29న ఉచిత పాలిసెట్ నమూనా పరీక్ష.. ఎక్కడంటే..

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్. ముందస్తుగా ఉచితంగా నమూనా పరీక్ష పెట్టి వారి ప్రతిభను వారే స్వయంగా నిర్ధారణ చేసుకొనే విధంగా డిప్లొమా కోర్సుల్లో వెసులుబాటు కల్పించారు. జరగబోయే మెయిన్ పరీక్షకు ముందస్తుగా రాస్తున్న జనాభాలో మన ర్యాంక్ ఎంతో అని ముందస్తూ అంచనా వేసుకోవచ్చును. అదేవిధంగా పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్న టాపిక్ ఏది, మనం ఎందులో వీక్ గా ఉన్నామనేది స్పష్టంగా తెలుసుకోవచ్చును. ఇలాంటి నమూనా పరీక్షలు రాయడం వల్ల మనలో మనమే మన ప్రతిభను అంచనా వేసుకోవచ్చును. నమూనాపై ఉమ్మడి డిప్లొమా కోర్సుల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి వరదరాజనగర్ లోని విశ్వం పాఠశాలలో ఈనెల 29న ఉదయం 10గంటలకు పాలిసెట్ నమూనా పరీక్షను ఉచితంగా నిర్వహించనున్నట్లు ఆ విద్యా సంస్థ అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాధరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఏప్రిల్ 27 న రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న పాలిసెట్ ప్రవేశ పరీక్షకు అనుగుణంగా నమూనా పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు.

స్కూల్ బ్యాగ్ చినిగిపోయిందా.. ఇక్కడకు వస్తే క్షణాల్లో కుట్టేస్తారు!

అనంతరం పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ నమూనా పరీక్ష, సదస్సుకు పాలిసెట్ పరీక్ష రాయనున్న విద్యా ర్థులు, తల్లిదండ్రులు పాల్గొనవచ్చన్నారు. 86888 88802, 93999 76999 వివరాలకు సంప్రదించాలని ఆయన కోరారు.

2024-03-28T13:14:08Z dg43tfdfdgfd