AP ELECTIONS LIVE UPDATES: ఏపీలో పింఛన్‌దారులకు గుడ్ న్యూస్..

ఏపీలో పింఛన్ దారులకు గుడ్ న్యూస్..

  • పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్న ప్రభుత్వం
  • బ్యాంకు అకౌంట్లు లేనివారికి ఇంటివద్దనే పంపిణీ
  • దివ్యాంగులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇళ్లవద్దనే పంపిణీ
  • మే 1 నుంచి 5వ తేదీ వరకూ పంపిణీ
  • సీఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయం

వైఎస్సార్‌సీపీకి షర్మిల ఆగ్రహం

* వైసీపీ పాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు: షర్మిల

* ఇప్పుడు కొత్త దాన్ని ప్రజలు ఎలా నమ్మాలి: షర్మిల

* మద్యనిషేధం చేయకపోగా.. ప్రభుత్వమే విక్రయిస్తోంది: షర్మిల

* మెగా డీఎస్సీకి బదులు దగా డీఎస్సీ ఇచ్చారు: షర్మిల

* ఏటా సంక్రాంతికి ఇస్తామన్న జాబ్‌ క్యాలెండర్‌ ఏమైంది: షర్మిల

* పొన్నవోలు జగన్‌పై స్వామిభక్తిని చాటుకున్నారు: షర్మిల

* మహిళ అనే సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు: షర్మిల

* 2019 మే 30న జగన్‌ సీఏంగా పదవి చేపట్టిన 6 రోజుల్లోనే పొన్నవోలుకు పోస్టింగ్: షర్మిల

* ఏ సంబంధమూ లేకపోతే ఆయనకు ఏఏజీగా ఎందుకు అవకాశం ఇచ్చారు: షర్మిల

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ చివరి దశకు చేరింది. సోమవారం నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ.. పోలింగ్‌కు మరో 15 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇంటింటి ప్రచారంతో పాటుగా మేనిఫెస్టోలను కూడా ప్రచారం చేయనున్నారు. అయితే వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను విడుదల చేయగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోను విడుదల చేయాల్సి ఉంది. ఒకటి, రెండు రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు.. ఎన్నికల లైవ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.

* వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండో దశ ఎన్నికల ప్రచారం నేటి నుంచి ప్రారంభించనున్నారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం సీఎం వైఎస్‌ జగన అనంతపురం జిల్లా తాడిపత్రికి ఆదివారం వస్తున్నారు. పట్టణంలోని వైఎస్సార్‌ సర్కిల్‌లో నిర్వహించే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. పుట్లూరు రోడ్డులోని కర్నూలు వెంచర్‌ సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు ఉదయం 10 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో వైఎస్సార్‌ సర్కిల్‌కు చేరుకుంటారు. 10:15 గంటలకు సభలో ప్రసంగిస్తారు. ఆ తరువాత తిరుపతి జిల్లా వెంకటగిరికి బయలుదేరుతారు.. అక్కడ సభ తర్వాత నెల్లూరు జిల్లా కందుకూరు లో సభలో పాల్గొంటారు.

* తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నెల్లూరు సిటీ నియోజకవర్గం, కోటమిట్టలోని షాదీ మంజిల్ ఫంక్షన్ హాలులో ముస్లింలతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. చంద్రబాబు ఈనెల 29వ తేదీన నందికొట్కూరు సభకు వెళతారు. అల్లూరు సర్కిల్‌, కొత్త బస్టాండ్‌ మీదుగా పటేల్‌ సెంటర్‌ వరకు రోడ్డు షో, పటేల్‌ సెంటర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారన్నారు. అనంతరం అల్లూరు గ్రామం వద్ద బస చేస్తారు.

* జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. ఇవాళ కాకినాడ జిల్లా జగ్గంపేట, ప్రత్తిపాడులో ప్రచారం చేస్తారు. జనసేనాని సోమవారం తాడేపల్లిగూడెంలో పర్యటనకు వెళతారు. పట్టణంలోని గొల్లగూడెం సెంటర్‌ రామాలయం వద్ద సాయంత్రం 5.30 గంటలకు పవన్‌కల్యాణ్‌ బహిరంగ సభ జరుగుతుంది. సోమవారం ఉదయం 8 గంటలకు గొల్లప్రోలు మండలం చెందుర్తి నుంచి రోడ్‌షో ప్రారంభించి కొడవలి, వన్నెపూడి, మీదుగా పిఠాపురం మండలంలోకి ప్రవేశించి వెల్దుర్తి, పి.తిమ్మాపురం, బి.కొత్తూరు, గోకివాడ, జములపల్లి, నరసింగపురం, ఎల్‌ఎన్‌పురం, విరవాడ, విరవ, మల్లాం, జల్లూరు, కందరాడ, కుమారపురం గ్రామాల మీదుగా రోడ్‌షో సాగుతుంది. 29వ తేదీ రోడ్‌షోలో పంట పొలాలు పరిశీలించడంతో పాటు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్వీర్యం కావడం వలన రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకుంటారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-27T23:58:56Z dg43tfdfdgfd