చింతమనేని ప్రభాకర్‌ ఎన్నికల అఫిడవిట్.. ఎన్ని కేసులున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అఫిడవిట్ రూపంలో వారి పేరుతో ఉన్న ఆస్తులతో పాటుగా కేసుల వివరాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లా దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ నామినేషన్ దాఖలు చేయగా.. ఆయనపై కేసుల చిట్టా చూస్తే ఆశ్చ్యపోవాల్సిందే. రాష్ట్రంలో ఏ పార్టీ అభ్యర్థిపైనా లేనన్ని కేసులు చింతమనేనిపై ఉన్నాయి.

చింతమనేనిపై రౌడీషీట్‌తో పాటు 93 కేసులు తనపై నమోదయ్యాయని తన నామినేషన్‌ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. స్థిరచరాస్తులన్నీ కలిపి సుమారు రూ.50 కోట్లు పైచిలుకు ఉన్నట్లు ఆయన చూపించారు. తహశీల్దార్‌ వనజాక్షి ఉదంతం సహా తనపై నమోదైన కేసుల వివరాలను ఆయన అఫిడవిట్‌లో పొందుపరిచారు. అలాగే, మాజీమంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై దాడిచేసిన కేసులో చింతమనేని ప్రభాకర్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఇక చింతమనేని, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో సుమారు రూ.50 కోట్ల స్థిరచరాస్తులున్నాయి.

మరోవైపు ఏపీ టీడీపీ అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అచ్చె­న్నాయుడు అఫిడవి­ట్‌లో తనపై రాష్ట్రవ్యా­ప్తంగా 24 క్రిమినల్‌ కేసులున్నట్లు వెల్లడించారు. ఇందులో ప్రధా­నంగా స్కిల్‌ డెవలప్‌­మెంట్, ఈఎస్‌ఐ కుంభకో­ణా­లకు సంబంధించి ఏసీబీ, సీఐడీ కోర్టుల్లో కేసులున్నాయి. ఆస్తుల విషయా­నికొస్తే.. అచ్చెన్న పేరుతో స్థిరాస్తులు రూ.­2,31,48,500లు, చరాస్తులు రూ.1,32,05,511లు ఉన్నాయి. ఆయన భార్య విజయమాధవి పేరిట స్థిరాస్తులు రూ.6,13,56,000 చరాస్తులు రూ.4,68,27,569 వరకు ఉన్నాయి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-23T05:25:26Z dg43tfdfdgfd