CM REVANTH REDDY: అరగంట పాటు బస్సులోనే సీఎం రేవంత్ రెడ్డి.. ఖాళీ కుర్చీలు చూసి అసహానం..

CM Revanth Reddy Attends Mahabubabad  Congress Public Meeting: లోక్ సభలో మంచి మెజార్టీ సాధించాలని కాంగ్రెస్ పార్టీ నానా తంటాలు పడుతుంది. అందుకే అనేక బహింగ సభలు, సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీనేతలు.. తరచుగా మాట్లాడుతూ ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని పథకాలు అమలులో జాప్యం ఏర్పడిందని, ఎన్నికలు పూర్తవగానే మిగతా కార్యక్రమాలు, లబ్ధిదారులకు అందల్సిన ఫలాలు అందేలా చేస్తామంటున్నారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ నుంచి వలసలు మాత్రం ఆగడంలేదు.నిన్న కేసీఆర్ తెలంగాణ భవన్ లో.. కాంగ్రెస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి రావడంకు సిద్ధంగా ఉన్నారన్నారు.ఈ వ్యాఖ్యలు పొలిటికల్స్ సర్కిల్స్ లో కొత్త చర్చకు దారితీశాయి.

Read More: Chilkur Balaji: గరుడ ప్రసాదం ఎఫెక్ట్.. చిలుకూరుకు పొటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్..

మరోవైపు రాజేంద్ర నగర్ ఎమ్యెల్యే కూడా ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ కండువ కప్పుకొవడానికి రెడీ అయిపోయారు. బీఆర్ఎస్ మాత్రం.. కాంగ్రెస్ కు కనీసం రెండు సీట్లు వచ్చిన గొప్ప విషయమని అంటున్నారు. తెలంగాణలో తిరిగి కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయని, కాంగ్రెస్ ను ప్రజలు లోక్ సభ ఎన్నికలలో బుధ్ది చెప్పాలని కూడా బీఆర్ఎస్ కేసీఆర్ ప్రజలకు పిలుపు నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ కూడ దీనికి కౌంటర్ గట్టిగానే ఇస్తున్నారు. తమ పార్టీ నుంచి నక్కలాగా ఎమ్మెల్యేలను ఎగురవేసుకొని పోతే.. చూస్తు ఊరుకోమన్నారు.

ఈ క్రమంలో.. సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ స్థానికంగా సీఎం రాక సందర్భంగా బహింరంగ సమావేశం ఏర్పాటు చేశారు. కానీ సీఎం వచ్చాక కూడా హల్ లోని కూర్చిలన్ని ఖాళీగానే కన్పించాయి. దీంతో రేవంత్ దాదాపు అరగంటపాటు బస్సులోనే ఎదురు చూసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా..  జనసమీకరణలో స్థానికనేతలు, ఇతరనాయకులతో కలుపుకొని వెళ్లలేదని ఒకింత అసహానానికి కూడా గురయినట్లు సమాచారం.

Read More: Principal Facial In Classroom: స్కూల్ లో అమ్మాయిలతో ఫెషియల్ చేయించుకున్న ప్రిన్స్ పాల్.. వైరల్ వీడియో..

ఒకవైపు ఎండలు కూడా మండిపోవడంతో ప్రజలు, నాయకుల మధ్య సమన్వయం లేక మీటింగ్ కు ఎవరు రాలేకపోయినట్లు సమాచారం. చివరకు సీఎం రేవంత్ రెడ్డి సభలో పాల్గొని, తమ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా ప్రజలను అభ్యర్థించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలల గెలించి ఆరు గ్యారంటీల అమలుకై కాంగ్రెస్ ప్రభుత్వంప్రయత్నాలు  చేస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ .. ఇది కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పే ఎన్నికలంటూ.. మీరంతా ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని కూడా ప్రజలను కోరుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో కరెంట్ కోతలెప్పుడైన చూశామా.. అంటూ కూడా కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-04-19T13:43:30Z dg43tfdfdgfd