AKSHAYA TRITIYA: అక్షయ తృతీయ రోజు ఈ మూడు రాశుల వాళ్లకు పట్టిందల్లా బంగారమేనట

వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయను చాలా విశిష్టంగా జరుపుకుంటారు. ఈరోజున సూర్యోదయమునకు ముందే లేచి శుచిగా స్నానం చేసి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే సకల సంపదలు కలుగుతాయి. పురాణాలలో నారదుడు ఒకసారి విష్ణుమూర్తిని అడిగాడట ఓ నారద అక్షయ తృతీయ విశిష్టత ఏమిటని తెలియజేయమన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడట క్షయ కానిది అనగా తరిగిపోనిది అక్షయ తృతీయ అంటారు. ఈరోజు సిరి సంపదలను కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే సంపద తరగదని అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండి ఇతర వస్తువులు కొనుగోలు చేస్తారని కరీంనగర్ అభయాంజనేయ స్వామి అర్చకులు ప్రకాష్ బాబు లోకల్ 18కి తెలిపారు..

అయితే ఈ అక్షయ తృతీయ రోజున వృశ్చిక రాశి, మేష రాశి, మీన రాశి వారికి పట్టినందంతా బంగారమేనట. తృతీయ రోజున ధన యోగం, గజకేసరి యోగం ఏర్పడుతున్నాయి. ఇవి 3 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతున్నాయి. మరోవైపు, ఈ రోజున సూర్యుడు, శుక్రుడు మేషరాశిలో సంచరిస్తున్నందున శుక్రాదిత్య యోగం ఏర్పడుతోంది.

Tirumala Annadanam: తిరుమలలో ఒక రోజు అన్నదానానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

అలాగే ఈ రోజున మీనరాశిలో కుజుడు, బుధుడు కలవడం వల్ల ధన యోగం, శని మూల త్రికోణ రాశి కుంభరాశిలో ఉండడం వల్ల షష యోగం, ఉచ్ఛ రాశి మీనరాశిలో కుజుడు ఉండటం వల్ల ధనయోగం. మాలవ్య రాజ్యయోగం, వృషభరాశిలో చంద్రుడు, బృహస్పతి కలయిక ఏర్పడుతుంది. ఈ విధంగా, ఈసారి అక్షయ తృతీయ నాడు అనేక రాజయోగాలు ఏర్పడటం వలన 3 రాశుల వారు ధనవంతులు కావచ్చు.

ఎన్నికల్లో ఓటు వేస్తే 20 శాతం డిస్కౌంట్... వండర్‌లా ఎలక్షన్ ఆఫర్

అలాగే అక్షయ తృతీయ రోజు ఈ రాశుల వాళ్లు బంగారం, లేదా వెండి, వస్తువులు కొంటే ఇంకా పట్టిందల్లా బంగారమే అవుతుందట ..అయితే మిగతా రాసుల వారికి ఈ రాసుల వారితో పోల్చితే కొంచెం గ్రహబలాలు అలాగే తక్కువ కలిసి వచ్చే అవకాశం ఉందని అర్చకులు ప్రకాష్ బాబు తెలిపారు. అయితే ఈ మిగతా రాశుల వాళ్లు అక్షయ తృతీయ రోజు హనుమాన్ ఆలయానికి వెళ్లి అక్కడ పూజలు చేస్తే మిగతా రాశుల వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

2024-05-07T06:02:57Z dg43tfdfdgfd