AP TRAFFIC ALERT: విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా

దేశ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ నెల 8న ప్రధాని మోదీ విజయవాడలో జరిగే ప్రచారానికి హాజరవుతారు. ఈ క్రమంలో నగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. మోదీ పర్యటించే ప్రాంతాల్లో రెండు కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని రెడ్‌జోన్‌ (నో ఫ్లయింగ్‌ జోన్‌)గా ప్రకటించారు. డ్రోన్లు, బెలూన్లు ఎగరేయడం నిషేధం.. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపర చర్యలు తీసుకుంటారు. ఏరియా డామినేషన్‌, రోడ్‌ ఓపెనింగ్‌ పార్టీస్‌, కట్‌ ఆఫ్‌ పార్టీస్‌, రూఫ్‌ టాప్స్‌, రోప్‌ పార్టీస్‌, యాంటీ సబోటేజ్‌ చెక్‌ బృందాలను నియమించారు పోలీసులు.

ప్రధాని మోదీ గన్నవరం విమానాశ్రయం నుంచి పీవీపీ మాల్‌ దగ్గరకు రోడ్డు మార్గం ద్వారా చేరుకుంటారు. అక్కడి నుంచి బెంజిసర్కిల్‌ వరకు 1.3 కిలోమీటర్ల దూరం రోడ్‌షో నిర్వహిస్తారు. శాంతిభద్రతల విభాగం, ఏపీఎస్పీ, పారా మిలటరీ బలగాలను మోహరించారు. మొత్తం 5వేల మందితో రూట్‌ బందోబస్తు, ఇతర భద్రతా ఏర్పాట్లు చేశారు. రోడ్‌షో ప్రాంతం, పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోడ్ షోలో కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ కూడా పాల్గొంటారు.

ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రతపై ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ పి.హెచ్‌.డి.రామకృష్ణ సమీక్ష నిర్వహించారు. రెడ్‌జోన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని.. బందోబస్తు, ఇతర భద్రతా ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చూడాలని సూచించారు. ప్రధాని పోలీస్ అధికారులతో కలిసి భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలతో పాటు నగరంలో ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించారు.

ప్రధాని పర్యటన సందర్భంగా.. విజయవాడ బందర్‌ రోడ్డులో ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి బెంజ్‌ సర్కిల్‌ వరకు

సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది. బందర్‌ రోడ్డులో బెంజ్‌ సర్కిల్‌ నుంచి ఆర్టీసీ వై జంక్షన్ వరకు.. ఆర్టీసీ వై జంక్షన్ నుంచి బోంజ్‌ సర్కిల్‌ వరకు ఎటువంటి వాహనాలను అనుమతించరు. ఆ వాహనాలు ఏలూరు రోడ్డు మీదుగా కానీ, కృష్ణలంక జాతీయ రహదారిపై వెళ్లాలని సూచించారు పోలీసులు.

రామవరప్పాడు నుంచి వచ్చు వాహనాలు మహానాడు జంక్షన్‌ నుంచి ఆటోనగర్‌ మీదుగా మళ్లిస్తారు. అక్కడ నుంచి ఆటోనగర్‌ గేటు -పటమట-ఎన్టీఆర్ సర్కిల్-కృష్ణవేజి రోడ్డు - రామలింగేశ్వర నగర్‌-స్క్రూ బ్రిడ్డి -వారధి వైపు వెళ్లాలి. పటమట నుంచి బెంజ్‌ సర్కిల్‌ వైపు వచ్చు వాహనాలు ఆటో నగర్‌ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా కానీ పటమట ఎన్టీఆఱ్ సర్కిల్‌ నుంచి రామలింగేశ్వరనగర్‌ మీదుగా వెళ్లాలి.

ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్‌ వరకు అనుసంధానంగా ఉన్న వీధులలో నుంచి వాహనాలనుఐందరు రోడ్డులోనికి అనుమతించబిడవు. సదరు దారులు ఏలూరు రోడ్డు లేదా రూటు నెం.5 ఉపయోగించుకోవాలని కోరారు. ఇతర జిల్లాల నుంచి విజయవాడ మీదుగా వెళ్లే సరుకు రవాణా, భారీ వాహనాాలు కూడా మళ్లించారు. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లు సరుకు

రవాణా వాహనాలు బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రీ 9 గంటల వరకు ఇబ్రహీంపట్నం వద్ద నుంచి మైలవరం, తిరువూరు, సత్తుపల్లి, అశ్వారావు పేట వైపునకు మళ్లిస్తారు. విశాఖపట్నం నుంచి హైదరాబార్‌ వెళ్లే సరుకు రవాణా వాహనాలను కూడా ఆ మార్గంలోనే మళ్లిస్తారు.

]]>

విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే సరుకు రవాణా వాహనాలు హనుమాన్‌ జంక్షన్‌ దగ్గర మళ్లించి..-గుడివాడ -పామర్రు-అవనిగడ్డ-పెనుమూడి వారధి -రేపల్లె-బాపట్ల-త్రోవగుంట వెళ్లాలి. చెన్నె నుంచి విశాఖపట్నం వెళ్లే సరుకు రవాణా వాహనాలు కూడా పై మార్గంలోనే మళ్లిస్తారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుచి రాత్రి 9 గంటల వరకు బందర్‌ రోడ్డు, రూటు నెం.5 లో ఆర్టీసీ వై జంక్షన్‌ నుండి బెంజ్‌ సర్కిలు వైపునకు.. బెంజ్‌ సర్కిల్ నుంచి ఆర్టీసీ వై జంక్షన్ వైపునకు సిటీ బస్సులు అనుమతించబడవు. ఆ బస్సులను ఆర్టీసీ వై జంక్షన్ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు రింగ్‌ మహానాడు మీదుగా -ఆటోనగర్ నుంచి బందర్ రోడ్డులోకి అనుమతిస్తారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T01:48:54Z dg43tfdfdgfd