HOLIDAYS: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. కాలేజీలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..!

తెలంగాణ లోని ఇంట‌ర్ కాలేజీ ల‌కు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు సెల‌వులు ప్ర‌క‌టించింది. ఈ నెల 30వ తేదీ నుంచి మే 31వ తేదీ దాకా సెలవులు కొన‌సాగ‌ నున్నాయి. మ‌ళ్లీ జూన్ 1వ తేదీన కాలేజీలు తెరుచు కోనున్నాయి.
ఈ సెల‌వులు రాష్ట్రం లోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు, ఎయిడెడ్ ఇంట‌ర్మీడియ‌ట్ కాలేజీల‌కు వ‌ర్తించ‌ నున్నాయి. ఇంట‌ర్ బోర్డు ఆదేశాల‌ను ఉల్లంఘించి కాలేజీ ల‌ను నిర్వ‌హించే వారిపై చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.
వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రానికి ఇంట‌ర్ బోర్డు ఆదేశాల‌కు అనుగుణంగా అడ్మిష‌న్లు తీసుకోవాల‌ని, ఆ తేదీల‌ను ప్ర‌క‌టించిన‌ప్పుడే ప్ర‌వేశాల ప్ర‌క్రియ చేప‌ట్టాల‌ని సూచించారు..
అటు ఏపీ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రయివేట్, ఎయిడెడ్ కాంపోజిట్ కార్పోరేట్ జూనియర్ కళాశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. ఈనెల 31వ తేదీ నుంచి మే 31 రెండు నెలల పాటు సెలవులను ఇస్తున్నట్టు ఇంటర్ విద్యామండలి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలు జరిగాయి. జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ కళాశాలలు పునః ప్రారంభవుతాయని పేర్కొంది. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కళాశాలలపై చర్యలు తప్పవని అవసరమైతే అనుబంధ గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది.
ఇంటర్ బోర్డు ప్రకటన తర్వాత కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకోవాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. తాజా నిర్ణయంతో ఇంటర్ విద్యార్థులకు దాదాపు రెండు నెలల పాటు వేసవిసెలవులు వచ్చాయి.దీంతో సొంతూళ్లకు వెళ్లడానికి... సెలవుల్ని ఎంజాయ్ చేయడానికి విద్యార్థులు ప్లాన్ చేసుకుంటున్నారు.

2024-03-29T02:15:28Z dg43tfdfdgfd