TRAINS CANCELLED: ఏపీ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఈ రైళ్లు దారి మళ్లింపు, మరికొన్ని రద్దు

ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక. కొరాపుట్‌-రాయగడ సెక్షన్‌లో భద్రతాపరమైన పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటి గమ్యాలు కుదించినట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. ఈ నెల 29, మే 3, 6 తేదీల్లో విశాఖ-కొరాపుట్‌(18512), ఈ నెల 30, మే 4, 7 తేదీల్లో కొరాపుట్‌-విశాఖ(18511) బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేశారు.

ఏప్రిల్‌ 28 నుంచి మే 8 వరకు విశాఖ-కొరాపుట్‌(08546), ఏప్రిల్‌ 28 నుంచి మే 9 వరకు కొరాపుట్‌-విశాఖ(08545) రైళ్లు రాయగడ వరకు నడుస్తాయి. తిరుగు ప్రయాణంలో రాయగడ నుంచి బయలుదేరుతాయి. ఈ నెల 28న ఉదయం 10.15 గంటలకు బయలు దేరాల్సిన ఎస్‌ఎంవీ బెంగళూరు-జాషిది (22305) ఎక్స్‌ప్రెస్‌ 29న ఉదయం 6.45 గంటలకు బయలు దేరేలా మార్పు చేశారు.

విజయవాడ- కాజీపేట మార్గంలో ఇంజినీరింగ్‌ పనులు జరుగుతున్నందున పలు రైళ్లు గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం ఎల్‌టీటీ- విశాఖపట్నం (18519)/(18520) రైలు ఈనెల 29 నుంచి మే 9వ తేదీ వరకు, తిరిగి మే 15 నుంచి 21వ తేదీ వరకు గుంటూరు మీదుగా నడుస్తుందని తెలిపారు.

షాలిమార్‌- హైదరాబాద్‌- షాలిమార్‌ (18045)/ (18046) మే 2, 3, 8, 9, 20, 21 తేదీల్లో గుంటూరు మీదుగా సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌- షాలిమర్‌(12774) మే 21న గుంటూరు మీదుగా సికింద్రాబాద్‌ వెళ్తుంది. సికింద్రాబాద్‌- షాలిమార్‌- సికింద్రాబాద్‌ (07225)/07226) ఈనెల 29, మే 6, 20 తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు మీదుగా విజయవాడ వెళ్తుందని తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-29T03:03:23Z dg43tfdfdgfd