ఆ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నా.. తేల్చి చెప్పిన రఘురామకృష్ణరాజు

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సొంత నియోజకవర్గానికి వెళ్లారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరలోని పెదఅమిరంలోని తన నివాసంలో స్థానికుల్ని కలిశారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై పూర్తి విశ్వాసం ఉంది అన్నారు రఘురామ. జగన్‌మోహన్‌రెడ్డిని వాళ్లు ప్రేమించరు అనేది తన ప్రగాఢ నమ్మకం అన్నారు. కూటమి అభ్యర్థిగా నరసాపురం నుంచి పోటీ చేయగలననే విశ్వాసం ఉందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొన్న తనను జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు తాను చేయగలిగిన సాయం చేశారన్నారు. అంత సహాయ పడిన వ్యక్తి తనకు ఎందుకు అన్యాయం చేస్తారన్నారు.

తనను చంపకుండా, తన పదవి పోకుండా కాపాడిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు అన్యాయం చేస్తారనే ఆలోచన లేదన్నారు. మూడురోజులా, నాలుగురోజులు పడుతుందా అనేది చెప్పలేనని.. తనకు సీటు వచ్చే విషయంపై తన కన్నా ఎక్కువగా తన నియోజకవర్గ ప్రజలకే కాదు, రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డిని ద్వేషించే అందరికీ నమ్మకం ఉంది అన్నారు. బీజేపీ రాష్ట్ర అధిష్ఠానంతో తనకు పరిచయంగాని, సాన్నిహిత్యం గాని లేదన్నారు. దాంతోనే అంతరం వచ్చి ఉండొచ్చన్నారు. తనకు మద్దతుగా కొన్ని వేల మంది నుంచి ఫోన్లు వచ్చాయని.. కూటమి నూటికి నూరుశాతం తనకు న్యాయం చేస్తుంది అన్నారు. అందుకు అందరూ మద్దతుగా రావాలని కోరుతున్నానన్నారు.

ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌లో ఉన్న సీబీఐ కోర్టును 3 వేల వాయిదాలు కోరారన్నారు రఘురామ. వాటిని త్వరగా విచారించాలని ఒకటి, ఇన్నాళ్లూ న్యాయస్థానానికి వెళ్లకపోవడంతో బెయిల్‌ రద్దు చేయాలని మరొక పిటిషన్‌ వేశానన్నారు. ఆ రెండు పిటిషన్లు సుప్రీంకోర్టులో ఏప్రిల్‌ 1న విచారణకు రాబోతున్నాయని.. హైకోర్టు, సుప్రీంకోర్టు, ప్రజాకోర్టుల్లో ఆ ఉన్మాదిపై ఒంటరిగా పోరాటం చేస్తున్నానన్నారు. తన కేసు తప్పు అనడానికి లేదని.. 3 వేలకుపైగా వాయిదాలు కోరిన మాట నిజం అన్నారు.

అన్ని వాయిదాలు ఇవ్వకూడదనే నిబంధనలు ఉన్నమాట నిజం అన్నారు. ఏమవుతుందో చూద్దాం.. వై.ఎస్‌ జగన్‌ ఎన్నోసార్లు తనను అనుకున్నది చేయలేకపోయారన్నారు. డిస్‌క్వాలిఫై చేయలేకపోయారని.. చంపలేక పోయారన్నారు. చాలా విషయాల్లో ఫెయిల్‌ అయ్యారని.. ఇప్పుడు టికెట్‌ విషయంలో ఫెయిల్‌ అవుతారనుకున్నట్లు చెప్పుకొచ్చారు. తాత్కాలికంగా ఆయన విజయం సాధించారని.. ముందుచూపుతోనే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో తాను చెప్పలేదన్నారు. బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉండొచ్చని.. తాను ఏ పార్టీలోనూ లేనన్నారు. ఆ పార్టీలూ అదే చెబుతున్నాయన్నారు. రఘురామ నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేద్దామని భావించారు.. ఆ సీటు బీజేపీకి కేటాయించడంతో.. ఆ పార్టీ టికెట్ ఇష్తుందని భావించారు. కానీ అనూహ్యంగా రఘురామను కాదని.. శ్రీనివాసవర్మకు టికెట్ ఇచ్చారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-29T01:26:28Z dg43tfdfdgfd