AI COURSES: నిరుద్యోగులకు అలర్ట్.. ఈ కోర్సులు నేర్చుకుంటే భారీ జీతంతో ఉద్యోగాలు

ఒకప్పుడు బీబీఏ, బీకామ్, బీఎస్సీ వంటి సంప్రదాయ డిగ్రీ కోర్సులకు మంచి డిమాండ్ ఉండేది. అయితే ఇప్పుడు కాలం మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్‌సెక్యూరిటీ వంటి కోర్సులకు ప్రాధాన్యత పెరుగుతోంది. వీటితో పాటు డిజిటల్ మార్కెటింగ్, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ వంటి సబ్జెక్టులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాయి. అయితే భవిష్యత్తు గురించి ఆలోచించే వారు ఏఐ కోర్సులు నేర్చుకోవడం మంచిది.

ప్రస్తుతం అన్ని రంగాల కంపెనీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది కొత్త ట్రెండ్. మనుషులు చేసే పనులను తక్కువ టైమ్‌లో ఎక్కువ ఎఫెక్టివ్‌గా చేయగలిగే కెపాసిటీ దీని సొంతం. అందుకే ఈ టెక్నాలజీకి ప్రాధాన్యత పెరుగుతోంది. ఏఐ ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది. ఉద్యోగ భద్రత, వ్యక్తిగత ప్రైవసీకి సంబంధించిన ఆందోళనలు ఉన్నప్పటికీ.. ఈ రంగంలో కెరీర్ గ్రోత్‌కు మంచి అవకాశాలు ఉన్నాయి. కొన్ని రకాల ఏఐ కోర్సులు నేర్చుకుంటే, మంచి జీతంతో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఆ ఏఐ కోర్సులేంటో చూద్దాం.

* బీటెక్ ఇన్ AI & ML

సంప్రదాయ బీటెక్, ఎంటెక్ డిగ్రీలతో పాటు AI & MLలో బీటెక్ చదివితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML)లో రిసెర్చ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే కొన్ని ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్‌తో పాటు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ఉచితంగా ఏఐ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో ఎన్‌రోల్ చేసుకుని అవసరమైన ఏఐ స్కిల్స్ నేర్చుకోవచ్చు.

* థిరిటికల్, ప్రాక్టికల్ స్కిల్స్

AI కెరీర్‌కు మ్యాథ్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ చాలా అవసరం. ఆన్‌లైన్ కోర్సులు లేదా AI స్కిల్స్ బోధించడానికి రూపొందించిన ప్రత్యేక బూట్ క్యాంప్స్ ద్వారా ఈ AI స్కిల్స్ నేర్చుకోవడానికి వీలు ఉంటుంది. రాబోయే కొన్నేళ్లలో AI వినియోగం మరింత పెరగవచ్చు. దీంతో ఈ డొమైన్‌లో థిరిటికల్, ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోవడం చాలా అవసరం.

* కీలకమైన ఐదు ఏఐ కోర్సులు

ప్రస్తుతం కొన్ని రకాల ఏఐ కోర్సులు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ కోర్సుల్లో ఎన్‌రోల్ అయితే బేసిక్, అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పట్టు సాధించవచ్చు. వీటిని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసినవారికి సర్టిఫికేట్ ఇస్తారు. ఈ లిస్టులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఫౌండేషన్, PG ప్రోగ్రామ్ ఇన్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డీప్ లెర్నింగ్‌, ఫుల్‌స్టాక్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌ ఉన్నాయి. ఈ కోర్సులు చదివితే మంచి ఉద్యోగవకాశాలను సొంతం చేసుకోవచ్చు. జీతాలు కూడా భారీగా ఉంటాయి.

---- Polls module would be displayed here ----

* ఏఐ కోర్సులు ఆఫర్ చేస్తున్న టాప్ ఇన్‌స్టిట్యూట్స్

దేశంలోని టాప్ ఇన్‌స్టిట్యూట్స్ ఏఐ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ జాబితాలో IIT మద్రాస్‌ (అడ్వాన్స్‌డ్ సర్టిఫికేషన్ ఇన్ డేటా సైన్స్ అండ్ AI), ఐఐఎం కోల్‌కతా(ఏఐ ఇన్ మాన్యుఫ్యాక్చరింగ్), ఐఐఐటీ హైదరాబాద్( పీజీ సర్టిఫికేట్ ఇన్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్) వంటివి ఉన్నాయి.

2024-04-25T08:46:57Z dg43tfdfdgfd