LOK SABHA POLLS 2024 1ST PHASE: తమిళనాడు సహా దేశ వ్యాప్తంగా 102 లోక్ సభ స్థానాలకు ప్రారంభమైన తొలి దశ పోలింగ్..

Lok Sabha Polls 2024 1st Phase: దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి  543 లోక్ సభ నియోజక వర్గాలకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అందులో 102 లోక్ సభ సీట్లకు  తొలి విడత ఎన్నికలు  ఈ రోజు ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైంది. ఇక ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. ఈ ఎన్నికల్లో అరుణాల్ ప్రదేశ్‌లెని 60 అసెంబ్లీ సీట్లతో పాటు.. సిక్కింలోని 92 శాసనసభ స్థానాలకు మొదటి విడతలో ఎన్నికలు జరగుతున్నాయి.

ఇందులో తమిళనాడులోని మొత్తం 39 లోక్ సభ స్థానాలతో పాటు రాజస్థాన్‌లో 12, యూపీలో 8, మధ్య ప్రదేశ్‌లోని 6 స్థానాలు, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సామ్ రాష్ట్రాల్లో 5 చొప్పున .. బిహార్‌, పశ్చిమబంగ రాష్ట్రంలో 3.. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్‌లలతో 2 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అటు నక్సల్ ప్రభావిత రాష్ట్రం ఛత్తీస్ ఘడ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర , జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఒక్క లోక్ సభ సీట్లు మొదటి విడతలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికీ పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు.

ఇప్పటికే ఎన్నికల సంఘం పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల  క్రతువు సజావుగా సాగేందకు ఈసీ తగు చర్యలకు ఉపక్రమించింది. అంతేకాదు కీలకమైన సమస్యాత్మక ప్రాంతాల్లోపారా మిలటరీ దళాలను మోహరించింది.

మొత్తంగా 102 లోక్ సభ సీట్లలో (73 జనరల్ స్థానాలు.. 11 ఎస్టీ.. 18 ఎస్సీ స్థానాలున్నాయి)

బరిలో ఉన్న అభ్యర్ధులుఫ 1625 మంది ( 1491 మంది పురుషులు .. 134 మంది స్త్రీలు ఉన్నారు)

మొత్తం 1 లక్షా 87 వేల పోలింగ్ కేంద్రాల్లో 18 లక్షల మంది సిబ్బింది విధుల్లో ఉన్నారు.

16.63 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కను వినియోగించుకోనున్నారు. అందులో పురుషులు 8.4 కోట్లు.. మహిళలు 8.23 కోట్ల.. ఇతరులు 11, 371 మంది ఉన్నారు.)

తొలిసారి 35.67 లక్షల మంది తొలిసారి ఓటు వేయబోతున్నారు.

పోలింగ్ ఏర్పాట్లకు 41 హెలికాప్టర్లు.. 8 ప్రత్యక రైళ్లతో పాటు సుమారు లక్షకు పైగా వాహానాలను ఈసీ సమకూర్చింది.

50 శాతానికి పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు. అన్ని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్‌ల నియామకం చేసింది.

85 యేళ్లు దాటిన 14.14 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు.. 13.89 లక్షల మంది దివ్యాంగులు ఇంటి వద్దే ఓటు హక్కు సౌకర్యం కల్పించింది ఈసీ.

దాదాపు 5 వేలకు పైగా కేంద్రాల్లో పూర్తిగా మహిళా అధికారులు ఉండనున్నారు. దాదాపు వెయ్యి ఓటింగ్ స్టేషన్లను దివ్యాంగులు నిర్వహించబోతున్నట్టు ఎలక్షన్ కమిషనర్ పేర్కొంది.

మొదటి విడత జరిగే ఎలక్షన్స్‌లో 8  మంది సెంట్రల్ మినిస్టర్స్..  ఇద్దరు మాజీ సీఎంలు.. తెలంగాణ మాజీ గవర్నర్  తమిళ సై సహా పలువురు పోటీలో  ఉన్నారు. నాగ్ పూర్ స్థానం నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి మూడోసారి బరిలో ఉన్నారు. ఈ సారి విజయంతో హాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. అటు చెన్పై సెంట్రల్ నుంచి తమిళ సై

సౌందరరాజన్, ఉత్తరాఖండ్ నుంచి మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఉన్నారు.  అరుణాచల్ వెస్ట్ నుంచి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2004 నుంచి వరుసగా మూడుసార్లు ఆయన విజయం సాధించారు. ఆయనకు ప్రత్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ ఛీఫ్ .. మాజీ సీఎం పెమా ఖండు బరిలో ఉన్నారు. అస్సామ్‌లోని డిబ్రూగడ్ నుంచి కేంద్ర మంత్రి.. అస్సామ్ మాజీ సీఎం సర్భానంద్ సోనోవాల్ బరిలో దిగుతున్నారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాం మేఘవాల్, తమిళనాడు బీజేపీ మాజీ ఛీప్ ఎల్ . మురుగన్ వంటి వారు పోటీలో ఉన్నారు. వెస్ట్ త్రిపుర నుంచి ఆ రాష్ట్ర మాజీ సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ పోటీలో ఉన్నారు. అటు తమిళనాడు బీజేపీ ఛీప్ కోయంబత్తూర్ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు.

తొలి విడతతో కలిపి మొత్తం ఏడు విడతల్లో దేశ వ్యాప్తంగా 543 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 1 జరిగే చివరి విడతతో ఈ ఎన్నికల క్రతువు ముగియనుంది. జూన్ 4న దేశ వ్యాప్తంగా 543 స్థానాలకు ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు.

Also Read: Revanth Is Lilliput: 'రేవంత్‌ రెడ్డి ఒక లిల్లీపుట్‌': కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-04-19T01:58:16Z dg43tfdfdgfd