AP ELECTIONS LIVE UPDATES: మరోసారి మోసపోవద్దు: చంద్రబాబు

జగన్‌ను నమ్మి మరోసారి మోసపోవద్దు: చంద్రబాబు

* నంద్యాల జిల్లా పాణ్యం ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు

* మీ కోపాన్ని, ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపించాలి

* ఈ నెల 13న పోలింగ్‌ కేంద్రంలో వైకాపాను చిత్తచిత్తుగా ఓడించాలి

* వైఎస్సార్‌సీపీని భూస్థాపితం చసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు

* ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేని అసమర్థుడు జగన్‌

* జగన్‌.. అహంకారి, సైకో, విధ్వంసకారుడు, దోపిడీదారుడు

* రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ జగన్‌ సర్వనాశనం చేశారు

* వాళ్లు చెప్పిందే చేయాలి.. లేకపోతే దాడి చేసి చంపేస్తారు: చంద్రబాబు

* అబద్ధాలు చెప్పి ఇంకెంత కాలం మోసం చేస్తారు: చంద్రబాబు

* కోడికత్తి, గులకరాయి దాడి నాటకాలాడారు

* జగన్‌ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు

* ఎన్నికల ముందు అమరావతే రాజధాని అన్నారు

* అధికారంలో మూడు రాజధానుల నాటకమాడారు

* మూడు రాజధానులు కాదు.. ఒక్క రాజధాని అయినా కట్టారా?

* ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగారు

* ఇవాళ జనం ముందుకు వచ్చి అబద్ధాలు చెబుతున్నారు: చంద్రబాబు

సాయంత్రంలోగా డీజీపీని ఎంపిక చేయనున్న ఎన్నికల సంఘం

* డీజీపీ పోస్టుకు ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్‌ను ఈసీకి పంపిన ప్రభుత్వం

* ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్‌, హరీష్‌కుమార్‌ గుప్తా పేర్లను పంపిన ప్రభుత్వం

* ముగ్గురిలో ఒకరిని డీజీపీగా ఎంపిక చేయనున్న ఎన్నికల సంఘం

* ఈ సాయంత్రానికి ఉత్తర్వులు జారీచేసే అవకాశం

* ద్వారకా తిరుమలరావు 1990 బ్యాచ్‌కు చెందిన అధికారి

* ద్వారకా తిరుమలరావు ఆర్టీసీ ఎండీగా ఉన్నారు

* మాదిరెడ్డి ప్రతాప్‌ 1991, హరీశ్‌కుమార్ గుప్తా 1992 బ్యాచ్‌లు

* హరీశ్‌కుమార్‌ గుప్తా ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు

అవినాష్‌ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు చేయడం మాకు రాదు: షర్మిల

* కడపలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మీడియా సమావేశం

* తండ్రి పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో పెట్టిన వారికి ఏజీ పదవి ఇచ్చారు: షర్మిల

* సీబీఐ విచారణ కావాలని అధికారంలో లేనప్పుడు అడిగారు

* అధికారంలోకి రాగానే వద్దన్నారు.. సమాధానం చెప్పాలి

* జగన్‌ను చూసుకునే నాపై తెలంగాణ నేత రాఘవరెడ్డి ఆరోపణలు

* రూ.వెయ్యి కోట్లు తీసుకున్నట్లు రుజువు ఉంటే బయటపెట్టాలి

* నా భర్త అనిల్‌ భాజపా నేతను ఎక్కడా కలవలేదు.. కలవరు

* అవినాష్‌ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు చేయడం మాకు రాదు: షర్మిల

నేను ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ప్రత్యక్ష బాధితుణ్ని: మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌

కృష్ణా జిల్లా విన్నకోటలో పట్టాభూముల మ్యుటేషన్‌కు ఇబ్బందిపడ్డా

చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూముల మ్యుటేషన్‌కు నిరాకరించారు

పట్టా భూమల మ్యుటేషన్‌కు రెవెన్యూ అధికారులు నిరాకరించారు

తహసీల్దార్‌ నా దరఖాస్తును తిరస్కరించారు

పోస్టు ద్వారా ఆర్డీవో పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగిచ్చేశారు

నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు

ఐఏఎస్‌ అధికారిగా 36 ఏళ్లు ఏపీకి సేవలందించిన నాకే ఇలాంటి పరిస్థితి

ఒక సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేం: మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడింది. ప్రచారానికి ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రధాన పార్టీల నేతలు, అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ప్రచారానికి తక్కువ సమయం మాత్రమే ఉండటంతో వీలైనన్ని ఎక్కువ సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేసుకుంటున్నారు. నేడు ప్రధాని మోదీ ప్రచారం కోసం రాష్ట్రానికి వస్తున్నారు.. అలాగే సీఎం జగన్ ఒక రోజు గ్యాప్ తర్వాత నేటి నుంచి మళ్లీ ప్రచారానికి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తాజా పరిణామాలు.. లైవ్ అప్డేట్స్‌ ఇలా ఉన్నాయి.

* ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాష్ట్రానికి వస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంతో పాటు అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తారు. ముందుగా రాజమహేంద్రవరం లోక్‌సభ పరిధిలోని వేమగిరిలో మధ్యాహ్నం 3.30గంటలకు నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5.40గంటలకు అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం సమీపంలో నిర్వహించనున్న సభకు హాజరవుతారు. ఈ కార్యక్రమానికి తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌లు పాల్గొంటారు.

* ప్రధాని మోదీ నేడు రాజమహేంద్రవరం వస్తున్నారు. ప్రధాని ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట 35 నిమిషాలకు ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పూర్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఐఏఎఫ్‌ ఎంబ్రే యర్‌ మీద బయలుదేరి 2.25 గంటలకు రాజమండ్రి విమానాశ్ర యానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 2.30 గంటలకు ఎం.ఐ 17 హెలికాప్టర్‌ మీద 2.50 గంటలకు వేమగిరిలో ఏర్పాటుచేసిన హెలి పాడ్‌కు వస్తారు. అక్కడి నుంచి 2.55 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి 3 గంటలకు సభావేదిక వద్దకు వస్తారు. అక్కడ 3 గంటల నుంచి 3.45 గంటల వరకూ అంటే మొత్తం 45 నిమిషాల పాటు వేదిక మీద ఉంటారు. విజయశంఖారావం పేరుతో జరిగే ఈ సభకు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో పాటుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరవుతారు.

* ప్రధాని రాజమహేంద్రవరంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి 4.50 గంటలకు అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం చేరుకుంటారు. అక్కడ నుంచి బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకొని ప్రసంగిస్తారు. సాయంత్రం 5.45 గంటలకు రోడ్డు మార్గంలో విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబుల కోసం మూడు హెలీప్యాడ్‌లను సిద్ధం చేశారు.

* తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ప్రజాగళం సభకు హాజరవుతారు. పాణ్యం చెన్నసర్కిల్‌కు 10:55 గంటలకు చేరుకుంటారు.. 11 నుంచి 12:30 వరకు ప్రజాగళం సభలో మాట్లాడతారు. చంద్రబాబు మధ్యాహ్నం 2.30 గంటలకు కర్నూలు నుంచి బయలుదేరి 3.40 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 3.50 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 4 గంటలకు కశింకోట మండలం ఉగ్గినపాలెంలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌కు సాయంత్రం చేరుకుంటారు. 4.40 గంటలకు ఉగ్గినపాలెం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి తాళ్లపాలెం సభా వేదిక వద్దకు ఐదు గంటలకు చేరుకుంటారు. సభ అనంతరం 6.40 గంటలకు రోడ్డు మార్గంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. అక్కడ నుంచి హైదరాబాద్‌ వెళతారు.

* వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ మూడు నియోజకవ­ర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇవాళ ఉదయం 10 గంటలకు బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలోని రేపల్లెలో ఉన్న డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ విగ్రహం సెంటర్‌లో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని మాచర్లలో ఉన్న శ్రీనివాస్‌ మహల్‌ సెంటర్‌లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నంలోని వల్లూరి రాజా సెంటర్లో జరిగే ప్రచార సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-06T00:00:25Z dg43tfdfdgfd