JOB ALERT: నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేశారా..?

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా..? మంచి నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే మీకు గుడ్‌న్యూస్. వివిధ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్స్ జారీ అయ్యాయి. ప్రధానంగా పోలీస్, మెడికల్, అప్రెంటీస్ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ ప్రారంభమైంది. ఈ వారం దరఖాస్తు చేసుకోవాల్సినవి ఏవో చూద్దాం.

* ESIC రిక్రూట్‌మెంట్

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) బోర్డ్ ఈఎస్ఐ ఆసుపత్రుల్లో ఫుల్‌టైమ్ స్పెషలిస్ట్ (FTS), ఫార్ట్ టైమ్ స్పెషలిస్ట్ (PTS) పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు ఈఎస్‌ఐసీ వెబ్‌సైట్ www.esic.gov.in విజిట్ చేసి ఏప్రిల్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల వయసు 69 ఏళ్ల లోపు ఉండాలి. గుర్తింపు పొందిన మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. ఫుల్‌టైమ్ స్పెషలిస్ట్‌ అభ్యర్థులకు జీతం నెలకు రూ.1,06,000 కాగా, పార్ట్‌టైమ్ స్పెషలిస్ట్‌కు రూ. 60,000 లభిస్తుంది.

* అసిస్టెంట్ కమాండెంట్ రిక్రూట్‌మెంట్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఎస్ ఎస్‌బీ వంటి సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌ల్లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు UPSC వెబ్‌సైట్ upsc.gov.in విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ గడువు మే 14న ముగుస్తుంది. 506 అసిస్టెంట్ కమాండెంట్ (గ్రూప్ A) ఉద్యోగాల భర్తీకి ఆగస్టు 4న రాత పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులకు కనీసం 20 నుంచి 25 ఏళ్ల వయసు ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

* ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్

ఇండియన్ నేవీ 8వ తరగతి, పదో తరగతి అర్హతతో అప్రెంటిస్‌షిప్ అవకాశాలు కల్పిస్తోంది. మొత్తం 300 అప్రెంటిస్ పొజిషన్స్ భర్తీ కానున్నాయి. అర్హులైన విద్యార్థులు ఇండియన్ నేవీ పోర్టల్ indiannavy.nic.in విజిట్ చేసి మే 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల వయసు 14 నుంచి 18 ఏళ్ల మధ్య ఉండాలి. అప్రెంటీస్‌లకు నెలకు స్టైఫండ్ రూ.7,700 నుంచి రూ.8050 లభిస్తుంది.

ఇది కూడా చదవండి: ధోని శిష్యుడి దెబ్బకి టీమిండియాలో గిల్ ప్లేస్ గల్లంతు.. అయోమయంలో రోహిత్ శర్మ!

* బీఎస్‌ఎఫ్ రిక్రూట్‌మెంట్

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF)లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యూపీఎస్సీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్‌తో బీఎస్‌ఎఫ్‌లో 186 అసిస్టెంట్ కమాండెంట్ ఖాళీలు భర్తీ కానున్నాయి. గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి డిగ్రీ చదివిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. UPSC అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in విజిట్ చేసి మే 14 లోపు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. అభ్యర్థుల ఎంపికలో భాగంగా రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్‌, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.

* WBPSC రిక్రూట్‌మెంట్

పశ్చిమ బెంగాల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (WBPSC) జూనియర్ ఫిషరీ సర్వీసెస్ గ్రేడ్ II డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్, ఫిషరీ సూపర్‌వైజర్, ఫిషరీస్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ వంటి పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు మే 13లోపు అధికారిక పోర్టల్ psc.wb.gov.in విజిట్ చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ చదివి ఉండాలి.

2024-04-29T06:02:32Z dg43tfdfdgfd