ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ.. వారి ఖాతాల్లో డబ్బులు పడే ఛాన్స్!

AP Government Letter EC about DBT for Welfare schemes: ఏపీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ)లకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరింది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిధులు లబ్ధిదారులకు జమ కాలేదు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో కొన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధి.. అర్హులైన లబ్ధిదారులకు అందలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష నగదు బదిలీలపై ఏపీ ప్రభుత్వం దృష్టిపెట్టింది. డీబీటీలకు అనుమతి ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖరాసింది. ఈ పథకాలన్నీ ఐదేళ్ల నుంచి అమలవుతూ వస్తున్నవేనని అందులో పేర్కొంది. కొత్త పథకాలు ఏవీ కాదని.. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని డీబీటీలకు పర్మిషన్ ఇవ్వాలని లేఖలో కోరింది.

మరోవైపు వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లు కాలంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేసింది. వీటి ప్రయోజనాలను లబ్ధిదారులకు డీబీటీల రూపంలో అందజేస్తూ వచ్చింది. బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమచేయడం ద్వారా పథకాల లబ్దిని అర్హులైన లబ్ధిదారులకు అందిస్తూ వచ్చింది. కోవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలకు డీబీటీ ద్వారానే చెల్లింపులు చేశారు.58 నెలల కాలంలో బటన్ నొక్కడం ద్వారా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ పథకాల లబ్ధిని ప్రజలకు చేరవేశారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో పలు పథకాలకు సంబంధించి లబ్ధి.. ప్రజలకు అందకుండా పోయింది.

ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, చేదోడు వంటి పథకాలకు సంబంధించి సీఎం జగన్ బటన్ నొక్కారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో వీటిలో కొన్ని పథకాలకు సంబంధించి నగదు బదిలీ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పాత పథకాలకు డీబీటీ ద్వారా నగదు బదిలీకి అనుమతించాలని ప్రభుత్వం ఈసీని కోరినట్లు తెలుస్తోంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-03T16:36:44Z dg43tfdfdgfd