ఏపీ డిప్యూటీ సీఎంకు షాకిచ్చిన మేనల్లుడు.. షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మేనల్లుడు రమేష్‌ కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాదులో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కార్వేటినగరం మండలం పాదిరికుప్పానికి చెందిన ఆయన వైఎస్సార్‌సీపీలో ఉన్నారు. డిప్యూటీ సీఎంకు అసమ్మతి వర్గంగా మారిన వారిలో ఒకరు. నారాయణస్వామికి వైఎస్సార్‌సీపీకి టికెట్‌ ఇవ్వొద్దంటూ బహిరంగంగానే మాట్లాడారు. ఈ క్రమంలో నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మికి గంగాధరనెల్లూరు టికెట్‌ ప్రకటించారు.

వైఎస్సార్‌సీపీ అధిష్టానం తీరుపై ఆగ్రహంతో ఉన్న రమేష్.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో గంగాధరనెల్లూరు నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సామాజిక వర్గానికి న్యాయం జరగకపోవడంతో కాంగ్రెస్‌లో చేరినట్లు ఆయన చెప్పారు. డిప్యూటీ సీఎం వల్ల కూడా నియోజకవర్గంలోని ఎస్సీలకు న్యాయం జరగలేదని.. నాన్‌ లోకల్‌ అయిన ఆయన కుమార్తె వల్ల అసలు న్యాయం జరగదన్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన వారి అభిప్రాయం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. గంగాధరనెల్లూరు అభ్యర్థిగా బరిలో ఉంటానని.. తనను ప్రచారం చేసుకోమని షర్మిల చెప్పారని రమేష్‌ తెలిపారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-28T03:54:22Z dg43tfdfdgfd