FIRE BREAKS OUT: నందిగామలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 150 మంది?

Fire Accident: వేసవి నేపథ్యంలో మరో పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనం మొత్తం దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో అందులో పని చేసే ఉద్యోగులు, కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. మంటలు చిక్కుకుపోవడంతో వారంతా బయట పడేందుకు తీవ్ర తంటాలు పడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నాయి. ఈ సంఘటన తెలంగాణలోని నందిగామలో చోటుచేసుకుంది.

Also Read: Viral Video: బ్యాచిలర్‌ పార్టీలో స్నేహితుల మధ్య గొడవ.. అంకుల్‌ వచ్చి చితక్కొట్టాడు

 

హైదరాబాద్‌ శివారు ప్రాంతం రంగారెడ్డి జిల్లా నందిగామలో ఉన్న ఆల్విన్ ఫార్మా కంపెనీ ఉంది. ఈ కంపెనీలో శుక్రవారం సాయంత్రం 4 గంటల మధ్య మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు, పొగ వ్యాపించడంతో స్థానికంగా భయానక వాతావరణం చోటుచేసుకుంది. ప్రమాదంతో కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు భవనంలోని కిటికీల ద్వారా బయటకు వచ్చారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.

Also Read: Tragedy: రెచ్చిపోయిన కాంగ్రెస్‌ కార్యకర్తలు.. రాళ్లు, కర్రలతో కొట్టి బీఆర్ఎస్ కార్యకర్త దారుణ హత్య

అయితే ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీ భవనంలో దాదాపు 150 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. వారంతా మంటల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మంటలతో కొందరు కార్మికులు కిటికీలోంచి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. కాగా సమాచారం వార్త తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ సహాయ చర్యలు పర్యవేక్షించారు. అయితే ప్రమాదానికి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా తెలుస్తోంది. లేదంటే వేసవి ఉష్ణోగ్రతలతో మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కానీ భారీస్థాయిలో ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-04-26T13:04:57Z dg43tfdfdgfd