JEE MAIN 2024 RESULTS: జేఈఈ మెయిన్‌ 2024 తుది ఫలితాలు విడుదల, సత్తాచాటిన తెలుగు విద్యార్థులు

JEE Main 2024 Results: జేఈఈ మెయిన్ 2024 సెషన్-2 పరీక్ష ఫలితాలను ఎన్‌టీఏ(NTA) విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రెండు సెషన్లకు కలిపి ఎన్‌టీఏ ర్యాంకులను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసింది. ఫలితాలతోపాటు కేటగిరీల వారీగా కటాఫ్‌ను సైతం ఎన్‌టీఏ ప్రకటించింది. రెండు సెషన్లలో పాల్గొన్న అభ్యర్థుల ఉత్తమ స్కోరును తుది మెరిట్ జాబితాకు పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 14.1 లక్షల మంది మెయిన్స్‌ పరీక్షలకు హాజరు అయ్యారు. అభ్యర్థుల్లో దాదాపు 96 శాతం మంది జేఈఈ అడ్వాన్స్ డ్ కు అర్హత సాధించారు.

జేఈఈ మెయిన్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 56 మంది 100 పర్సంటైల్‌ స్కోరు సాధించారు. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తాచాటారు. మొత్తం 22 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. వీరిలో తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురు ఉన్నారు. 100 శాతం మార్కులతో ఏడుగురు అభ్యర్థులతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లు రెండో స్థానంలో నిలిచాయి. ఆరుగురు అభ్యర్థులతో ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది.

జేఈఈ మెయిన్ 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి..

కటాఫ్ మార్కుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

జాతీయ స్థాయిలో అత్యధిక స్కోర్ సాధించిన వారిలో తెలుగు విద్యార్ధులే అధికంగా ఉండటం విశేషం. దేశంలోని 23 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత సాధించిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఐదేళ్ల గరిష్ట స్థాయికి వీరి సంఖ్య చేరింది. జేఈఈ మెయిన్స్‌లో విశాఖపట్నానికి చెందిన రెడ్డి అనిల్‌కు జాతీయస్థాయిలో 9వ ర్యాంకు, కర్నూలుకు చెందిన కేశం చెన్న బసవారెడ్డికి జాతీయస్థాయిలో 14వ ర్యాంకు, ఈడబ్ల్యుఎస్‌లో మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నాడు. వైయస్‌ఆర్ జిల్లాకు చెందిన అన్నారెడ్డి వెంకట తనీష్ రెడ్డికి జాతీయస్థాయిలో 20వ ర్యాంకు, ఈడబ్ల్యుఎస్‌లో మూడో ర్యాంకులో నిలిచాడు. ఇదే జిల్లాకు చెందిన తోటంశెట్టి నిఖిలేష్‌కు జాతీయస్థాయిలో 21వ ర్యాంకు లభించింది. ఇక ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్ సెషన్‌-2లో ఇద్దరు బాలికలు సహా 56 మంది అభ్యర్థులు 100 ఎన్టీఏ స్కోరు సాధించారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం రాత్రి ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లో 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు..

విద్యార్థి పేరు రాష్ట్రం
హందేకర్ విదిత్  తెలంగాణ
ముత్తవరపు అనూప్  తెలంగాణ
వెంకటసాయి తేజ మదినేని  తెలంగాణ
రెడ్డి అనిల్  తెలంగాణ
రోహన్ సాయి పబ్బ తెలంగాణ
శ్రీయాశస్ మోహన్ కల్లూరి  తెలంగాణ
కేసం చెన్నబసవరెడ్డి  తెలంగాణ
మురికినటి సాయి దివ్యతేజరెడ్డి  తెలంగాణ
రిషి శేఖర్ శుక్లా తెలంగాణ
తవ్వ దినేశ్ రెడ్డి తెలంగాణ
గంగ శ్రేయాస్  తెలంగాణ
పొలిశెట్టి రితీశ్ బాలాజీ  తెలంగాణ
తమటం జయదేవ్ రెడ్డి తెలంగాణ
మరువు జస్విత్  తెలంగాణ
దొరిసాల శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ
చింటు సతీశ్ కుమార్  ఆంధ్రప్రదేశ్
షేక్ సూరజ్  ఆంధ్రప్రదేశ్
తోటంశెట్టి నిఖిలేశ్  ఆంధ్రప్రదేశ్
తోట సాయికార్తిక్  ఆంధ్రప్రదేశ్
మురసని సాయి యశ్వంత్ రెడ్డి  ఆంధ్రప్రదేశ్
మాకినేని జిష్ణుసాయి  ఆంధ్రప్రదేశ్
అన్నారెడ్డి వెంకట తనీష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్

56 మంది టాపర్లలో జనరల్ కేటగిరీ నుంచి 40 మంది విద్యార్ధులు, ఓబీసీ కేటగిరీ నుంచి 10 మంది, జనరల్-ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నుంచి ఆరుగురు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన ఏ అభ్యర్థి కూడా ఈ ఏడాది 100 ఎన్టీఏ స్కోరు సాధించలేకపోయారు. ఎన్టీఏ స్కోరు, వచ్చిన మార్కుల శాతం సమానంగా లేవని అధికారులు చెబుతున్నారు.

ఈ ఏడాది జేఈఈ మెయిన్ 2024 సెషన్-1 పరీక్షలను జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఎన్టీఏ నిర్వహించింది. సెషన్-1 పరీక్షలకు 12,95,617 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 12,25,529 మంది హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను ఫిబ్రవరి 13న విడుదల చేసింది. ఇక సెషన్-2 పరీక్షలను ఏప్రిల్‌ 4 నుంచి 12 వరకు ఎన్టీఏ నిర్వహించింది. దేశవ్యాప్తంగా 12.57 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. సెషన్-2 ఫలితాలతోపాటు, రెండు సెషన్లకు సంబంధించిన ర్యాంకుల వివరాలను ఎన్టీఏ తాజాగా ప్రకటించింది.

2024-04-25T04:22:56Z dg43tfdfdgfd