ఏపీని వణికిస్తున్న ఎండలు, వేడిగాలులు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు, వేడి గాలుల తీవ్రత పెరిగింది. శనివారం 55మండలాల్లో తీవ్ర వడగాలులు, 197 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ హెచ్చరించారు. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, పిడుగులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. శనివారం తీవ్ర వడగాలులు వీచే అవకాశమున్న మండలాలలో.. విజయనగరం జిల్లాలో 23, పార్వతీపురం మన్యం 15, శ్రీకాకుళం 11, అనకాపల్లి 6 ఉన్నాయి

వడగాలులు వీచే అవకాశమున్న మండలాలలో పల్నాడు జిల్లాలో 25, ప్రకాశం 21, గుంటూరు 17, తూర్పుగోదావరి 17, శ్రీకాకుళం 15, కాకినాడ 14, ఏలూరు 12, కృష్ణా 12, అల్లూరి సీతారామరాజు 10, అనకాపల్లి 10, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు 10, ఎన్టీఆర్‌ 9, బాపట్ల 9, తిరుపతి 5, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ 4, విశాఖపట్నం 3, విజయనగరం 3, పశ్చిమగోదావరి 1 ఉన్నాయి.

శుక్రవారం 61మండలాల్లో తీవ్ర వడగాలులు, 117మండలాల్లో వడగాలులు వీచాయి. రాష్ట్రంలో అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 45.7డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వైయస్‌ఆర్‌ జిల్లా సింహాద్రిపురంలో 45.6, నంద్యాల జిల్లా బనగానపల్లె, ప్రకాశం జిల్లా మేకలవారిపల్లిలో 45.5, విజయనగరంలోని రామభద్రాపురంలో 44.9డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు వీలైనంతవరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంట్లోనే ఉండాలంటున్నారు అధికారులు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS, ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగడం మంచిదంటున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-20T02:47:10Z dg43tfdfdgfd