AP POLITICS: ఎన్నికల ప్రచార అస్త్రంగా మారిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్

ఏపీ లో సమ్మర్ హీట్ ను మించి పొలిటికల్ హీట్ ఉందని చెప్పవచ్చు. ప్రధాన పార్టీల నాయకులు ప్రతి అంశాన్ని పరిగణలోకి విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగిస్తున్నారు. అందులో ఇటీవల ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ గురించి వైసీపీ , టిడిపి మధ్య విమర్శల జోరు సాగుతోంది. అయితే ఈ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ను దేశంలోని పలు రాష్ట్రాలలో అమలు చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ చట్టంను ఆంధ్రప్రదేశ్ లో సైతం అమలుచేయనున్నారని టిడిపి విమర్శలు గుప్పిస్తోంది.

అలాగే ఈ చట్టం అమలుతో భూ యజమానులకు సమస్యలు తప్పవు అంటూ ఇటీవల టిడిపి బహిరంగ సభలలో చట్టం పై టిడిపి నేతలు ప్రసంగాలు ఇచ్చేస్తున్నారు. దీనిపై వైసీపీ సైతం ధీటుగా విమర్శలను తిప్పికొడుతోంది. గతంలో టిడిపి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా భూ సమస్యలు ఉండవు, భూ హక్కు దారులకు, రైతులకు మేలు జరుగుతుందని ప్రకటించి, ఇప్పుడు మాట మార్చారని వైసీపీ అగ్ర నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అంతేకాదు ఇంకా రాష్ట్రంలో గెజిట్ కూడా కానీ చట్టం గురించి టిడిపి పదే పదే చెబుతూ.. ప్రజలను ఏమార్చే పనికి పూనుకుందని, ఎన్నికల కోసం అబద్దపు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు సజ్జల.

2 నిమిషాల్లో రూ.5 లక్షలు లోన్.. ఫోన్‌పే వాడే వారికి గుడ్ న్యూస్!

ఈ చట్టం తో భూ హక్కు దారులకు ఎటువంటి నష్టం వాటిల్లదని, భూ అక్రమాలకు చెక్ పెట్టడం ఈ చట్టంతో సాధ్యమవుతుందన్నారు. ఒకసారి చట్టం రావాలి అంటూ వక్కాణించి పలికిన టిడిపి.. ఎన్నికల కు దీనినే ప్రచారంగా మలుచుకున్నా, రాష్ట్ర ప్రజలకు తమపై ఉన్న నమ్మకం ముందు టిడిపి ఆటలు సాగవంటూ.. పలువురు వైసీపీ నేతలు విమర్శల పర్వం సాగిస్తున్నారు.

Tour: భూగర్భంలో 800 మీటర్ల లోతు సొరంగమార్గంలో గుహలు.. అదిరే టూరిస్ట్ ప్లేస్, మిస్ అవ్వొద్దు!

కాగా రాష్ట్రంలో భూముల రీసర్వే చేసి అసలైన భూ హక్కుదారులకు భూములు అందించింది మేమే అంటూ వైసీపీ పలు సమావేశాల ద్వారా సైతం ప్రకటించింది. ఇలా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాలలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై పార్టీల మధ్య విమర్శలు సాగుతుండగా , ప్రజలు మాత్రం మా భూములు మాకు కాకుండా పోతాయా.. అంటూ ఇవేమీ పట్టించుకోని పరిస్థితిలో తమ చర్చలు సాగిస్తున్నారు.

2024-05-05T14:27:22Z dg43tfdfdgfd