CIVILS MARKS : సివిల్స్‌ ర్యాంకర్ల మార్కుల వెల్లడి.. మార్కుల జాబితా ఇదే

UPSC CSE Marks 2023 : దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష- 2023 తుది ఫలితాలకు సంబంధించి రెండు రోజుల క్రితం ర్యాంక్‌లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ర్యాంకర్ల మార్కులు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1105 వివిధ సివిల్ సర్వీసులకు చెందిన ఉద్యోగాలు భర్తీ చేయ‌నున్నారు. UPSC CSE Final Result 2023 డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి. ఈ జాబితాలో అభ్యర్థుల రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మొత్తం మార్కులు, ర్యాంకుల వివరాలు పేర్కొన్నారు. మొదటి ర్యాంకర్‌ ఆదిత్య శ్రీవాస్తవకు మొత్తం 2025 మార్కులకు గాను 1099 మార్కులు వచ్చాయి.

అలాగే.. రెండో ర్యాంకర్‌ అనిమేష్‌ ప్రధాన్‌కు 1067 మార్కులు, మూడో ర్యాంకర్‌ మహబూబ్‌నగర్‌కు చెందిన దోనూరు అనన్యరెడ్డికి 1065 మార్కులు వచ్చాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి సుమారు 60 మంది విజేతలుగా నిలిచిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు వందలోపు ర్యాంకులు, 11 మంది 200లోపు ర్యాంకులు పొందారు. లఖ్‌నవూకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ పరీక్షలో తొలి స్థానంలో నిలిచారు. అలాగే.. మొత్తం 1,016 మంది విజయం సాధించగా వారిలో 664 మంది పురుషులు, 352 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 30 మంది దివ్యాంగులు ఉండడం విశేషం.

మార్కుల జాబితా:

గతేడాది మే 28న జరిగిన సివిల్స్‌-2023 ప్రాథమిక పరీక్షకు మొత్తం 10,16,850 నమోదు చేసుకోగా 5,92,141 మంది హాజరయ్యారు. వారిలో 14,624 మంది మెయిన్స్‌కు, 2,855 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. చివరగా 1,016 మంది సివిల్‌ సర్వీస్‌లకు ఎంపికయ్యారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-19T10:40:27Z dg43tfdfdgfd