10ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన ఎండలు.. మరో 4 రోజుల పాటు నగరవాసులపై నిప్పుల కుంపటే

సమ్మర్ వచ్చిందంటే ఎక్కడెక్కడి జనం హైదరాబాద్ (Hyderabad)లో మకాం వేస్తారు. వాతావరణం కాస్త చల్లగా ఉంటుందని..గాలితో తేమ శాతం తక్కువగా ఉండటంతో పాటు ఉక్కపోత తక్కువగా ఉంటుందని చాలా మంది వేసవి సెలవులకు హైదరాబాద్ లో తిష్ట వేస్తారు. కాని ఈసారి సీజన్ లో సీను మారిపోయింది. ఎండలు దేశ వ్యాప్తంగా దడ పుట్టిస్తున్నట్లుగానే తెలంగాణ(Telangana)లో అందులో హైదరాబాద్ నగరంలో రికార్డ్ బద్దలు కొడుతున్నాయి. గడిచిన పదేళ్లలో ఎన్నడూ చూడని స్థాయిలో వేసవి తీవ్రత మంటలు రేపుతోంది. శనివారం హైదరాబాద్ వ్యాప్తంగా ఎండ తీవ్రత పెరిగితే కొన్ని ప్రాంతాల్లో ఈ సీజన్ లో టాప్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిటీలో అత్యధిక 44.2 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైనట్లుగా వాతావరణశాఖ వెల్లడించింది. హైదరాబాద్ లోని అత్తాపూర్(Attapur), వివేకానందనగర్(Vivekanandanagar), మేడ్చల్ మల్కాజ్ గిరి(Medchal malkaggiri), బేగంపేట(Begumpet)లో 44డిగ్రీలు దాటింది. అయితే మే నెలలోనే ఈవిధంగా టెంపరేచర్ నమోదవడంతో నగరవాసులు ఈ వేసవి తీవ్రత నుంచి బయటపడే మార్గాలు అన్వేషిస్తున్నారు.

హైదరాబాద్ లో ఆల్ టైమ్ రికార్డ్ ..

హైదరాబాద్ లో వాతావరణం మునుపెన్నడు చూడని విధంగా మారిపోతోంది. మరీ ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం నమోదైన ఉష్ణోగ్రతలు గడిచిన పదేళ్లలో ఎప్పుడు చూడలేదు. అత్తాపూర్, వివేకానందనగర్, మేడ్చల్ మల్కాజ్ గిరిలో గరిష్టంగా 44.2 డిగ్రీలు టెంపరేచర్ నమోదైంది. అత్యధిక జనాభా రద్దీ ఉండే బేగంపేటలో 43.8 డిగ్రీలు నమోదైంది. వేసవిలో కామన్ గా 39.1 డిగ్రీలు ఉంటే ఉష్ణోగ్రతలు శనివారం కనిష్టంగా 42.9 డిగ్రీలు నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ వేసవి తీవ్రత గడిచిన పదేళ్ల కాలంలో ఇదే మొదటి సారి కావడం విశేషం. ఈ సీజన్ లో ఈస్థాయిలో ఎండలు దంచి కొట్టడం రెండోసారి. అయితే మే నెలలోనే పరిస్థితి ఉలా ఉందంటే రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణలో శనివారం అత్యధికంగా 47డిగ్రీలు నమోదైంది.

Viral News: 310 రకాల ఐస్ క్రీమ్స్ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్.. స్విగ్గీ ఆర్డర్స్ లో ఇదే రికార్డ్

10 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన ఎండలు..

2015ల మే నెలలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత హైదరాబాద్ లో నమోదైంది. అంటే సుమారు దశాబ్ధ కాలం తర్వాత అంత స్థాయిలో ఎండలు మండిపోతున్నాయని అంటున్నారు. హైదరాబాద్ లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైతే .. రాష్ట్రంలోని మంథని పెద్దపల్లి జిల్లాల్లో 47, 46.7 డిగ్రీలు నమోదవడం విశేషం.పెరుగుతున్న వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అత్యవసరమైతే తప్ప పగటి వేళ రోడ్లపైకి , పనులకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వెళ్లినా వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

---- Polls module would be displayed here ----

మే 9వరకు ఎండలే ఎండలు..

తెలంగాణలోని మొత్తం మీద 18 జిల్లాల్లో 46డిగ్రీలు అత్యధిక టెంపరేచర్ నమోదైంది. ఇక 11 జిల్లాల్లో 45 డిగ్రీలు రికార్డైనట్లుగా ఐఎండీ పేర్కొంది. రానున్న 24గంటల్లో అంటే మే 6వ తేది ఈ వేసవి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు మించే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు అధికారులు. మే 6 వ తేది నుంచి 9వ వరకు ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉండవచ్చని పేర్కొంది.

2024-05-05T01:55:26Z dg43tfdfdgfd