MODI VS RAHUL: భయపడకు.. పారిపోకు: రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు

Narendra Modi: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ పోటీ చేసే స్థానం మార్పుపై తీవ్ర చర్చ జరుగుతోంది. రాహుల్‌ అమేథీ కాకుండా రాయ్‌బరేలీకి స్థానం మార్పుపై బీజేపీ విమర్శలు చేస్తోంది. తాను ముందే చెప్పానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్‌కు కీలక సూచన చేశారు. 'భయపడకు.. పారిపోకు' అని సూచించారు. ఈ క్రమంలోనే రాహుల్‌తోపాటు కాంగ్రెస్‌ పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

Also Read: Amit Shah: అమిత్‌ షా పర్యటనలో కలకలం.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం

పశ్చిమ బెంగాల్‌లోని బర్దామన్‌-దుర్గాపూర్‌లో శుక్రవారం మోదీ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు. 'ఎన్నికలకు రెండు మూడు నెలల ముందే నేను చెప్పా. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అగ్ర నాయకుడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ధైర్యం చేయరని పార్లమెంట్‌లో చెప్పా. పోటీ చేయడానికి భయపడతారని చెప్పాను. అదే జరిగింది. రాజస్థాన్‌కు వెళ్లి రాజ్యసభ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు రాహుల్‌ గాంధీ కూడా పారిపోయాడు. అత్యంత సురక్షితమైన వయనాడ్‌ నుంచి గెలిచాడు. ఇప్పుడు అక్కడ ఓటమి భయంతో రాయ్‌బరేలీకి పారిపోయాడు. అమేథిను వదిలేసి వెళ్లాడు. భయపడొద్దు.. భయపడొద్దు అంటున్నారు. కానీ వాళ్లే పారిపోతున్నారు. నేను కూడా వాళ్లకు ఒక్కటే చెబుతున్నా. భయపడకండి.. పారిపోకండి' అని ఎద్దేవా చేశారు. తల్లీ తనయుడు ఇద్దరూ తమ స్థానాన్ని వదిలేసి పారిపోతున్నారు అని విమర్శించారు.

Also Read: Asaduddin Owaisi: ముస్లింలే ఎక్కువ కండోమ్‌లు వాడుతున్నారు: అసదుద్దీన్‌

'కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధిని తీసుకురాలేదు. కానీ ఓట్ల కోసం సమాజాన్ని ఎలా విభజించాలో మాత్రం తెలుసు' అని నరేంద్ర మోదీ తెలిపారు. 'తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఒకటి అడగాలనుకుంటున్నా. సందేశ్‌ఖాళీ దళిత సోదరులకు అన్యాయం జరిగింది. నిందితులకు తృణమూల్‌ రక్షిస్తోంది. ఓటు రాజకీయాల కోసం మానవత్వం మరుస్తారా?' అని ప్రశ్నించారు. 'స్కూల్‌ టీచర్ల కుంభకోణం జరగడం చాలా సిగ్గుచేటు' అని ధ్వజమెత్తారు. ఈ కుంభకోణం ద్వారా అమాయకులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 'మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వమని నేను సవాల్‌ చేస్తే.. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం మౌనంగా ఉంది' అని తెలిపారు. 'బెంగాల్‌లో హిందువులను రెండో పౌరులుగా తృణమూల్‌ కాంగ్రెస్‌ పరిగణిస్తోంది' అని సంచలన ఆరోపణలు చేశారు.

త్వరలో తెలుగు రాష్ట్రాల్లో..

ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో బిజీగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మొదట తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సూత్రప్రాయంగా మోదీ షెడ్యూల్‌ విడుదల చేసినట్లు తెలిసింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో మోదీ కూడా వీలైనన్ని ఎక్కువ ప్రచార సభల్లో పాల్గొనేందుకు ప్రణాళిక వేసుకుంటున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

2024-05-03T12:00:38Z dg43tfdfdgfd