23 జాతుల కుక్కలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం

23 జాతుల కుక్కలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం

తమిళనాడులో పిట్‌బుల్ టెర్రియర్, తోసా ఇను సహా 23 రకాల క్రూరమైన కుక్క జాతులను నిషేధించినట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ గురువారం(మే 09) తెలిపింది. ఇటీవల చెన్నైలో రోట్‌వీలర్ కుక్క పిల్లవాడిని కరిచి గాయపరిచిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. క్రూరమైనవిగా భావించే 23 జాతుల దిగుమతి, పెంపకం, అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

దేశంలో పెరుగుతున్న కుక్క కాటు కేసుల నేపథ్యంలో పిట్‌బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్‌డాగ్, రోట్‌వీలర్ వంటి అనేక కుక్క జాతుల పెంపకాన్ని నిషేధించాలని కేంద్రం ఈ ఏడాది మార్చిలో రాష్ట్రాలను ఆదేశించింది. 23 కుక్కల జాతుల జాబితాను విడుదల చేసి వాటి పెంపకం, విక్రయాలను నిలిపివేయాలని రాష్ట్రాలను కోరింది. అదే సమయంలో వాటిని క్రిమిరహితం చేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పశుసంవర్ధక శాఖ, పాడిపరిశ్రమ శాఖలకు లేఖలు రాసింది. కొన్ని జాతుల కుక్కలను పెంపుడు జంతువులుగా, ఇతర ప్రయోజనాల కోసం ఉపగించకుండా నిషేధించాలని పౌరులు, సిటిజన్ ఫోరమ్‌లు, యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (AWOలు) నుండి ఫిర్యాదులు స్వీకరించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కేంద్రం నిషేధించిన కుక్కల జాతుల జాబితా ఇదే

పిట్‌బుల్ టెర్రియర్, టోసా ఇను, అమెరికన్ స్టాఫోర్డ్‌షైర్ టెర్రియర్, ఫిలా బ్రసిలీరో, డోగో అర్జెంటీనో, అమెరికన్ బుల్‌డాగ్, బోర్‌బోయెల్ కంగల్, సెంట్రల్ ఏషియన్ షెపర్డ్ డాగ్, కాకేసియన్ షెపర్డ్ డాగ్.

ఇతర జాతులలో సౌత్ రష్యన్ షెపర్డ్ డాగ్, టోర్న్‌జాక్, సర్ప్లానినాక్, జపనీస్ టోసా, అకిటా, మాస్టిఫ్స్, టెర్రియర్స్, రోడేసియన్ రిడ్జ్‌బ్యాక్, వోల్ఫ్ డాగ్స్, కానరియో, అక్బాష్ డాగ్, మాస్కో గార్డ్ డాగ్, కేన్ కోర్సో, బాండోగ్.

©️ VIL Media Pvt Ltd.

2024-05-09T16:06:16Z dg43tfdfdgfd