GUINNESS WORLD RECORD : కేవలం 2.88 సెకన్లలోనే 'Z నుంచి A' వరకు టైపింగ్ - గిన్నిస్‌ రికార్డు సాధించిన హైదరాబాదీ

Hyderabadi S K Ashraf Guinness World Record : హైదరాబాద్‌కు చెందిన ఎస్‌కే అష్రాప్(S K Ashraf) అసాధారణ రికార్డును సృష్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంగ్లీష్ వర్ణమాలను Z నుంచి A వరకు(english alphabet) కేవలం 2.88 సెకండ్ల వ్యవధిలోనే టైప్ చేసి గిన్నిస్ రికార్డు(Guinness World Record)ను సృష్టించాడు.

గిన్నిస్ వరల్డ్ రికార్డు(Guinness World Record) ఇన్ స్టా గ్రామ్ పేజీలో ఈ వీడియోను కూడా షేర్ చేసింది. క్షణాల వ్యవధిలోనే ఇంగ్లీష్ అక్షరాలు వెనక నుంచి రాసే ప్రక్రియను ముగించేశాడు.

ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన గంటల వ్యవధిలోనే ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. ఆష్రాఫ్ ప్రతిభను చూసిన నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. వెల్ డన్ అష్రాప్ అంటూ అభినందనలు తెలపగా… మరికొందరూ ఈ రికార్డును తిరగరాసే అవకాశం ఉంటుందని రాసుకొచ్చారు.

ఈ వీడియోను వీక్షించిన ఓ నెటిజన్ స్పందిస్తూ…"ఇది నమ్మశక్యం కాని రికార్డు" అని తెలిపారు. మరో యూజర్ స్పందిస్తూ… "కనీసం నేను ఈ రోజు అర్ధవంతమైన ప్రపంచ రికార్డు పోస్ట్‌ను చూశాను" అని రాసుకొచ్చారు.

"అతని రికార్డ్ మాకు చాలా గర్వంగా ఉంది," అని ఓ భారతీయ నెటిజన్ పోస్ట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ… "నేను ఆ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టగలను" అని ధీమాను వ్యక్తం చేశాడు. తెలంగాణకు చెందిన ఎస్కే అష్రాఫ్(S K Ashraf) ఫిబ్రవరి 5న ఈ రికార్డును సాధించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్లాక్ నివేదించింది.

2024-05-04T01:25:19Z dg43tfdfdgfd