LOK SABHA POLLS 2024: స్వతంత్ర భారతంలో 1996 దిల్లీలో జరిగిన ఎన్నికలు ఎంతో ప్రత్యేకం.. ? ఎందుకో తెలుసా.. ?

Lok Sabha Polls 2024: స్వతంత్య్ర భారత దేశంలో ప్రస్తుతం 18వ లోక్‌సభకు 7 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతలు పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 1996 దిల్లీలో జరిగిన లోక్‌సభ ఎన్నికలు ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. ఇక్కడ ఆరో దశలో భాగంగా ఈ నెల 25న అక్కడ ఎన్నికలు జరగున్నాయి. అక్కడ ప్రతిసారీ జరిగే లోక్‌సభ ఎన్నికలు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తూ వస్తున్నాయి. దిల్లీలో ప్రతిసారీ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ పోటీ చేసే అభ్యర్ధులు పెరుగుతూనే ఉన్నారు.కొన్ని ఎన్నికల్లో అభ్యర్ధుల సంఖ్య 500 దాటగా.. కొన్నిసార్లు రెండు అంకెలకు మాత్రమే పరిమితమైంది. తొలి లోక్‌సభ ఎన్నికల్లో మూడు స్థానాలున్నపుడు 19 మంది అభ్యర్ధులు మాత్రమే ఎన్నికల గోదాలో దిగారు.

1996 లోక్‌సభ ఎన్నికల్లో ఏడు స్థానాల్లో 523 మంది క్యాండిడేట్స్ తమ లక్‌ను పరీక్షించుకున్నారు. వీరిలో 358 మంది స్వతంత్రులు కావడం విశేషం. 1980 లోక్‌సభ ఎన్నికల్లో ఏడు స్థానాల్లో 168 మంది అభ్యర్ధులు బరిలో దిగారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అభ్యర్ధుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. 1984 ఎన్నికల్లో 189 మంది లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. 1989లో 237 మంది పోటీకి దిగారు. 1991లో 501 మంది.. 1996లో 523 మంది అభ్యర్ధులు రికార్డు స్థాయిలో లోక్‌సభ బరిలో దిగారు. 1998లో 132 మంది పోటీ చేశారు. 1999లో 97 మంది బరిలో ఉన్నారు. 2004లో 129 మంది లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2009లో 160 మంది పోటీకి దిగుతున్నారు. 2014లో 150 మంది పోటీలో ఉంటే.. 2019 ఎన్నికల్లో 164 మంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు.

1989లో 237 మంది, 1991లో 501 మంది, 1996లో 523 మంది అభ్యర్థులు, 1998లో 132 మంది అభ్యర్థులు, 1999లో 97 మంది, 2004లో 129 మంది, 2009లో 160 మంది, 2014లో 150 మంది 2019లో 164 మంది ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో 17 మంది మాత్రమే డిపాజిట్లు దక్కించుకున్నారు. 164 మంది అభ్యర్ధులు డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2014 ఎన్నికల్లో ఏడుగురు విన్నర్ క్యాండిడేట్స్.. ఏడుగురు ప్రత్యర్ధి అభ్యర్ధులు మినహా ముగ్గురు క్యాండిడేట్స్ మాత్రమే డిపాజిట్లు దక్కించుకున్నారు.

Read More: UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-05-08T02:02:28Z dg43tfdfdgfd