KADHA TEA: బిల్‌గేట్స్‌కి తన ఆరోగ్య రహస్యం చెప్పిన ప్రధాని మోదీ.. ఆ టీ వల్లే..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ మధ్య చాయ్ చర్చ కార్యక్రమం ఆసక్తిగా సాగింది. ఈ భేటీలో ఇద్దరూ చాలా అంశాలపై చర్చలు జరిపారు. ఈ క్రమంలో తన ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. తాను ఉదయాన్నే.. తెల్లవారక ముందే నిద్రలేస్తాననీ, యోగా చేస్తాననీ చెబుతూనే.. తాను కధా టీ (Kadha Tea) తాగుతానని చెప్పారు. ఆ టీ తన ఆరోగ్యాన్ని పెంచుతోంది అన్నారు.

ఇండియాలోకి కరోనా వైరస్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ కథా టీని తాగమని సూచించింది. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం తాను కధా పానీయం తాగుతానని దేశ ప్రజలకు చెప్పారు.

కధా అనేది ఆయుర్వేద మూలికలతో తయారయ్యే టీ లాంటి ఔషధం లేదా పానీయం అనుకోవచ్చు. హిమాలయాల్లోని మూలికలు, సుగంద ధ్రవ్యాలతో దీన్ని తయారుచేసుకోవచ్చు. ఇందులో తులసి ఆకులు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, శొంఠి, ఎండుద్రాక్ష, యాలకులు ఉంటాయి. వీటన్నింటిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలున్నాయి. వ్యాధుల్ని నయం చేసే శక్తి ఉంది. అందుకే రోజూ దీన్ని ఒక్కసారైనా తాగితే… రకరకాల వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ డ్రింక్ తాగితే… ఇన్ఫెక్షన్లు రావు. జీర్ణక్రియ మెరుగవుతుంది. బాడీలో విష వ్యర్థాలు బయటకు పోతాయి.

కధా డ్రింక్ తయారీకి కావాల్సినవి: తులసి ఆకులు - 1 టేబుల్ స్పూన్, యాలకులు - 1 టేబుల్ స్పూన్, దాల్చినచెక్క - 1 టేబుల్ స్పూన్, శొంఠి - 1 టేబుల్ స్పూన్, నల్ల మిరియాలు - 1 టేబుల్ స్పూన్, కొద్దిగా ఎండు ద్రాక్ష, నీరు - 2 నుంచి 3 కప్పులు, తేనె లేదా బెల్లం (ఇది ఆప్షనల్), తాజా నిమ్మరసం కొద్దిగా.

కధా డ్రింక్ తయారీ విధానం: ముందుగా నల్ల మిరియాలు, దాల్చిన చెక్కను మెత్తగా పొడిలా చేసుకోవాలి. వాటర్‌ని గిన్నెలో పోసి… వేడి చెయ్యాలి. తులసి ఆకులు వేసి… 5 నిమిషాలు సిమ్‌లో ఉంచాలి. ఇప్పుడు నల్లమిరియాలు, దాల్చిన చెక్క పొడిని వెయ్యాలి. వెంటనే శొంఠి వేసి… నీరు ఉడకనివ్వాలి. ఇప్పుడు నీరు సగానికి తగ్గిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకోవచ్చు. చివర్లో తేనె లేదా బెల్లం వేసి… నిమ్మరసం వేసుకోవాలి.

రెడీ అయిన కథా టీని కప్‌లోకి వడగట్టి… అలా అలా సిప్ చేస్తూ… తాగుతూ ఉంటే… మంచి టేస్ట్, సువాసనకి తోడు… ఆరోగ్యం కూడా. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ… ఈ డ్రింక్‌ని రోజూ రెండుసార్లు తాగమని చెప్పింది. పైన చెప్పిన మోతాదులతో 2 టీలు (ఇద్దరు తాగేందుకు) తయారవుతాయి. ప్రస్తుతం ఈ టీకి సంబంధించి ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో రకరకాల కథా టీపొడి ప్యాకెట్లు లభిస్తున్నాయి.

---- Polls module would be displayed here ----

ప్రధాని నరేంద్ర మోదీ, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో పలు అంశాలపై చర్చలు జరిపారు. ఆరోగ్యం నుంచి సాంకేతికత, వాతావరణం వంటి ముఖ్యమైన అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది.

2024-03-29T04:45:36Z dg43tfdfdgfd