MAN CUTS OFF HIS TOGUE: నాలుక కోసుకుని శివయ్య ముందు పెట్టిన యువకుడు... కారణం ఏంటంటే..?

Man cuts off tongue as offering to lord shiva in durg district chattisgarh: కొందరు మూఢ నమ్మకాలతో పిచ్చి పిచ్చిపనులు చేస్తుంటారు. సైన్స్ ఇంతగా డెవలప్ అవుతున్న ఈ తరుణంలో కూడా ఇప్పటికి ఏంజరిగిన ఏదో దెయ్యం లేదా గాలిసొకిదంటూ భావిస్తుంటారు. శరీరంలో ఏర్పడిన రుగ్మతలకు లేని పోనీ ఆలోచనలు చేస్తుంటారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో చదువుకున్న వారు, చదువుకొని వారు అని తేడా లేకుండా గుడ్డిగా మూఢ నమ్మకాలను ఫాలో అవుతున్నారు. ఎవరో బాబాలు, దొంగ స్వాములు చెప్పింది వింటూ తమ డబ్బులను పొగొట్టుకుంటారు. ముఖ్యంగా వీరు ఎదుటి వాళ్లు బలహీనతలను కనిపెడుతారు. ఆ తర్వాత వాళ్ల టాలెంట్ తో మాట్లాడి, భయపెట్టి తమ వల్లో వేసుకుంటారు.

Read More: Snake In Toilet: బాప్ రే.. టాయ్ లెట్ లో 10 అడుగుల పాము.. వీడియో వైరల్..

మరికొందరు సినిమాలు, పురాణా కథలు వింటూ కాస్తంతా అతిగా ప్రవర్తిస్తారు. దేవుడి ముందు చేయి కోసుకోవడం, చేతి వేళ్లు కోసుకుని రక్తంతో అభిషేకం చేయడం వంటివి చేస్తుంటారు. ఇంట్లో నిధులున్నాయని, ఎవరినైన బలిస్తే అతి సొంత మౌతుందని దొంగబాబాల మాయమాటలు నమ్ముతుంటారు. కొందరైతే వారికి వారే దేవుళ్లమని, తమను దేవుడు ఆవహిస్తాడని కూడా ప్రచారం చేసుకుంటారు. ఇక కొందరైతే..దేవుడి ముందు తమ శరీరంలోని భాగాలను కోసి సమర్పిస్తారు. ఈకోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. థానాడ్ గ్రామంలో రాజేశ్వర్ నిషాద్ అనే యువకుడు నివసిస్తున్నాడు. ఇతనికి శివుడంటే ఎంతో భక్తి. ప్రతిరోజు స్థానికంగా ఉన్న శివాలయంకు వెళ్లి పూజలు చేస్తుంటాడు. ఆ గ్రామంలో చెరువు దగ్గర శివాలయం ఉంది. ప్రతిరోజు అక్కడ ఆలయం శుభ్రం చేయడం, దీపాలు పెట్టడం, నీళ్లతో అభిషేకం చేయడం చేస్తుంటాడు. అంతేకాకుండా.. తన ఇంట్లోనుంచి శివయ్యకోసం ప్రత్యేకంగా నైవేద్యం చేయించి మరీ తీసుకెళ్లి శివయ్యకు సమర్పిస్తాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల నిషాద్ చేసిన పని ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

రాజేశ్వర్ ప్రతిరోజులాగానే శివాలయంకు వెళ్లాడు. అంతేకాకుండా.. రోజంతా పూజలు చేశాడు. మంత్రాలతో ఉచ్చరిస్తూ ఒక్కసారిగా తనతో పాటు తెచ్చుకున్న కత్తి తీసుకుని  తన నాలుకను కోసుకున్నాడు. ఆ తర్వాత నాలుకను శివుడి ముందు పెట్టాడు. అతని ఒళ్లంతా తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే చుట్టుపక్కల ఉన్న వారు అతడిని గమనించారు. వెంటనే గ్రామంలోని వారికి విషయం చెప్పి, అంబెలెన్స్ కు సమాచారం ఇచ్చారు.

Read More: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...

అయితే.. సదరు రాజేశ్వర్ భార్యకు మాట్లాడటం రాదని, ఆమెకు మాటలు రావాలని ప్రతిరోజు దేవుడికి పూజలు చేసేవాడని స్థానికులు చెబుతున్నారు. దీంతో అతను ఈవిధంగా తన భార్యకు మాటలు తెప్పించాలని, నాలుగు కోసుకున్నాడా..? అనిస్థానికులు భావిస్తున్నారు. తన భార్యకు మాటలు రావు.. ఇతను కూడా అదే విధంగా మూగవాడిలా జీవితాంతం మూగవాడిలో ఉండటానికి ఈవిధంగా నాలుక కోసుకున్నాడా.. అని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఘటన మాత్రం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-05-09T07:36:04Z dg43tfdfdgfd