ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం కల్పించగా.. దీని కోసం ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.

ఓటర్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేయడానికి వీలుగా.. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల అభ్యర్థన మేరకు సంబంధిత అధికారులు ఒకరోజు ప్రత్యేక క్యాజువల్‌ సెలవును మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సూచనల మేరకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఈ ఉత్తర్వులకు తగినట్లుగా సెక్రెటేరియట్‌ విభాగాలు, విభాగ అధిపతులు, జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎన్నికల విధుల కారణంగా ఏ ఉద్యోగీ తన ఓటు హక్కును కోల్పోకూడదని, విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికీ¨ పోస్టల్‌ బ్యాలట్‌ ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే అంటున్నారు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, దామోదరరావు. నియోజకవర్గాల వారీగా ఎంతమంది సిబ్బందిని ఎన్నికల విధులకు కేటాయించారో స్పష్టమైన సమాచారం లేదన్నారు. ఏప్రిల్‌ 30న ఎన్నికల విధుల్లోకి తీసుకున్న అంగన్‌వాడీ, కాంట్రాక్టు ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలట్‌ అందేలా ఈసీ చర్యలు తీసుకోవాలని.. ఒకవేళ అవసరమైతే గడువు పెంచాలని ఈసీని ఉద్యోగ సంఘ నేతలు కోరారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-05T02:26:59Z dg43tfdfdgfd