రాజమహేంద్రవరంవాసులకు అలర్ట్.. ఈ రూట్‌లలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు

రాజమహేంద్రవరం ప్రజలకు ముఖ్య గమనిక. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయంటున్నారు పోలీసులు. రాజమహేంద్రవరం, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలకు ఇతర రాష్ట్ర, జిల్లాల నుండి వచ్చే, పోయే వాహనాలకు తూర్పు గోదావరి జిల్లా పోలీస్ వారి తరుపున విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కడియం మండలం వేమగిరి నేషనల్ హైవేపై ఉన్న గ్రౌండ్‌లో ఈ నెల 6న (సోమవారం) ప్రధాని మోదీ బహిరంగ సభ ఉందన్నారు. వేమగిరి జంక్షన్ మీదుగా వచ్చే, వెళ్లే వాహనాలకు కొన్ని ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.

విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలు ఈ రూట్లలో వెళ్లాలని సూచించారు

1) గుండుగొలను వైపుగా వచ్చే వాహనాలు నల్లజర్ల- దేవరపల్లి- గామన్ బ్రిడ్జ్ మీదుగా విశాఖపట్నం

2) తాడేపల్లిగూడెం వైపుగా వచ్చే వాహనాలు నల్లజర్ల- దేవరపల్లి- గామన్ బ్రిడ్జ్ మీదుగా విశాఖపట్నం వెళ్లాలి

3) జొన్నాడ వైపుగా వచ్చే వాహనాలు మండపేట- రామచంద్రపురం- కాకినాడ- కత్తిపూడి మీదుగా వెళ్లాలి

విశాఖపట్నం వైపు నుంచి విజయవాడ వెళ్లే వాహనాలకు అలర్ట్

1) కత్తిపూడి వైపుగా వచ్చే వాహనాలు పిఠాపురం- కాకినాడ- రామచంద్రపురం- జొన్నాడ మీదగా విజయవాడ వెళ్లాలి

2) జగ్గంపేట మీదగా వెళ్లే వాహనాలు సామర్లకోట- కాకినాడ- రామచంద్రపురం- జొన్నాడ మీదగా విజయవాడ వెళ్లాలి

జిల్లా పరిసర ప్రాంతాలలో వేమగిరి మీదుగా వచ్చి వెళ్లే వాహనాలు ఇలా..

1) జీరో పాయింట్- గామన్ బ్రిడ్జ్- దేవరపల్లి మీదుగా విజయవాడ వెళ్లాలి

2) జీరో పాయింట్- గామన్ బ్రిడ్జ్- కొవ్వూరు- విజ్జేశ్వరం- పెరవలి- రావులపాలెం మీదగా వెళ్లాలి

3) రాజానగరం- ద్వారపూడి- మండపేట- ఆలమూరు- జొన్నాడ- రావులపాలెం మీదగా వెళ్లాలి

4) వేమగిరి- ధవలేశ్వరం- ఐ.ఎల్.టి.డి జంక్షన్- కోటిపల్లి బస్టాండ్ మీదుగా వెళ్లాలి

5) వేమగిరి- కేశవరం- ద్వారపూడి- మండపేట- రామచంద్రపురం మీదుగా కాకినాడ వెళ్లాలి

6) పెరవలి జంక్ష-సమిశ్ర గూడెం-విజ్జేశ్వరం- కొవ్వూరు- గామన్ బ్రిడ్జి మీద వెళ్లాలి

ఈ ట్రాఫిక్ మళ్లింపుల్ని రాజమహేంద్రవరం, పరిసర ప్రాంత జనాలు గమనించి, తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు సహకరించాలని కోరారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-05T04:27:16Z dg43tfdfdgfd