BJP MADHAVI LATHA: మసీదు ముందు రామబాణం వేసిన మాధవీలత.. సంచలన వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ..

MP Asaduddin Owaisi Fires On BJP Madhavi latha On shooting Arrow At Masjid: తెలంగాణలో లోక్‌ సభ ఎన్నికలు సమ్మర్ హీట్ ను మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ కావడం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ఇప్పటికే పెనుదుమారంగా మారాయి. ఇక మరోవైపు.. కాంగ్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటుకేసు అనుహ్యాంగా తెరమీదకు వచ్చింది. ఇదిలా ఉండగా.. ఇటు బీఆర్ఎస్ అధినేత నిన్న తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో చేరిన దాదాపు.. 20 మంది ఎమ్మెల్యేలు, తిరిగి బీఆర్ఎస్ వైపుకు చూస్తున్నారంటూ బాంబు పేల్చారు. అంతేకాకుండా కాంగ్రెస్ ను ప్రజలు వద్దనుకుంటున్నారని, లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉండదండూ కూడా గులాబీబాస్ ఆరోపణలు చేశారు.

Read More: Sai Pallavi Dance: షీలా.. షీలా కి జవానీ పాటకు మెస్మరైజింగ్ స్టెప్పులు వేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్..

ఇదిలా ఉండగా.. శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి బుధవారం రోజున ఓల్డ్ సిటీలో రామనవమి శోభయాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె మసీదువైపు చూస్తు రామబాణం ఎక్కుపెట్టి వదిలారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇప్పుడు ఇది పొలిటికల్ హీట్ ను పెంచేదిగా మారింది. దీనిపై తాజాగా.. మస్లీజ్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లు హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కల్గించేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు.  

రాజకీయాల్లో గెలుపోటములు సహాజమని, ఇలాంటి చర్యలు చేస్తు ప్రజలకు ఎలాంటి సందేశాలు ఇవ్వాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తానే ఒక వేళ ఏదైన గుడిముందు మీలాగా చేష్టలు చేస్తే చూస్తు ఊరుకుంటారా..?.. అని మాధవీలతకు కౌంటర్ వేశారు. ఇదేనా బీజేపీ చెబుతున్న వికసిత్ భారత్.. సబ్ కా సాత్ సబ్ వికాస్.. అంటూ మండిపడ్డారు. ప్రజలందరు కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు చేస్తున్న పనులను గమనిస్తున్నాయని, ఇలాంటి వారికి ప్రజలు సరైన విధంగా బుద్ది చెబుతారన్నారు. ప్రశాంతంగా ఉన్న భాగ్యనరరంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఇలా ప్రవర్తించడం ఏంటంటూ ప్రశ్నించారు.

Read More: Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?

దేశంలో అన్ని రాష్ట్రాలలో తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని, ఇలాంటి రాష్ట్రంలో కొందరు కావాలని శాంతిభద్రతలకు విఘాతం కల్పించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. కాగా ఇటీవల అక్బరుద్దీన్ కూడా తమను చంపడానికి చూస్తున్నారంటూ, జైలులోపెడతారంటూ కూడా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఇటు మజ్లీస్ నేతలు, కార్యకర్లలు ఖండిస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకొవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

2024-04-19T01:43:06Z dg43tfdfdgfd