HYDERABAD METRO: హైదరాబాద్‌లో భారీ వర్షానికి మెట్రో రైళ్లు నిలిచిపోయాయా?

హైదరాబాద్‌లో గంటన్నర పాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. ఈ భారీ వర్షానికి... జన జీవన అస్తవ్యస్తమయ్యింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వర్షానికి  ఈదురు గాలులు తోడవ్వడంతో...  హోర్డింగులు, చెట్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నగరంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే.. భారీ వర్షానికి కరెంట్ కూడా లేకపోవడంతో...   మెట్రో సర్వీసులు నిలిచిపోయాయని వార్తలు వచ్చాయి. ఇంకొంత మంది ముందు జాగ్రత్తగా మెట్రో రైళ్లను నిలిపేశారని ప్రచారం చేశారు. దీంతో ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, వర్కర్స్ టెన్షన్ పడ్డారు. 

అయితే ఇవన్నీ  ఫేక్ వార్తలని  మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఖండించారు. అలాంటిదేమీ లేదని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ క్లారిటీ ఇచ్చింది. భారీ వర్షం కారణంగా మెట్రో రైళ్ల సర్వీసులకు ఎక్కడా అంతరాయం కలగలేదని మెట్రో రైలు సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మెట్రో రైళ్లు నడుస్తున్నాయని ఆయన తెలిపారు. 

అయితే భారీ వర్షానికి..  రోడ్లపై ట్రాఫిక్ జామ్ వల్ల బస్సులకు వెళ్లే వారు సైతం మెట్రో రైళ్లకు వెళ్తున్నారు. దీంతో మెట్రో స్టేషన్లు అన్నీ  ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మెట్రోలో వెళ్లేందుకు ప్రయాణికులు భారీగా మెట్రో స్టేషన్లకు వెళ్తుండడం వల్ల అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో రద్దీ నెలకొంది. చాలా మెట్రో స్టేషన్లలో సాధారణం కంటే అధికంగా జనాలు కనిపించారు. వర్షం పడటంతో మెట్రో రైలు దిగినా కూడా.. స్టేషన్లలోనే వెయిట్ చేశారు.

2024-05-07T15:19:25Z dg43tfdfdgfd