AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్

AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG 2024) పరీక్షల నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జీరో చీటింగ్ నమోదు చేసేందుకు కఠిన చర్యలు అమలు చేస్తుంది. AI టెక్నాలజీతో CCTV రికార్డింగ్ లను ఏజేన్సీ ఇన్ స్టాల్ చేస్తోంది. సాక్ష్యాధారాలతో అక్రమాలను నిర్ధారించేందుకు ఈ సీసీటీవీలను ఉపయోగిస్తున్నారు. 

నీట్ పరీక్ష జరిగే అన్ని కేంద్రాల్లో అభ్యర్థులు మాస్ కాపీయింగ్ చేయకుండా అడ్డుకునేందుకు AI  ఆధారిత లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి పరీక్ష తర్వాత కూడా అనుమానాస్పద అభ్యర్థులను గుర్తిస్తారు. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  ఎనేబుల్ సిస్టమ్ ల ద్వారా పరీక్షా కేంద్రాలనునిరంతరం పర్యవేక్షిస్తారు. 

ఎవరైనా మాస్ కాపియింగ్ లాంటి అక్రమ మార్గాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తిస్తే.. NTA నిర్వహించే అన్ని పరీక్షలకు హాజరు కాకుండా డిబార్ తో సహా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

2024 మే 5న ఆదివారం  NEET UG 2024  పరీక్షను నిర్వహించనున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రవేశ పరీక్ష కు 24 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరు కానున్నారు. దేశ వ్యాప్తంగా 557 నగరాల్లో , భారత దేశం వెలుపల 14 నగరాల్లో మధ్యా హ్నం 2 నుంచి సాయంత్ర 5.20 గంటల వరకు నిర్వహించనున్నారు. ఫలితాలు జూన్ 14, 2024న ప్రకటిస్తారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-04T08:38:35Z dg43tfdfdgfd