THURSDAY FASTING RULES గురువారం ఉపవాసం దీక్షను ఆచరిస్తే.. ఎలాంటి ఫలితాలొస్తాయంటే...

Thursday Fasting Rules హిందూ మత విశ్వాసాల ప్రకారం, గురువారం రోజున ఉపవాస దీక్షను కొనసాగించే వారు కొన్ని నియమాలను పాటించాలి.. ఇలా చేయడం వల్ల ప్రత్యేక ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా ఏయే నియమాలు పాటించాలనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Thursday Fasting Rules హిందూ మత విశ్వాసాల ప్రకారం, ప్రతి సంవత్సరం.. ప్రతి నెలా.. ప్రతి వారం.. ప్రతిరోజూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇలాంటి ప్రత్యేక రోజుల్లో హిందువులు ఉపవాసం వ్రతాన్ని ఆచరిస్తారు. ముఖ్యంగా గురువారం రోజున ఉపవాసం ఉండటం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతారు. అయితే ఉపవాసం ఉండే వారు కొన్ని పద్ధతులను కచ్చితంగా పాటించాలి.. అలా పాటించకుండా మీరు ఎంత సమయం ఉపవాసం ఉన్నప్పటికీ ఫలితం ఉండదని పండితులు చెబుతున్నారు. అంతేకాదు మీ సమస్యలకు పరిష్కారం దొరక్కపోగా.. మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు. ఈ సందర్భంగా గురువారం రోజున ఉపవాసం ఉండే వారు ఏయే నియమాలను తప్పనిసరిగా పాటించాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...ఉపవాస దీక్ష కాలం..

హిందూ పంచాంగం ప్రకారం, ఏ మాసంలో ఏ గురువారం అయినా ఉపవాసం ఉండొచ్చు. అయితే ఉపవాస తీర్మానం ద్వారా ఉపవాసాన్ని ప్రారంభించాలి. అయితే బ్రహ్మ ముహుర్తంలో తలస్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ తీర్మానాన్ని తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఉపవాస కాలాన్ని కూడా ముందే నిర్ణయించాలి. తీర్మానం లేకుండా చేసే ఉపవాసం వల్ల ఎలాంటి ఫలితం ఉండకపోవచ్చని పండితులు చెబుతున్నారు. అలాగే గురువారం నాడు ఉపవాసం ప్రారంభించే మొత్తం 16 గురువారాల పాటు చేయాలి. ఇలా మూడేళ్ల వరకు చేస్తే శుభ ఫలితాలొస్తాయి.​Akshaya Tritiya 2024 అక్షయ తృతీయకు, బంగారానికి ఉన్న అవినాభవ సంబంధమేంటో తెలుసా...

ఉపవాసాలలో రకాలు..

ఉపవాసాలలో మొత్తం నాలుగు రకాలున్నాయి. అందులో మొదటిది నిర్జలోపవాసం, జలోపవాసం, రసోపవాసం, ఫలోపవాసం. ఈ రకమైన ఉపవాస ఆచారాల వల్ల మన శరీరం శుద్ధి అవుతుందని పండితులు చెబుతున్నారు. ఇందులో మీకు ఏ రకమైన ఉపవాస పద్ధతి వీలవుతుందో వారు మాత్రమే అలాంటి వారు మాత్రమే ఉపవాసం ఉండాలి.

వీటిని ప్రాధాన్యత ఇవ్వాలి..

జలోపవాసం తీసుకున్న వారు ఉపవాసం సమయంలో నీటిని తాగొచ్చు. అయితే ఘన పదార్థాలేవీ తీసుకోకూడదు. మొత్తం ఐదు లీటర్ల వరకు నీళ్లను తాగొచ్చు. రసోపవాసం తీసుకున్న వారు ఏదైనా పండ్లను తినొచ్చు. అయితే అరటిపండుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫలోపవాసం ఉండే కొబ్బరినీళ్లు, బత్తాయి వంటివి తీసుకోవాలి. ఉపవాసం వ్రతాన్ని ఆచరించే రోజున నలుపు రంగు దుస్తులను అస్సలు ధరించొద్దు. కేవలం తెలుపు, పసుపు రంగుల్లో ఉండే దుస్తులను మాత్రమే ధరించాలి.

దానధర్మాలు చేయాలి..

ఉపవాసం ఉండేవారు ఈ రోజంతా బ్రహ్మచార్యం పాటించాలి. భాగస్వామితో కలయికలో పొరపాటున కూడా పాల్గొనకూడదు. మీ ఉపవాస వ్రతం విజయవంతం అయ్యేందుకు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కోపం తెచ్చుకోకూడదు. ప్రతికూల ఆలోచనలు చేయకూడదు. ఇదే రోజున మీ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయడం వల్ల మీ ఇంట్లో సంపద, ఐశ్వర్యం పెరుగుతాయని పండితులు చెబుతారు.గమనిక : ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.Read Latest Religion News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-24T15:00:21Z dg43tfdfdgfd