తిరుమల నడకదారిలో మరోసారి కలకలం.. భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ సూచన

తిరుమలకు వెళ్లే నడకదారిలో మరోసారి వన్యప్రాణుల సంచారం కలకలంరేపింది. తాజాగా ఓ చిరుత కదలికలు ట్రాప్ కెమెరాలకు చిక్కాయి.. వెంటనే అప్రమత్తమైన టీటీడీ.. అటవీశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచనలు చేస్తున్నారు. అవసరమైతే భక్తులతో పాటుగా భద్రతా సిబ్బందిని కూడా పంపించాలని భావిస్తున్నారు. మళ్లీ చాలా రోజుల తర్వాత చిరుత తిరుమల నడకదారిలో సంచరించడం కలకలంరేపుతోంది.. భక్తులు కూడా భయాందోళనలో ఉన్నారు.

గతవారం కూడా తిరుమలకు వెళ్లే నడకదారిలో ఎలుగుబంటి సంచరించింది. అలిపిరి మెట్ల మార్గంలో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించారు. అలిపిరి మార్గం మధ్యలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సమీపంలో ఎలుగు సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాకు చిక్కింది. వెంటనే అటవీశాఖ అధికారుల్ని అప్రమత్తం చేవారు. అలాగే భక్తుల రక్షణ కోసం టీడీపీ చర్యలు చేపట్టింది.. ఎలుగుబంటి సంచరిస్తున్న ప్రాంతంలో గస్తిని పెంచింది. భక్తులు గుంపులగా వెళ్లాలని.. ఒంటరిగా మెట్ల దారిలో వెళ్లొద్దని సూచించారు.

గతంలో ఇదే ప్రాంతంలోనే చిరుత పులులు, ఎలుగుబంట్లు కనిపించాయి. ఓ చిరుత ఏకంగా తిరుమల నడకదారిలో లక్షిత అనే బాలికను దారుణంగా చంపేసింది. అంతకముందే మరో బాలుడిపై దాడి జరిగింది. ఈ వరుస ఘటనలతో టీటీడీ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు.. బోన్లు ఏర్పాటు చేసి ఆరు చిరుతల్ని బంధించారు. ఈ క్రమంలో నడిచి వచ్చే భక్తులను ఫారెస్ట్‌ అధికారులు అప్రమత్తం చేశారు. గాలి గోపురం నుంచి మోకాళ్లమిట్ట వరకు భక్తులను గుంపులుగా పంపారు. ప్రతి గుంపుతో ఇద్దరు విజిలెన్స్‌ సిబ్బందిని పంపడంతో పాటు చేతికర్రలను అందజేసి జాగ్రత్తగా పంపుతున్నారు. ఆ తర్వాత ఎలుగుబంట్ల సంచారం కనిపించడంతో.. అవి రాకుండా శబ్దాలు చేస్తున్నారు. టీటీడీ ఉన్నతాధికారులతో పాటు విజిలెన్స్‌, ఫారెస్ట్‌ అధికారులు అప్రమత్తమై భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-28T01:09:07Z dg43tfdfdgfd