిని అతికించినట్లు ఎస్‌‌ఐ తెలిపారు. ©️ VIL Media Pvt Ltd.


కేసీఆర్​ మోకాళ్ల యాత్ర చేసినా.. బీఆర్ఎస్​కు డిపాజిట్ కూడా రాదు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కేసీఆర్​ మోకాళ్ల యాత్ర చేసినా.. బీఆర్ఎస్​కు డిపాజిట్ కూడా రాదు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలిస్తే 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చేందుకు రెడీగా ఉన్నరు   భువనగిరి, నల్గొండ ఎంపీ అభ్యర్థులు సర్పంచ్​లకు కూడా పనికిరారు నల్గొండ, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మాయ చేసేందుకు మాజీ సీఎం కేసీఆర్​బస్సు యాత్ర చేస్తున్నాడని, ఆయన మోకాళ్ల యాత్ర చ...


YS Jagan: శత్రు సైన్యాన్ని ఓడించేందుకు ఉత్తరాంధ్ర సిద్ధం- సీఎం జగన్‌ మాస్‌ స్పీచ్‌

AP CM YS Jagan Speech In Chelluru Sabha: విజయనగరం జిల్లా చెల్లూరులో నిర్వహించిన సిద్ధం సభలో సీఎం జగన్‌ ప్రతిపక్షాలపై అదిరిపోయే పంచ్‌లు విసిరారు. లక్షలాది మంది తాండ్ర పాపారాయుళ్లు మాదిరిగా శత్రుసైన్యాన్ని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారంటూ సీఎం జగన్‌ మాస్‌ డైలాగ్స్‌ పేల్చారు. శత్రు సైన్యాన్ని ఓడించేందుకు మీరంతా సిద్ధమైతే.. ఆ యుద్ధం ఎలా ఉంటుందో రుచి చూపించడానికి ఉత్తరాంధ్ర సిద్ధం సిద్ధం అంటూ అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికలు కేవలం...


రావణాసురుని ప్రతిమ కూలి ఐదుగురికి గాయాలు

రావణాసురుని ప్రతిమ కూలి ఐదుగురికి గాయాలు జోగిపేట,వెలుగు: జోగిపేట పట్టణంలో జోగినాథస్వామి ఉత్సవాలలో భాగంగా జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో  రావణసురుని ప్రతిమకు తుది మెరుగులు దిద్దుతుండగా  ఈదురు గాలికి అది కూలిపోయింది. దీంతో ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి.   సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.   ఉత్సవాలలో   చివరి ఘట్టమైన లంకాదహనం కార్యక్రమం క...


సీఏఏను మమత టచ్ చేయలేరు: అమిత్ షా

సీఏఏను మమత టచ్ చేయలేరు: అమిత్ షా కోల్ కతా: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) టచ్ చేసే ధైర్యం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకురాలు మమతా బెనర్జీకి లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈ చట్టం కింద హిందూ శరణార్థులందరికీ పౌరసత్వం లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.  మంగళవారం బెంగాల్​లో షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలోకి చొరబాటుదార్లను ‘దీదీ’ ఆపలేకప...


Akshaya Tritiya 2024: అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిందే అనే మాయలో పడుతున్నారా!

Significance of Akshaya Tritiya 2024: హిందువులకు ప్రతి పండుగా ప్రత్యేకమే. కొన్ని పండుగలు భక్తితో ముడిపడి ఉంటే..మరికొన్ని పండుగలు సెంటిమెంట్స్ చుట్టూ తిరుగుతాయి. అయితే సెంటిమెంట్స్ తో పాటూ భారీ ఖర్చుతో ముడిపడిన పండుగల్లో ముఖ్యమైనది అక్షయతృతీయ. ఏటా వైశాఖమాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ రోజు... అంటే వైశాఖమాసం ప్రారంభమైన మూడో రోజు అక్షయతృతీయ జరుపుకుంటారు. ఈ రోజున బంగారం షాపులన్నీ కళకళలాడిపోతుంటాయ్.. ఆపర్ల మీద ఆపర్లు ప్రకటిస్తారు. షాపుల దగ్గరబారులు...


Taslima Mohammad:సోషల్ మీడియాలో బిల్డప్ లు.. తస్లీమా మహమ్మద్ ఆస్తులు చూసి కళ్లు తేలేస్తున్న ఏసీబీ అధికారులు..

Taslima Mohammad: సబ్ రిజిస్ట్రార్ తస్లీమామహమ్మద్ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తస్లీమా.. 5 ఇళ్లను,6 ఓపెన్ ప్లాట్స్ లను, 3 ఎకరాల భూమిని కల్గి ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది.


News Live updates:లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు .. అప్‌డేట్స్

News Live updates: దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి నెలకొంది. కొన్నిరాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో స్థానిక పార్టీలు, జాతీయ పార్టీల అభ్యర్ధులు, కీలక నేతలు ప్రచారంలో జోరు పెంచారు. శుక్రవారం దేశవ్యాప్తంగా తొలి విడత పోలింగ్ ముగిసింది. 102 నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కువినియోగించుకున్నారు. మొత్తం 16.63 కోట్ల మంది ఓటర్లు.. 1.87 లక్షల పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. ఇందుకోసం మొత్తం 18 లక్షల మంది పోలీసులతో...


ఆ రెండు కాంగ్రెస్ పథకాలను ప్రశంసించిన గులాబీ బాస్ కేసీఆర్..!

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలైన కొన్ని పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ అమలు చేయటం లేదని.. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పథకాలను కూడా నిర్వీర్యం చేస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. కేసీఆర్ ఆనవాళ్లు తెలంగాణలో లేకుండా చేయటమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడని.. ఆ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా చెప్పారని తెలిపారు. ఈ క్రమంలోనే.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రెండు పథకాలను కేసీఆర్ ప్రశంసించారు.


రైతులను నిండా ముంచిదే బీఆర్ఎస్ : గడ్డం వంశీకృష్ణ

రైతులను నిండా ముంచిదే బీఆర్ఎస్ : గడ్డం వంశీకృష్ణ నీళ్లు, నిధులు, నియామకాల పేరు చెప్పి కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ.  డబుల్ బెడ్ రూం అని చెప్పి నిరుపేదలను కూడా మోసం చేశారని విమర్శించారు. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు.  బీఆర్ఎస్ పాలనలో అక్రమ కేసులు, భూదందా, ఇసుక దందాల...


లారీని ఢీ కొట్టిన కారు..ముగ్గురు మృతి

లారీని ఢీ కొట్టిన కారు..ముగ్గురు మృతి నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కావలి రూరల్ మండలం ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఆక్సిడెంట్ అయ్యింది. ఓ కారు లారీని ఓవర్ టేక్ చేయబోయి వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురి అక్కడిక్కడే మృతిచెందారు.ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు.బాధితులు పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగ...


ఇక్కడ శివలింగం పచ్చగా ఉంటుంది? అభిషేకం చేస్తే కష్టాలు తొలగినట్టేనట

మన దేవాలయాల్లో ఎక్కువ శాతం గర్భగుడిలోకి ప్రవేశం ఉండదు. కానీ కాకతీయ కాలం నాటి ఈ శివాలయంలో మాత్రం భక్తులు ఏకంగా గర్భగుడిలోకి వెళ్ళి పూజలు నిర్వహిస్తారు. ఎంతో చారిత్రాత్మక చరిత్ర కలిగిన ఈ ఆలయం పై మీ లోకల్18 లో ప్రత్యేక కథనం…. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని ఇనుపాముల గ్రామంలో కాకతీయుల కాలం నాటి శివాలయం వెలసి , భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరు గాంచింది. ఈ ఆలయం గర్భగుడిలోకి వెళ్లి పాలాభిషేకం, నెయ్యి అభిషేకం, రుద్రాభిషేకం అన్ని రకాల అభిషేకాలను భక్తులు చేయడం ఇక్కడ విశేషం. ఇంతకు ఈ ఆలయంలో వెలసిన శివలింగం పచ్చగా ఉండడం తో స్వామి వారిని శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి గా భక్తులు సంభోధిస్తారు. అందుకే ఈ ఆలయాన్ని పచ్చల సోమేశ్వర స్వామి ఆలయం అంటారు ఇనుపాములలో వెలసిన ఈ శివాలయానికి ప్రతి రోజూ నిత్యం పూజలు చేసేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుండి సైతం వస్తుంటారు. ఈ ఆలయం విశిష్టతపై లోకల్18 తో ఆలయ అర్చకులు వేణు మాట్లాడుతూ ..ఈ ఆలయం రోడ్డు విస్తరణకు ముందు ఎడమ వైపుకు ఉండేదని, రోడ్డు విస్తరణలో భాగంగా దేవాలయం అక్కడ నుండి తీసి జాతీయ రహదారికి కుడివైపు నెలకొల్పడం జరిగిందన్నారు. ఈ దేవాలయం కాకతీయ రాజుల కాలం నాటిదని, కాకతీయులు పానగలును రాజధాని చేసుకొని పరిపాలించే క్రమంలో పానగల్లులోని శ్రీ ఛాయా సోమేశ్వరాలయంతో పాటు నల్గొండ జిల్లాలో పలు దేవాలయాలు నిర్మించారన్నారు. అలాగే ఈ పచ్చల సోమేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు. కోరిన వారికి కొంగు బంగారమై అనునిత్యం ప్రజలకు అష్టైశ్వర్యాలు , ఆయురారోగ్యాలు నింపే దేవాలయంగా ఈ ఆలయం పేరుగాంచిందన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు తిరిగి తమ కోరికలు తీరిన అనంతరం మళ్లీ పునర్దర్శనం కోసం వస్తారన్నారు. ఇక్కడ ప్రతి మహా శివరాత్రి అలాగే కార్తీక పౌర్ణమి రోజు పలు జిల్లాల నుండి భక్తులు రావడం జరుగుతుందన్నారు.


పెరుగుతున్న ఓటర్లు.. తగ్గుతున్న ఓటింగ్.​.!

పెరుగుతున్న ఓటర్లు.. తగ్గుతున్న ఓటింగ్.​.! వరంగల్ పార్లమెంట్ స్థానంలో తగ్గుతూ వస్తున్న పోలింగ్ శాతం మూడు ఎలక్షన్స్ పోలిస్తే 13 శాతం డౌన్ మహబూబాబాద్ లోనూ సేమ్ సీన్ ఫలితాలనివ్వలేకపోతున్న అధికారుల చర్యలు ఎవరికి ఎఫెక్ట్ పడుతుందోనని నేతల్లో టెన్షన్ హనుమకొండ, వెలుగు : ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఓటర్లు పెరుగుతున్నా..  ఓటింగ్​తగ్గుతుంది. ఎలక్షన్ల టైంలో ఓట...


ఏనుగుల గుంపు పట్ల అలర్ట్ గా ఉండాలి : శాంతారామ్

ఏనుగుల గుంపు పట్ల అలర్ట్ గా ఉండాలి : శాంతారామ్ ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి కవ్వాల్ టైగర్ జోన్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారామ్ నస్పూర్, వెలుగు : ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు తెలంగాణ వైపు వచ్చే అవకాశం ఉందని, వాటి రాక పట్ల సంబంధిత అధికారులు అలర్ట్ గా ఉండాలని కవ్వాల్ టైగర్ జోన్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారామ్ అన్నారు. ...


KCR Comments: కాళేశ్వరానికి ఏ ఢోకా లేదు, భారీ ప్రాజెక్టుల్లో ఆ సమస్యలు సహజం - కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా లేదని.. దానివల్ల భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. క్షుద్ర ఆలోచనలతోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ర్పచారం చేస్తున్నారని అన్నారు. మెగా ప్రాజెక్టుల్లో కొన్ని లోపాలు ఉంటాయని.. అవి సహజమని అన్నారు. మిడ్ మానేరుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ బ్యారేజ్ కట్టారని.. అది ఒక వాన కురిస్తే కొట్టుకుపోయిందని అన్నారు. అలాంటప్పుడు తాము దాన్ని రాద్ధాంతం చేయలేదని అన్నారు. మొన్న...


బీజేపీ స్టార్ క్యాంపెయినర్​గా తమిళిసై

బీజేపీ స్టార్ క్యాంపెయినర్​గా తమిళిసై లిస్టులో మోదీ, అమిత్​ షా, నడ్డా సహా అగ్రనేతలు  సినీతారలు ఖుష్బూ, రాధిక, జీవిత కూడా.. 40 మంది పేర్లు ఎన్నికల కమిషన్​కు అందజేత హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ స్టార్ క్యాంపెయినర్​గా మాజీ గవర్నర్ తమిళిసైని బీజేపీ హైకమాండ్ నియమించింది. రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థా...


తెలంగాణలో వికలాంగ ఉద్యోగుల మనవి

తెలంగాణలో వికలాంగ ఉద్యోగుల మనవి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖలలో ఉద్యోగాలు చేస్తున్న వికలాంగులకు  కౌన్సిలింగ్​లో మొదటి ప్రాధాన్యత కల్పించాలి. వారికి అనుకూలమైన ప్రదేశాలలో నియమించాలి. రవాణా సౌకర్యం ఉండే ప్రాంతాలలో వీరిని నియమించాలి. వారు నివసిస్తున్న ప్రాంతానికి, వారు డ్యూటీ చేసే ప్రాంతానికి అతి దగ్గరగా ఉండే ప్రాంతాలను నిర్ణయించాలి. ప్రమోషన్లలో వికల...


ఏజన్సీ ప్రాంతాలలో ఐక్యతా రాగం.. ఆధ్యాత్మికతే మూలం అంటున్న గిరిజనులు !

భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు కూడలిగా నిలుస్తున్న ఆదిలాబాద్ జిల్లాలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. ఇక్కడి ప్రజలు యేడాది పొడవునా ఏదో ఒక ఉత్సవం, వేడుకను జరుపుకుంటూనే ఉంటారు. అవి ఇక్కడి ప్రజల సంస్కృతులను, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంటాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పల్లెల్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న వేడుకలు, ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది.గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పల్లెల్లో సందడి నెలకొంది....


హైదరాబాద్ లో తుక్కు బస్సులు ఎక్కువైతున్నయ్

హైదరాబాద్ లో తుక్కు బస్సులు ఎక్కువైతున్నయ్ గ్రేటర్​ ఆర్టీసీ పరిధిలో 521 కాలం చెల్లిన బస్సులు స్క్రాప్​పాలసీని పట్టించుకోని ఆర్టీసీ అధికారులు పొల్యూషన్​ టెస్టులు చేయకుండానే తిప్పుతున్నారు 15 ఏండ్లు నిండిన బస్సులతో సిటీలో పెరుగుతున్న కాలుష్యం హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలో కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు పెరిగిపోతున్నాయి. 15 ఏండ్లు నిండిన బస్సులన...


ప్రధాని మోదీ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందా?

రాజస్తాన్‌లో ముస్లింలపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ విషయంపై ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందా?


Suryapeta Accident: తీవ్ర విషాదం - కంటెయినర్ కిందకు కారు దూసుకెళ్లి దంపతుల దుర్మరణం, ఎక్కడంటే?

Couple Died in Suryapeta Road Accident: సూర్యాపేట (Suryapeta) జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో దంపతులు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. మునగాల మండలం ముకుందాపురం (Mukundapuram) శివారులో రహదారి పక్కన ఆగి ఉన్న కంటెయినర్ కిందకు కారు దూసుకెళ్లడంతో ప్రమాదం జరగ్గా.. ఈ ఘటన స్థానికంగా భయాందోళన కలిగించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామానికి చెందిన సామినేని నవీన్ రాజ్ (29)కు ఏపీలోని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా...


చిన్న పరిశ్రమలకు మరిన్ని లోన్లు

చిన్న పరిశ్రమలకు మరిన్ని లోన్లు న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న  మధ్యతరహా పరిశ్రమలలో (ఎంఎస్​ఎంఈ) ఈక్విటీ పెట్టుబడులను పెంచడానికి  కేంద్రం ప్రయత్నాలను ప్రారంభించింది. ముఖ్యంగా వీటికి అసంఘటిత రంగంలో ఫైనాన్సింగ్ అవకాశాలను పెంచడానికి మార్గాలను వెతుకుతోంది. ఢిల్లీలో సోమవారం జరిగిన సమావేశంలో కేంద్ర ఎంఎస్​ఎంఈల మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆ...


ఓటింగ్ శాతం పెంచేందుకు అవేర్ నెస్ క్యాంపెయిన్

ఓటింగ్ శాతం పెంచేందుకు అవేర్ నెస్ క్యాంపెయిన్ హైదరాబాద్, వెలుగు: స్వీప్ ప్రోగ్రామ్ లోభాగంగా హైదరాబాద్ జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు పెద్ద ఎత్తున ర్యాలీలు, మీటింగ్ లు నిర్వహించి  ఓటు ప్రాముఖ్యత పై ప్రజలకు అవేర్ నెస్ కల్పిస్తున్నారు. మంగళవారం సిటీలో చిరువ్యాపారులు, స్వయం సహాయక మహిళా సంఘలు, బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్ వైజర్లు కూడా ఓటరు అవేర్ నెస్ క్యాంపె...


Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం

Bridge Collapsed At Maneru River: పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలోని వంతెన కూలిపోయింది. ముత్తారం (Muttaram) మండలంలోని ఓడేడు గ్రామం వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జ్ సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా కూలిపోయింది. అయితే, ఈదురు గాలుల బీభత్సానికే వంతెన కుప్పకూలినట్లు స్థానికులు చెబుతున్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షానికి బ్రిడ్జ్ పిల్లర్లు కుంగిపోయాయి. దీనికి తోడు రాత్రి ఈదురు గాలుల ప్రభావంతో బ్రిడ్జిపై ఉన్న గైడర్లు కింద...


కాకినాడలో భలే మామిడి చెట్టు.. ఆకుల కన్నా కాయలు ఎక్కువ!

ఆ ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది మామిడి పంట ఆలస్యం పేరుతో ఎక్కడ మామిడి పండ్లు అనేవి కనిపించడం లేదు. కొన్నిచోట్ల మాత్రం మామిడి పండ్లు గదిలో మగ్గవేసి జాతీయ రహదారుల పక్కన అమ్మకాలు జరుపుతున్నారు. మరికొన్నిచోట్ల మామిడి మొక్కలకు తెగులు వచ్చిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే అందుకు భిన్నంగా ఒకే ఒక్కడు అన్నట్టుగా ఒకే ఒక్కమొక్క మామిడి కాయలు ఆ ఉమ్మడి జిల్లాలో విరగాస్తోంది. చెట్టుకు ఆకులు తక్కువ మామిడికాయలు ఎక్కువనే విధంగా ఆ చెట్టు కనిపిస్తుంది. ఇంతకీ ఆ...


స్టూడెంట్ల పట్ల సెక్యూరిటీ గార్డ్‌‌‌‌ అసభ్య ప్రవర్తన

స్టూడెంట్ల పట్ల సెక్యూరిటీ గార్డ్‌‌‌‌ అసభ్య ప్రవర్తన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మైనార్టీ గురుకులంలో ఘటన బెల్లంపల్లి, వెలుగు : ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ బాలిక పట్ల సెక్యూరిటీ గార్డు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మైనార్టీ గురుకులంలో సోమవారం జరిగింది. ఉదయం 7 గంటలకు స్కూల్‌‌‌‌ ఆవరణలో ఉన్న బాలిక వద్దకు ఔట్‌‌‌...


Anaparthy Politics: ఏపీలో విచిత్ర రాజకీయాలు, టికెట్ కోసం అభ్యర్ధుల్ని మార్చుకుంటున్న పార్టీలు

Anaparthy Politics: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ఏర్పడినా సీట్ల సర్దుబాటు సాధ్యం కాకపోవడంతో పరస్పర అంగీకారంలో పార్టీలు మారుతున్నారు. టికెట్ చేజిక్కించుకుంటున్నారు.


కాంగ్రెస్​లో చేరిన ప్రవీణ్​కుమార్​ తమ్ముడు

కాంగ్రెస్​లో చేరిన ప్రవీణ్​కుమార్​ తమ్ముడు గద్వాల, వెలుగు: పార్లమెంట్ ఎన్నికలవేళ బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంటరీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తమ్ముడు ఆర్ఎస్ ప్రసన్నకుమార్ కాంగ్రెస్​లో చేరారు. మంగళవారం హైదరాబాద్​లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ చీఫ్​గా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ క...


జల సంరక్షణ లేకుంటే సంక్షోభం తప్పదు!

జల సంరక్షణ లేకుంటే సంక్షోభం తప్పదు! వృక్షాలు, జంతువులు, మానవాళి, పెరుగుదలకు గాలి తరువాత ముఖ్యమైనది నీరు. ఇది ప్రకృతి సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపురూపమైన వరం.  ప్రకృతి వనరుల్లో భాగమైన నీరు సకల జీవజాతికి ప్రాణాధారం. పంటలకు, మానవజాతి మనుగడకు జలవనరులు కీలకం. తన అవసరాల నిమిత్తం నీటిని ఇష్టారీతిగా వినియోగిస్తున్నందున భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. గ్...


తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త

Tirumala No Rush: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.. తక్కువ సమయంలోనే దర్శనం పూర్తవుతోంది. గత రెండు రోజులుగా కొండపై పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం నేరుగా భక్తుల్ని శ్రీవారి దర్శనానికి క్యూ లైన్‌లోకి అనుమతిస్తున్నారు. అయితే ఈ వీకెండ్ నుంచి రద్దీ పెరుగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో రద్దీ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. మరోవైపు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు కూడా ముగిశాయి.


Hubli Girl Murder: కర్ణాటకలో యువతి హత్య.. యువకుడిని కఠినంగా శిక్షించాలని ముస్లిం సంఘాల డిమాండ్..

Hubli Girl Murder:కర్ణాటకలోని హుబ్బళీలో యువతి హత్య ఘటన తీవ్ర సంచనలంగా మారింది. దీనిపై బాధితులకు మద్దతుగా కర్ణాటకలో విద్యార్థులు, అనేక సంఘాలు నేతలు తమ నిరసలను తెలిపారు. ఇక్కడ ప్రస్తుతం ముస్లిం సమాజంసైతం యువకుడిని కఠినంగా పనిష్మెంట్ చేయాలని తమ నిరసలను తెలిపారు.


కారు ముందు పడుకొని మహిళ హల్ చల్

కారు ముందు పడుకొని మహిళ హల్ చల్ మెహిదీపట్నం, వెలుగు: ఓ మహిళ నడిరోడ్డుపై కారుకు అడ్డంగా పడుకొని, చనిపోతానంటూ హల్ చల్ చేసింది. సోమవారం సాయంత్రం దంపతులు లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ పక్కన బాలాజీ స్వీట్ హౌస్ సమీపంలో గొడవపడ్డారు. భార్యపై భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో క్షణికావేశానికి లోనైన మహిళ రోడ్డుపై వెళ్లే వాహనాలకు అడ్డంగా వెళ్లి ఓ రన్నింగ్ కారు ముందు పడ...


AP Summer Updates: నిప్పుల కుంపటిగా రాష్ట్రం, ఇవాళ మరింత తీవ్రంగా వడగాల్పులు

AP Summer Updates: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారుతోంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం

Navy Staff Died Due To Helicopters Collided In Malaysia: మలేషియాలో (Malaysia) మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశ నావికాదళానికి చెందిన హెలికాప్టర్లు గాలిలోనే ఒకదానికొకటి ఢీకొని 10 మంది సిబ్బంది మృతి చెందారు. రిహార్సల్స్ లో భాగంగా విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మలేషియా అధికారుల కథనం ప్రకారం.. ఆ దేశంలో ఈ నెల 26న (శుక్రవారం) రాయల్ మలేషియన్ నేవీ దినోత్సవం జరగనుంది. ఇందులో భాగంగా పెరక్ లోని లుమత్ ప్రాంతంలో మంగళవారం రిహార్సల్స్...


పౌరసత్వానికి మతం ప్రాతిపదికనా: విజయన్

పౌరసత్వానికి మతం ప్రాతిపదికనా: విజయన్ కన్నూర్: ప్రపంచంలోని ఏ దేశం కూడా మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వదని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) లౌకిక విలువలకు విరుద్ధమని తెలిపారు. సీఏఏకు వ్యతిరేకంగా అంతా పోరాడుతుంటే కాంగ్రెస్ మాత్రం ఎలాంటి నిరసనలు చేపట్టలేదన్నారు. సోమవారం మట్టన్నూరులో ఎ...


ఘోర ప్రమాదం.. గాలిలోనే రెండు హెలికాప్టర్లు ఢీ..

ఘోర ప్రమాదం.. గాలిలోనే రెండు హెలికాప్టర్లు ఢీ.. మలేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు గాలిలోనే ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే మలేషియాలో నేవీ పరేడ్ కోసం రిహార్సల్ లో భాగంగా గాలిలోకి రెండు హెలికాప్టర్లు ఎగిరాయి. ఈ క్రమంలోనే అదుపు తప్పి రెండు ఢీ కొన్నాయి. ...


పవన్ కళ్యాణ్ పిల్లలిద్దరూ ఇండియన్స్ కాదా..? OCIకి, భారత పౌరులకు తేడా ఏంటి..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మొత్తం నలుగురు పిల్లలు అనే సంగతి తెలిసిందే. అందులో ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆద్య.. రెండో భార్య రేణు దేశాయ్ దగ్గర ఉంటున్నారు. మూడో భార్య అన్నా లెజినోవాకు జన్మించిన పొలినా, మార్క్ శంకర్.. ఇద్దరూ ఓవర్సీస్ సిటిజన్లు అని పవన్ కళ్యాణ్ తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. మొత్తంగా నలుగురు పిల్లలను చూడాల్సిన బాధ్యత తనపై ఉందని జనసేనాని అఫిడవిట్లో వెల్లడించారు.


30 మంది అధికారులపై క్రిమినల్ కేసులు

30 మంది అధికారులపై క్రిమినల్ కేసులు హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల విధుల శిక్షణకు గైర్హాజరైన 30 మంది అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇటీవల 10 మందిపై కేసులు నమోదు చేయించిన కమిషనర్, తాజాగా 30 మందిపై చర్యలు తీసుకున్నారు. ఆర్పీ యాక్ట్ 1951, సెక్షన్134 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తునట్లు ...


రాష్ట్రస్థాయి ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్‌లో పారమిత విద్యార్థుల ప్రతిభ

ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ ఐ.యన్.టి.యస్.ఓ‌లో కరీంనగర్ జిల్లా పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి అవార్డులను కైవసం చేసుకున్నారు. గణితంలో రాష్ట్రస్థాయిలో వెల్ది.హర్షిణి 7వ తరగతి స్టేట్ 4వ ర్యాంకు, అర్హాన్ లతీఫ్ 8వ తరగతి స్టేట్ 4వ ర్యాంకు, సామాన్యశాస్త్ర విభాగంలో రాష్ర స్థాయిలో యన్.రుషిక 9వ తరగతి స్టేట్ 7వ ర్యాంకు సాధించి పతకాలు, బహుమతులు గెలుపొందారు. అదే విధంగా ఐదుగురు విద్యార్థులు స్ఫూర్తి గణితం,...


జగన్ -చంద్రబాబు- పవన్ ఆస్తుల వివరాలు..? ఎవరు సంపన్నులు, ఎవరి ఆస్తి ఎంత....?

ఆంధ్రప్రదేశ్ లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో నామినేషన్లు దాఖలు చేస్తున్న క్రమంలో అభ్యర్థులు తమ అఫిడవిట్ లలో ఆస్తులు, అప్పులు చూపించాల్సి ఉంది. ఇక ఏపీలో పార్టీల అధిపతులైన చంద్రబాబు, జగన్, పవర్ ల ఆస్తుల వివరాలు ఏంటీ..? ఎవరి ఆస్తి పెరిగింది..? ఆస్తులవిషయంలో ఎవరు ముందున్నారు..? దేశ మతా ఎన్నికల సందడి స్టార్ట్ అయ్యింది. ఇటు ఆంధ్రప్రేదేశ్ లో కూడా ఎన్నికల వేడి గట్టిగా రాజుకుంది. నాయకుల ప్రచారాలతో ఆంధ్రా హోరెత్తిపోతోంది. ఈక్రమంలో...


ఇద్దరు వ్యాపారుల వద్ద రూ. కోటి 15 లక్షలు సీజ్

ఇద్దరు వ్యాపారుల వద్ద రూ. కోటి 15 లక్షలు సీజ్ బషీర్ బాగ్, వెలుగు: లోక్ సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈస్ట్ జోన్ , అఫ్జల్ గంజ్ పోలీసులు సోమవారం రాత్రి గౌలిగూడ చౌరస్తాలో తనిఖీల్లో భాగంగా రూ. 50 లక్షల నగదు పట్టుకున్నారు. గౌలిగూడకు చెందిన కుమార్ కు బేగం బజార్ లో కుమార్ జ్యువెలర్స్ షాప్ ఉంది. సోమవారం రాత్రి షాప్ మూసివేసి తన ఇంటికి వాహనంలో అతడు వెళ్తుండగా పో...