AGRA SCHOOL PRINCIPAL: వామ్మో.. లేడీ టీచర్ కు చుక్కలు చూపించిన ప్రిన్సిపాల్.. బట్టలు చింపేసి పిడిగుద్దులు.. వీడియో వైరల్..

Agra school Principal beats lady teacher: ఉపాధ్యాయ వృత్తిని చాలా మంది దైవంలా భావిస్తారు. తమ పిల్లలకు మంచి విద్యాబుద్దులునేర్పిస్తారని తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపిస్తారు. అందుకే తల్లిదండ్రితర్వాత ఆచార్య దేవో భవ. అని చెబుతుంటారు. అంటే గురువుకు సమాజంలో అంతటి గొప్పస్థానం ఉందన్నమాట. కొందరు గురువులు తమ స్టూడెంట్లకు చక్కని పాఠాలు బోధిస్తారు. ఏరంగంలో రాణిస్తారు. తమ విద్యార్థి ఏంచేస్తున్నాడు.. ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నాడు. ఇంకా ఏంచేయాలి అనేదాని గురించి ఆలోచిస్తుంటాడు. తమ విద్యార్థి బాగు కోసం నిరంతరం పరితపిస్తుంటారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో కొందరు ఉపాధ్యాయులు ప్రైవేటులాగానే నాణ్యమైన విద్యను బోధించేందుకు ప్రయత్నిస్తుంటారు. ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువగా పేద, మధ్యతరగతి చెందిన కుటుంబాల పిల్లలు చదుకుంటుంటారు. ఇక్కడ కూడా చక్కగా చదువు చెప్పే టీచర్లు ఉంటారు.

 

ప్రైవేటు స్కూల్ లకు పోటీగా పాఠాలు చెబుతుంటారు. కొందరు ఉపాధ్యాయులు పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా బోధిస్తుంటారు. కానీ కొందరు ఉపాధ్యాయులు దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటారు. తప్పతాగి స్కూల్ లకు వస్తుంటారు. లక్షలరూపాయలు శాలరీలు తీసుకుంటూ, తమ పిల్లలను ఏమాత్రం పట్టించుకోరు. చదువు చెప్పడంతో పూర్తిగా నెగ్లీజెన్సీగా ఉంటారు. స్కూల్ కు వచ్చిపడుకోవడం, స్కూల్ టైమ్ లో బైటకు వెళ్లిపోవడం, ఎక్కువగా లీవ్ లు పెట్టడం వంటి పనులు చేస్తుంటారు. మరికొందరు ఉపాధ్యాయులు స్టూడెంట్లను లైంగికంగా వేధిస్తుంటారు. పాఠాల పేరుతో విద్యార్థులను లోబర్చుకుంటారు. తమతో లైంగిక సంబంధం పెట్టుకుంటే మంచి మార్కులు వేస్తామని విద్యార్థులు జీవితాలతో ఆడుకుంటారు. ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. 

ఉత్తర ప్రదేశ్ లో ఒక విచిత్ర ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. స్కూల్ కు లేటుగా వచ్చిన టీచర్ ను ప్రిన్సిపాల్ నిలదీసింది. అంతేకాకుండా ఆమెపై శివంగిలా దాడిచేసింది. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్‌ లోని ఆగ్రాలోని సీగానా గ్రామంలోని ప్రీ-సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ టీచర్ గుంజన్ చౌదరిపై, లేడీప్రిన్సిపాల్ దాడిచేసింది. ప్రతిరోజు స్కూల్ కు లేటుగా వస్తుందని ఆమెపై శివాలెత్తిపోయింది.

Read more: Snake Shed his Skin: బాప్ రే.. కుబుసం విడుస్తున్న పాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..

టీచర్ కూడా ఆమెకు ఎదురు తిరగటంతో ప్రిన్సిపాల్ ఆవేశంతో ఊగిపోయింది. ఆమెపై పిడిగుద్దులు కురిపించి, బట్టలు చిపడానికి కూడా ప్రయత్నించింది. చుట్టుపక్కల ఉన్న వారు ఆపడానికి ట్రైచేసిన లేడీప్రిన్సిపాల్ ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. కాగా, టీచర్ ప్రతిరోజు స్కూల్ కు లేటుగా వస్తుందని , ప్రిన్సిపాల్ దాడిచేసినట్లు తెలుస్తోంది. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన యూపీలో తీవ్రచర్చనీయాంశంగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-05-04T16:06:55Z dg43tfdfdgfd