NAVEEN POLISHETTY: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు

Naveen Polishetty Injured in Bike Accident: యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి ప్రమాదాని గురయ్యాడు. ప్రస్తుతం ఆమెరికాలో ఉన్న నవీన్‌ రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైనట్టు సమాచారం. బైక్‌ వెళ్తుండగా అతడు జారిపడటంతో తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో నవీన్‌ చేతికి బలమైన గాయమైందని, చేయి ఫ్యాక్చర్ అయ్యిందని చెబుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. ప్రస్తుతం నవీన్‌ అమెరికాలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. కాగా నవీన్‌కి దాదాపు రెండు నెలలు వరకు విశ్రాంతి అవసరం అవుతుందని వైద్యులు సూచించినట్టు సిన్నిహితవర్గాల నుంచి సమాచారం. అయితే నవీన్‌ ఆరోగ్యంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అలాగే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై ఇంకా మాత్రం క్లారిటీ లేదు. అంతేకాదు ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ ఘటన జరిగి రెండ్రోజులు అవుతోంది అంటున్నారు.

2024-03-28T08:46:22Z dg43tfdfdgfd