NALGONDA BRS : నల్లగొండ బీఆర్ఎస్‌లో ముసలం - విమర్శలు చేసుకుంటున్న నేతలు !

Rift in Nalgonda BRS :  ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్ఎస్ లో పరిస్థితి సానుకూలంగా లేదు.  నల్లగొండ జిల్లాలో నేతల మధ్య విబేధాలు మరంత పెరిగిపోతున్నాయి. కొద్ది రజుల కిందట  శాసన మండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి  కేసీయార్ పై విమర్శలు చేశారు.  కేసీయార్ చెప్పుడుమాటలు వింటున్నారని, ప్రజలకు ప్రభుత్వం దూరమయినందునే ఓడిపోయారన్నారు.  బచ్చాలు కొంతమంది పార్టీలో చేరి కోట్లకు పడగలెత్తారన్నారు.  ఏమైనా సూచనలు, సలహాలు ఇవ్వాలని అనుకున్నా కేసీయార్ అపాయింట్ మెంట్  ఇవ్వడం లేదన్నారు. గుత్తా చేసిన ఆరోపణల్లో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ నూ పరోక్షంగా ప్రస్తావిచండంతో ఆయన  ఓ సమావేశంలో గుత్తాపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. 

గ్యాదరి కిషోర్‌పై గుత్తా అనుచరుల విమర్శలు 

జిల్లాలో సీనియర్ అయిన గుత్తా సుఖేందర్ రెడ్డిపై గాదరి కిషోర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తాజాగా ఆయన అనుచరులు, కీలక బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టారు.  జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ ఇరిగి పెద్దులు   మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పైన మండిపడ్డారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, పరిజ్ఞానం కలిగిన గుత్తా  సుఖేందర్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి గాని, వయస్సు గాని లేని  చిల్లర వ్యక్తి గాదరి కిషోర్ అని అన్నారు.  ప్రజలకు  గాదరి కిషోర్ చరిత్ర అంత  తెలుసు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడించి ,తరిమికొట్టారన్నారు కేవలం  ఇసుక దందానీ వృత్తిగా మార్చుకొని వందల కోట్లు సంపాదించిన  ప్రబుద్ధుడన్నారు. ఇలా సొంత పార్టీ నేతలపై  ప్రెస్ మీట్ పెట్టి మరీ విరుచుకుపడ్డారు. 

నల్లగొండలో బీఆర్ఎస్ కు గడ్డు పరిస్థితి

నల్లగొండలో బీఆర్ఎస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. గట్టి అభ్యర్థులను కూడా నిలుపలేకపోయారన్న ప్రచారం జరుగుతోంది. నల్లగొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డిని, భువనగిరి నుంచి క్యామ మల్లేష్ ను నిలబెట్టారు. వీరు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే వారు కాదన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇలాంటి సమయంలోనూ నేతలు కలసి కట్టుగా పని చేయకుండా నిందలు వేసుకుంటున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన కుమారుడికి కాంగ్రెస్ తరపున  భువనగిరి టిక్కెట్ కోసం ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. అయినప్పటికీ కుమారుడి రాజకీయ భవిష్యత్ కు హామీ ఇవ్వడంతో ఆయన కాంగ్రెస్ లో చేరిపోతారన్న నమ్మకంతో బీఆర్ఎస్ నేతలు విమర్శలు ప్రారభించారు. 

గుత్తా కాంగ్రెస్ లోకి వెళ్తారని ప్రచారం

గుత్తా సుఖేధంర్ రెడ్డికి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి చాలా కాలంగా సరి పడదు. ఒకే  పార్టీలో ఉన్నా రెండు వర్గాలుగా ఉన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేగా గెలిచిన జగదీష్ రెడ్డి జిల్లాలో పార్టీని నడిపిస్తున్నారు. ఇప్పుడు గుత్తా కూడా  దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జగదీష్ రెడ్డి సన్నిహితుడు సైదిరెడ్డి బీజేపీలో చేరి నల్లగొండ నుంచి పోటీ చేస్తున్నారు. తేరా చిన్నపరెడ్డి వంటి నేతలు కూడా పార్టీ మారిపోయారు. దీంతో నల్లగొండ బీఆర్ఎస్ మరింతగా బలహీనపడుతోంది. 

2024-04-25T12:40:22Z dg43tfdfdgfd