ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఇకపై ఓటరు ఫోటో బదులు క్యూఆర్ కోడ్

దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి.. అయితే ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఓటరు సమాచారం ఉండే చీటీ (స్లిప్‌)పై సంబంధిత వ్యక్తి ఫొటోతో పాటు వివరాలు ఉండేవి. ఈ సారి ఎన్నికల సంఘం సంస్కరణలలో భాగంగా వాటిలో కీలక మార్పు చేసింది. ఆ చీటిపై ఫొటోను తొలగించి, ఆ స్థానంలో క్యూఆర్‌ కోడ్‌‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం వాటిని బీఎల్వోలు ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. https://voters.eci.gov.in/ వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావాలి.. అక్కడున్న క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే.. ఓటర్‌ పేరు, వివరాలతోపాటు ఎపిక్‌ నెంబర్‌, క్రమసంఖ్య, పోలింగ్‌స్టేషన్‌ వంటి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఓటు వేసే సమయంలోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పొందుపరిచారు.

ఎన్నికల సంఘం ఇస్తున్న ఈ ఓటరు చీటి కేవలం వివరాల కోసం మాత్రమే అంటున్నారు అధికారులు. ఓటేయ్యాలంటే దాంతో పాటు ప్రభుత్వం గుర్తించిన 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓటర్లు పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఉపాధి హామీ పథకం కార్డు, ఆరోగ్య బీమా కార్డు, పాన్ కార్డు, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగుల ఐడీ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, పోస్టాఫీస్ పాస్ పుస్తకం, ఆర్జీఐ జారీ చేసిన ఎన్‌పీఆర్ స్మార్ట్ కార్డు, ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, ఈసీ జారీ చేసిన ఫోటోతో కూడిన ఓటరు స్లిప్పు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గుర్తింపు కార్డులను అనుమతిస్తారు. వీటితో ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T08:20:08Z dg43tfdfdgfd