AP ELECTIONS LIVE UPDATES.. టీడీపీలో చేరిన హీరో నిఖిల్.. లోకేష్ సమక్షంలో చేరిక

టీడీపీలోకి హీరో నిఖిల్.. నారా లోకేష్ సమక్షంలో చేరిక

  • టీడీపీలో చేరిన సినీ హీరో నిఖిల్
  • నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన నిఖిల్
  • టీడీపీ తరుఫున ఎన్నికల బరిలో నిఖిల్ మామ
  • బాపట్ల జిల్లా చీరాల నుంచి పోటీ చేస్తున్న మద్దులూరి మాలకొండయ్య
  • హీరో నిఖిల్ మామే.. మద్దలూరి మాలకొండయ్య

చీపురుపల్లిలో టీడీపీకి బిగ్ షాక్

  • చీపురుపల్లి టీడీపీ ఇంఛార్జి కిమిడి నాగార్జున రాజీనామా
  • చీపురుపల్లి టికెట్ కళా వెంకట్రావుకు ఇవ్వటంతో మనస్తాపం
  • ఇంఛార్జి పదవికి రాజీనామా చేసిన కిమిడి నాగార్జున

టీడీపీ నాలుగో జాబితా ఎఫెక్ట్- భగ్గుమన్న అనంతపురం తమ్ముళ్లు

  • అనంతపురం అర్భన్‌ టీడీపీలో అసమ్మతి
  • దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌‌కు టికెట్ ఇవ్వటంపై అసంతృప్తి
  • మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అసంతృప్తి
  • టీడీపీ జిల్లా ఆఫీసుపై కార్యకర్తల దాడి, ఫర్నీచర్ ధ్వంసం

జనసేనకు మరో షాక్.. పితాని బాలకృష్ణ రాజీనామా

  • ఎన్నికల వేళ జనసేన పార్టీకి మరో షాక్
  • ముమ్మిడివరం కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ రాజీనామా
  • పవన్ కళ్యాణ్ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని పితాని ఆరోపణ
  • వైఎస్ జగన్ సమక్షంలో శనివారంలో వైసీపీలో చేరే అవకాశం

టీడీపీ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల

* పెండింగ్‌లో ఉన్ననలుగురు అభ్యర్థుల జాబితా రిలీజ్

* అనంతపురం ఎంపీ అభ్యర్థిగా అంభికా లక్ష్మీనారాయణ

* విజయనగరం ఎంపీ అభ్యర్థిగా అప్పల నాయుడు

* ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి

* కడప ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి

టీడీపీ పెండింగ్‌లో ఉంచిన అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితా విడుదల

* చీపురుపల్లి : కళా వెంకట్రావు

* బీమీలి- గంటా శ్రీనివాసరావు

* పాడేరు - వెంకట రమేష్ నాయుడు

* దర్శి : గొట్టిపాటి లక్ష్మి

* రాజంపేట : సుగవాసి సుబ్రహ్మణ్యం

* ఆలూరు : వీరభద్ర గౌడ్

* గుంతకల్లు : గుమ్మనూరు జయరామ్

* అనంతపురం : దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్

* కదిరి : కందికుంట వెంకటప్రసాద్ (యశోధ స్థానంలో ప్రసాద్‌కు టికెట్)

లోకేశ్‌ సమక్షంలో టీడీపీలో చేరిన చిలకలూరిపేట వైసీపీ మాజీ ఇంఛార్జ్, ఇతర నేతలు

* లోకేశ్‌ సమక్షంలో టీడీపీలో చేరిన చిలకలూరిపేట వైసీపీ నేతలు

* టీడీపీలో చేరిన చిలకలూరిపేట వైసీపీ మాజీ ఇన్‌ఛార్జి రాజేశ్‌ నాయుడు, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ గోల్డ్‌ శ్రీను

* మరో 10 మంది కౌన్సిలర్లు, జడ్పీటీసీ సభ్యుడు, ఇద్దరు సర్పంచ్‌లు టీడీపీలో చేరారు

* విడదల రజనీకి రూ.6 కోట్లు ఇచ్చి మోస పోయా: రాజేశ్‌ నాయుడు

* మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి ఇస్తామని రూ. రెండున్నర కోట్లు తీసుకున్నారు: శ్రీను

నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టీడీపీ బుజ్జగింపులు

* నల్లమిల్లి ఇంటికి వెళ్లిన టీడీపీ నేతలు

* టీడీపీ నేతల దగ్గర భోరున విలపించిన నల్లమిల్లి కుటుంబం

* వైసీపీ వాళ్లు మమ్మల్ని భౌతికంగా అంతమొందించాలని ప్రయత్నించారన్నారు

* టీడీపీ అధిష్టానం మమ్మల్ని రాజకీయంగా అంతమొందించాలని చూసిందన్నారు

కోడుమూరులో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అశేష ప్రజాభిమానం

* కోడుమూరు చేరుకున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర

* దారిపొడవునా బారులు తీరిన గ్రామస్తులు

* బస్సు పైకి ఎక్కి ప్రజాభివందనం చేస్తున్న సీఎం జగన్‌

* భారీ గజమాలతో స్వాగతం పలికిన కోడుమూరు గ్రామస్తులు

రాజకీయ, పారిశ్రామిక విప్లవానికి టీడీపీ నాంది పలికింది: చంద్రబాబు

* పేదల సంక్షేమం కోసం టీడీపీని ఎన్టీఆర్‌ ఏర్పాటు చేశారు: చంద్రబాబు

* పేదలకు రూ.2కే కిలో బియ్యం ఇచ్చాం: చంద్రబాబు

* సంపద సృష్టించి పేదలకు పంచడమే టీడీపీ ధ్యేయం: చంద్రబాబు

* టీడీపీ విద్యుత్‌రంగంలో సంస్కరణలు తీసుకొచ్చింది: చంద్రబాబు

* నదుల అనుసంధానం చేయాలని బాధ్యతగా తీసుకున్నాం: చంద్రబాబు

* పోలవరం ప్రాజెక్టు 72శాతం పూర్తిచేశాం: చంద్రబాబు

దేవినేని ఉమాకు అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల సమన్వయ బాధ్యతలు

* దేవినేని ఉమాకు అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల సమన్వయ బాధ్యతలు

* ఇప్పటికే ఉన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాతో పాటు అదనపు బాధ్యతలు

* దేవినేని ఉమాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలు, కార్యకర్తలు

పెంచికలపాడు నుంచి ప్రారంభమైన సీఎం జగన్‌ మూడో రోజు బస్సు యాత్ర

* మూడో రోజు మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభం

* పెంచికలపాడు నుంచి ప్రారంభమైన సీఎం జగన్‌ బస్సు యాత్ర

* పెంచికలపాడు శిబిరం వద్ద భారీగా గూడిన జనం

* ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న సీఎం జగన్‌

* సీఎం జగన్‌ వెంట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎం‌ఏ హఫీజ్ ఖాన్, డా.జరదొడ్డి సుధాకర్, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు

టీడీపీ అభిమానులు, కార్యకర్తలకు పార్టీ ఆవిర్భా దినోత్సవ శుభాకాంక్షలు: చంద్రబాబు

* టీడీపీ అభిమానులు, కార్యకర్తలకు పార్టీ ఆవిర్భా దినోత్సవ శుభాకాంక్షలు: చంద్రబాబు

* మహాశయుల స్ఫూర్తిగా.. 1982లో ఇదే రోజున టీడీపీని ఎన్టీఆర్‌ ప్రకటించారు: చంద్రబాబు

* రాజకీయమంటే సేవ చేయడమంటూ దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పారు : చంద్రబాబు

* తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతే లక్ష్యంగా తెదేపా నిమగ్నమై ఉంది: చంద్రబాబు

* తెలుగు ప్రజల బంగారు భవిష్యత్తుకు కృషిచేస్తోంది తెలుగుదేశం: చంద్రబాబు

ఉండవల్లిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

* ఉండవల్లి చంద్రబాబు నివాసంలో తెలుగుదేశంపార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

* ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన భువనమ్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు

* కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్స వేడుకలు నిర్వహించిన భువనమ్మ

* నిజం గెలవాలి టీమ్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఓ వైపు వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. మరోవైపు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజా గళం పేరుతో సభలతో దూకుడు పెంచారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా శనివారం నుంచి ప్రచారం ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఇలా ఉన్నాయి.

జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర

మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం (మార్చి 29) ఉమ్మడి కర్నూలు జిల్లా పెంచికలపాడు లోని రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభంకానుంది. ఈ యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 9 గంటలకు పెంచికలపాడు నుంచి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి చేరుకుంటారు. రాళ్లదొడ్డికి ముందు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభలో సాయంత్రం 3 గంటలకు పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం,బెణిగేరి,ఆస్పరి, చిన్నహుల్తి,పత్తికొండ బైపాస్ మీదుగా KGN ఫంక్షన్ హాల్ కి దగ్గరలో ఏర్పాటు చేయబడిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

చంద్రబాబు ప్రజా గళం సభలు

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజా గళం ఇవాళ నందికొట్కూరు, కర్నూలు, శ్రీశైలంలో నిర్వహిస్తారు. ఈ మూడు నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే 30న మైదుకూరు, సూళ్లూరుపేట, ప్రొద్దుటూరు, శ్రీకాళహస్తి ప్రచారంలో బాబు పాల్గొంటారు. 31న మార్కాపురం, సంతనూతలపాడు, కావలి, ఒంగోలులో పర్యటిస్తారు.

సీఎస్, డీజీపీపై ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు అంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వారిని వెంటనే బదిలీ చేయాలని కోరుతూ రాష్ట్రానికి చెందిన పలువురు ‘ఛేంజ్‌ డాట్‌ ఓఆర్‌జీ’ వెబ్‌సైట్‌ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి పిటిషన్‌ పంపారు. మూడురోజుల కిందట ఈ పిటిషన్‌ మొదలుపెట్టగా.. గురువారం సాయంత్రం వరకూ ఈ డిమాండుకు 1,651 మంది మద్దతు పలికారు.

నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి చంద్రబాబు ఫోన్

అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ ఉనికి లేకుండా చేయాలనే దురుద్దేశంతో వైఎస్సార్‌సీపీ కుట్రకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఇందుకోసం రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్లు చేతులు మారినట్లు సమాచారం ఉందన్నారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంపై అధినేత చంద్రబాబు, లోకేష్‌ పునరాలోచన చేయాలని కోరారు. సమస్య పరిష్కారానికి చంద్రబాబు నల్లమిల్లికి ఫోన్‌ చేశారు. దాదాపు 25 నిమిషాల పాటు జరిగిన సంభాషణలో తనకు జరిగిన అన్యాయం గురించి రామకృష్ణారెడ్డి వివరించారు. చంద్రబాబు స్పందిస్తూ ఆవేశంతో తొందరపాటు నిర్ణయాలు వద్దని సూచించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-29T00:26:21Z dg43tfdfdgfd