KONDAGATTU TEMPLE: కొండగట్టు ఆలయానికి హనుమాన్ భక్తుల పాదయాత్ర

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం.భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ సుమారు 600 సంవత్సరాల క్రితం వెలిసారు స్వామి. ఐతే ఇక్కడ ప్రత్యేకత హనుమాన్ మాల దీక్ష, హనుమాన్ దీక్ష తీసుకొన్నవారు మండల కాలం దీక్షను కఠిన నియమాలు పాటిస్తూ.. ఉంటారు..మాల విరమణ చేయాలంటే.. అంజన్న భక్తులు తమ స్వగ్రామముల నుండి ఎక్కువగా పాదయాత్ర ద్వారా కొండగట్టుకు చేరుకొని అక్కడ స్వామి వారిని దర్శించుకొని మాల విరమణ చేస్తారు.. ఐతేఆంజన్న మాల వేసుకున్న భక్తులు ఎక్కువగా కాలినడకన అంజన్నను దర్శించుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే హనుమంతుని అంత బలశాలి కావాలని ఆ అంజన్న కరుణ మనపై ఉండాలంటే ఇలా నడక ద్వారా రావడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

జై హనుమాన్,జై శ్రీ రామ్ అంటూ ఒక గుంపుగా బయలు దేరి స్వామి వారిని మొక్కుతారు. మండుటెండలో కూడా ఈ పాదయాత్ర చేయడం రామనామ స్మరణతో రామదూత దగ్గరకి రావడం మాకెంతో ఆనందాన్నిస్తుందని దీక్షాపరులు అంటున్నారు.. మండుటెండలో కూడా దాదాపు 200నుండి 300 కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ వచ్చి స్వామి వారిని దర్శించు కుంటామని దీక్షపరులు లోకల్ 18 కు తెలిపారు.

Kondagattu Temple: ఆవు తప్పిపోయింది... ఆంజనేయుడు కలలోకి వచ్చాడు... ఆ తర్వాత ఏం జరిగిందంటే

కొండపైన ఉండే దేవుళ్లకు కాలినడకన కొండ ఎక్కడం ఆ దేవుళ్ళకి ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందని అందుకే ఏడుకొండలు కూడా చాలామంది కాలినడకన ఎక్కుతారని అదేవిధంగా కొండ పైన ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి కూడా అదేవిధంగా కాలినడకన వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకొని ముడుపులు కడతారని భక్తులు తెలియజేస్తున్నారు.

ఏ దేవతలకు లేనట్టుగా ఒక్క హనుమంతుడికి మాత్రమే రెండు జయంతి వేడుకలు ఎందుకు? తెలుసుకోండి

ప్రతి చైత్ర వైశాఖమాసంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ చిన్న జయంతి, పెద్ద జయంతి వేడుకలు జరుగుతాయి. ఈజయంతికి హనుమాన్ దీక్షపరులు మాలలు ధరించి 41 దీక్షలు చెప్పటి అదిలాబాద్, నిజాంబాద్, వరంగల్, నుండి స్వాములు పాదయాత్రగా చేరుకొని స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఈసారి స్వామివారి జయంతికి సుమారు నాలుగు లక్షల మంది కొండగట్టు అంజన్న దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ ఈవో అన్నారు.

2024-04-23T10:09:42Z dg43tfdfdgfd