MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్ కేసు - కవితకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Kavitha Judicial Custody Extended By Rouse Avenue Court: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు (Kavitha) మరోసారి షాక్ తగిలింది. ఆమె జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) మరో 14 రోజులు పొడిగించింది. మంగళవారంతో ఆమె కస్టడీ ముగియగా.. ఈడీ, సీబీఐ అధికారులు ఆమెను వర్చువల్ గా కోర్టు ముందు హాజరు పరిచారు. కస్టడీ పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరడంతో న్యాయస్థానం అందుకు అంగీకరించింది. మే 7 వరకూ కవితకు కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పు వెలువరించారు.

2024-04-23T09:17:08Z dg43tfdfdgfd