FACT CHECK: ముస్లిం రెస్టారెంట్లు ఆహారంలో నపుంసకత్వ మాత్రలు కలుపుతున్నాయా..? నిజమేంటి..?

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే వీటిలో నిజమైనవి ఎన్ని ఉన్నాయనేది ప్రజలకు తెలియదు. చాలా వరకు నకిలీ వీడియోలే ప్రజలకు ఎక్కువగా రీచ్ అవుతాయి. తాజాగా 2.06 నిమిషాల నిడివి గల వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. ముస్లింల ఆధ్వర్యంలో నడిచే రెస్టారెంట్లు, ఆహారంలో నపుంసకత్వ మాత్రలను కలుపుతున్నాయని కేరళ కాంగ్రెస్ మాజీ నేత PC జార్జ్‌ ఆరోపించినట్లు వీడియోలో కనిపిస్తుంది.

(ఇది newschecker ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఫ్యాక్ట్ చేసిన స్టోరీ ఇది)

@jpsin1 అనే ఎక్స్‌ హ్యాండిల్‌ షేర్ చేసిన ఈ పోస్ట్‌కి 761 లైక్‌లు, 1,200 షేర్లు వచ్చాయి, మొత్తం 26.4K ఎంగేజ్‌మెంట్ ఇతర సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఇదే పోస్ట్‌ను షేర్ చేశారు, ఇలాంటి వాదనలు చేస్తున్నారు. అయితే, ఈ వీడియో 2022 నాటిదని తెలిసింది. 2015లో కేరళ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కొన్ని ఏళ్లకు PC జార్జ్ ఈ ప్రకటనలు చేశారని సమాచారం.

Screengrab from X post by @jpsin1

ఈ వైరల్ మెసేజ్‌కు సంబంధించి కొన్ని కీ వర్డ్స్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తే.. ఈ పోస్ట్‌లు 2022, మే నెల నుంచి షేర్ అవుతున్నాయని తెలిసింది. వీడియోలో "హిందూ మహాసమేల్లనం 2022" అని మలయాళంలో ఒక బ్యానర్ ఉంది. అయితే మలయాళంలో "PC జార్జ్", "హిందూ మహాసమేల్లనం", "నపుంసకత్వ మాత్ర" వంటి కీవర్డ్స్‌తో సెర్చ్ చేస్తే మరొక విషయం తెలిసింది. ఈ కీవర్డ్స్‌తో గూగుల్ సెర్చ్ చేస్తే 2022, ఏప్రిల్ 30 నాటి న్యూస్ 18 మలయాళం ఆర్టికల్ కనిపించింది. ఇది ఒక ఈవెంట్ గురించి వివరించింది.

* మతపరమైన వ్యాఖ్యలు

న్యూస్18 మలయాళం ఆర్టికల్ ప్రకారం, ముస్లింల గురించి బాధ కలిగించే మాటలు మాట్లాడినందుకు మాజీ రాజకీయ నాయకుడు PC జార్జ్‌పై MSF మాజీ నాయకుడు పోలీసు చీఫ్‌కి ఫిర్యాదు చేశారు. ఎంఎస్‌ఎఫ్‌ (MSF)లో ఉన్నత స్థాయి సభ్యుడిగా పనిచేసిన పీపీ షైజల్‌ ఫిర్యాదు చేశారు. తిరువనంతపురంలో జరిగిన ఓ హిందూ కార్యక్రమంలో పీసీ జార్జ్ ప్రసంగిస్తూ ముస్లింలపై తప్పుడు, హానికరమైన వ్యాఖ్యలు చేశారని చెప్పారు.

Facebook post by Rama Sharma

భారతీయులు పిల్లలను కనకుండా ఉండేందుకు ముస్లింలు పానీయాలలో డ్రగ్స్ కలుపుతున్నారని, దేశాన్ని ముస్లిం మెజారిటీ దేశంగా మార్చాలని చూస్తున్నారని PC జార్జ్‌ ఆరోపించారు. ముస్లిం మత పెద్దలు ఆహారం ఇవ్వడానికి ముందు వాటిపై ఉమ్మి వేస్తారని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటనలు వివిధ వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని కథనం పేర్కొంది.

Report by News 18

2022 మే 1న ఫేస్‌బుక్‌లో 2 నిమిషాల నిడివి గల వీడియోను తౌఫీక్ పొక్కకిల్లత్ ఇస్మాయిల్ అనే వ్యక్తి షేర్ చేశారు. 1 నిమిషం 19 సెకన్ల వరకు ఆ వీడియోను చూస్తే, డ్రింక్స్‌లో పిల్లలను కనకుండా నిరోధించే డ్రగ్స్‌ను ముస్లింలు మిక్స్ చేస్తున్నారని PC జార్జ్ చెప్పడం వినవచ్చు. దేశాన్ని ముస్లిం మెజారిటీ దేశంగా మార్చడానికి ముస్లింలు చాలా మంది పిల్లలను కనాలని కూడా కోరుకుంటున్నారని కూడా ఆయన చెప్పారు.

Thoufeeq Pokkakkillath Ismail’s Post

* ఇప్పటికీ కాంగ్రెస్ నాయకుడేనా?

PC జార్జ్ కేరళలోని పూంజర్‌ నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన చాలా ఏళ్లు కేరళ కాంగ్రెస్‌లో భాగంగా ఉన్నారు. 2016లో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలకు పోటీ చేసి 27,000 ఓట్లతో గెలుపొందారు. అయితే, 2021 ఎన్నికల్లో 16,000 ఓట్ల తేడాతో సెబాస్టియన్ కులతుంకల్ అనే LDF పార్టీ అభ్యర్థిపై ఓడిపోయారు. అంతకుముందు, 2011-2015 కాలంలో కేరళ కాంగ్రెస్ (ఎం) వర్గ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని UDF ప్రభుత్వానికి చీఫ్ విప్‌గా ఉన్నారు.

కేరళ రాష్ట్ర అసెంబ్లీలో ఏకైక స్వతంత్ర సభ్యుడిగా ఉండే PC జార్జ్, 2017, ఫిబ్రవరిలో కేరళ జనపక్షం అనే పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రారంభించారు. 2019లో ఆ పార్టీ BJP నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)లో కలిసింది. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్‌, సీపీఎం పార్టీలతో కలిసి పని చేయలేదు. 2024లో జాతీయ ఎన్నికలకు ముందు, PC జార్జ్ తన పార్టీని BJPతో కలిపారు. ఫిబ్రవరి 28న తిరువనంతపురంలో ఒక పెద్ద ఈవెంట్‌లో బీజేపీలో చేరుతున్నట్లు చూపించే ఫోటోను కూడా పోస్ట్ చేశారు.

Facebook post by P C George

* నిజమేంటి?

ప్రస్తుతం బీజేపీతో అనుబంధం ఉన్న PC జార్జ్ వీడియోను ఇప్పుడు కొందరు రీషేర్ చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఆయన నిరాధార వ్యాఖ్యలు చేశారు. కానీ ఈ వీడియోలో చెప్పినట్లు ముస్లింలు ఫుడ్స్‌, డ్రింక్స్‌లో ఎలాంటి మాత్రలు కలపడం లేదు.

(శక్తి కలెక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా newschecker అందించిన ఇన్‌పుట్స్ ఆధారంగా ఈ కథనం పబ్లిష్ చేశాం.)

2024-05-02T10:15:31Z dg43tfdfdgfd