APRCET RESULTS 2024 : ఈనెల 15న ఏపీఆర్‌సెట్‌ 2024 రిజల్ట్స్‌ విడుదల

APRCET Results 2024 : ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (APRCET)2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు మే 15వ తేదీన విడుదలకానున్నట్లు తెలుస్తోంది. ఈ పరీక్షలు మే 2 నుంచి 5 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పీహెచ్‌డీ సీట్ల భర్తీకి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (Sri Venkateswara University-Tirupati) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రవేశపరీక్ష దరఖాస్తు గడువు మార్చి 19వ తేదీతో ముగియగా.. రూ.2000 ఆలస్య రుసుంతో మార్చి 29 వరకు, రూ.5000 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 6 వరకు గడువు పొడిగించి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అనంతరం.. ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తుల్లో తప్పుల సవరణలకు వెసులుబాటు కల్పించారు. అభ్యర్థులు ఏప్రిల్ 10వ తేదీ నుంచి అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.

ఈ ఏపీఆర్‌సెట్ (APRCET) ద్వారా ఏపీలోని 16 యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్ (ఫుల్ టైమ్/పార్ట్ టైమ్) ప్రవేశాలు కల్పిస్తారు. ఈ నోటిఫికేషన్ సమయంలో పరీక్ష తేదీని వెల్లడించని అధికారులు.. ఈ ప్రవేశ పరీక్షలు మే 2 నుంచి 5 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మొత్తం 62 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

APRCET పరీక్ష నిర్వహించిన విభాగాలు: సైన్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, ఫైన్ ఆర్ట్స్, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ ప్లానింగ్, లా అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ తదితర విభాగాల్లో ఈ సీట్లను భర్తీ చేయనున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T11:45:58Z dg43tfdfdgfd