FACT CHECK: ఓటు వేసేందుకు వచ్చిన ముస్లిం మహిళలను పోలీసులు వెనక్కి పంపించారా?

Fact Check: ఉత్తర భారతదేశంలో ఓటు వేయడానికి వచ్చిన ముస్లిం మహిళలను పోలీసులు వెనక్కి పంపించారా? వీడియో వాస్తవం ఏంటి?

Claim: ఉత్తర భారతదేశంలో ముస్లిం మహిళలను ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలీసులు అనుమతించలేదు.

వాస్తవం: ఫిబ్రవరి 2022 రాంపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ ఓట్లు వేయడానికి ప్రయత్నించిన మహిళలను పోలీసులు అరెస్టు చేసి, అక్కడి నుంచి తొలగిస్తున్న దృశ్యాలు హల్‌చల్ చేస్తున్నాయి.

దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఓటింగ్‌కు సంబంధించి సోషల్‌మీడియాలో అనేక తప్పుడు ప్రచారం జరుగుతోంది. కేరళ సహా కొన్ని రాష్ట్రాల్లో రెండు దశల్లో ఓటింగ్ పూర్తయింది. కొన్ని ఉత్తర భారత రాష్ట్రాల్లో మొదటి రెండు దశల్లో పోలింగ్ కూడా పూర్తయింది. ఈ క్రమంలోనే ఉత్తర భారతదేశంలో ముస్లిం మహిళలు ఓటు వేయకుండా పోలీసులు నిషేధం విధిస్తున్నారనే వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (Archive)

(newsmeter.in టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది)

ఓటు వేసేందుకు వచ్చిన ముస్లిం మహిళలను పోలీసులు వెనక్కి పంపించారా?

తలకు పరదాలు, మాస్క్‌లు ధరించిన ఇద్దరు మహిళలను.. మహిళా పోలీసులు గేటు నుంచి బయటకు తీసుకెళ్తున్న దృశ్యాలను చాలా మంది షేర్ చేస్తున్నారు. (Archive 1, Archive 2, Archive 3)

Fact-check:

ఈ ప్రచారం నిరాధారమైనదని, ప్రసారం అవుతున్న వీడియో ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు సంబంధించినది కాదని న్యూస్‌మీటర్ విచారణలో తేలింది.

మొదటి దశ నిజనిర్ధారణలో, వీడియోలో చాలా మంది వ్యక్తులు మాస్క్‌లు ధరించినట్లు గుర్తించారు. ఈ ఫుటేజీ పాతది కావడానికి ఇది మొదటి సూచన. అలాగే, ఫుటేజీలో ఉన్న వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ప్రకారం, ఇది ఉత్తరప్రదేశ్‌కు చెందినది. కానీ ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల మూడో దశ 2024 మే 7న జరగనుంది. దీంతో ఆ వీడియో పాతది కావొచ్చన్న సంకేతాలు బలపడ్డాయి.

రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా తనిఖీ చేసిన తర్వాత, అదే ఫుటేజీని ఫిబ్రవరి 2022లో సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేసినట్లు తేలింది. (Archive 1, Archive 2)

ఓటు వేసేందుకు వచ్చిన ముస్లిం మహిళలను పోలీసులు వెనక్కి పంపించారా?

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో బురఖాలు ధరించి నకిలీ ఓటు వేయడానికి ప్రయత్నించిన మహిళలను పోలీసులు పట్టుకున్నారనే వివరణతో వీడియో షేర్ అయ్యింది. సంఘటనను ధృవీకరించే అనేక మీడియా నివేదికలు దాని ప్రామాణికతను ధృవీకరించడానికి కీలకపదాలు, తేదీలను ఉపయోగించి దాన్ని తనిఖీ చేసిన తర్వాత అందుబాటులో తెచ్చాం.

Current TV News ఈ ఇద్దరు మహిళలను పోలీస్ జీపులో ఎక్కించుతున్న దృశ్యాలను ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు. రాంపూర్‌లో నకిలీ ఓటు వేయడానికి ప్రయత్నించినందుకు పోలీసులు వారిని అరెస్టు చేశారని పోస్ట్‌లో క్యాప్షన్ ఉంది. (Archive)

ఓటు వేసేందుకు వచ్చిన ముస్లిం మహిళలను పోలీసులు వెనక్కి పంపించారా?

ఫిబ్రవరి 14, 2022న ఆజ్‌తక్ వెబ్‌సైట్‌లోని ఒక నివేదిక ప్రకారం, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ సందర్భంగా, రాంపూర్‌లో నకిలీ ఓట్లు వేసినందుకు ఆరుగురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. వారిలో నలుగురు మహిళలు ఉన్నారు.

ఓటు వేసేందుకు వచ్చిన ముస్లిం మహిళలను పోలీసులు వెనక్కి పంపించారా?

సర్క్యులేటింగ్ వీడియోలో ఇద్దరు మహిళలు పోలీసులతో పాటు ఉన్నట్లు చిత్రంలో చూడవచ్చు (దుస్తుల రంగులో స్వల్ప మార్పు సాంకేతికంగా అర్థమవుతుంది).

ఇతర మీడియా నివేదికల నుంచి మరింత నిర్దిష్ట సమాచారం లభించింది. 2022 ఫిబ్రవరి 14న హిందీ మీడియా దైనిక్ భాస్కర్ ఇచ్చిన నివేదికలో ఇద్దరు వ్యక్తులు తల్లీ, కూతురు అని, వారిలో ఒకరు తప్పుడు ఓటు నమోదు చేయబోయారని తెలిపారు. జాగరణ్ అనే వార్తా వెబ్‌సైట్‌లో అదే రోజు సంఘటనకు సంబంధించిన రిపోర్టును కూడా ఇక్కడ చూడవచ్చు.

ఓటు వేసేందుకు వచ్చిన ముస్లిం మహిళలను పోలీసులు వెనక్కి పంపించారా?

కొన్ని ఇతర మీడియా నివేదికలు సంఘటనకు సంబంధించిన సీనియర్ పోలీసు అధికారుల ప్రతిస్పందనను కూడా కలిగి ఉన్నాయి.

అందువల్ల వైరల్ అవుతున్న ఫుటేజీకి 2024 లోక్‌సభ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని తేలిపోయింది.

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ ఉప ఎన్నికలకు సంబంధించి, 2022 డిసెంబర్‌లో ముస్లిం మహిళలకు ఓటు వేసే అవకాశం ఇవ్వలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రసారం చేశాయి. అయితే సర్క్యులేట్ అవుతున్న వీడియోకీ, దానికీ ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టమవుతోంది.

ఓటు వేసేందుకు వచ్చిన ముస్లిం మహిళలను పోలీసులు వెనక్కి పంపించారా?

Conclusion:

ఉత్తర భారతదేశంలో ముస్లిం మహిళలు ఓటు వేయకుండా పోలీసులు నిషేధం విధిస్తున్నారని హల్‌చల్ చేస్తున్న వీడియో నిజానికి.. 2022 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నకిలీ ఓట్లు వేయడానికి ప్రయత్నించిన మహిళలను పోలీసులు అరెస్టు చేసి, అక్కడి నుంచి పంపిస్తున్న ఫుటేజీ అని న్యూస్‌మీటర్ దర్యాప్తు ధృవీకరించింది.

Claim Review: ఉత్తర భారతదేశంలో ముస్లిం మహిళలను ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలీసులు అనుమతించలేదన్నది నిజం కాదు.

Claimed By:Social Media Users

Claim Reviewed By:NewsMeter

Claim Source:Facebook

Claim Fact Check:False

(శక్తి కలెక్టీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా newschecker అందించిన ఇన్‌పుట్స్ ఆధారంగా ఈ కథనం పబ్లిష్ చేశాం.)

2024-05-06T07:45:20Z dg43tfdfdgfd