NEET -UG అడ్మిట్ కార్డులు విడుదల

NEET -UG అడ్మిట్ కార్డులు విడుదల

NEET UG 2024 ప్రవేశ పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్‌లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్లు exams.nta.ac.in, neet.ntaonline.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష మే 5, 2024న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:20 PM వరకు నిర్వహిస్తారు. భారతదేశంలోని 571 నగరాల్లో పెన్ ,పేపర్ విధానంలో పరీక్ష జరుగుతుంది. ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, ఒడియా, కన్నడ, పంజాబీ, ఉర్దూ, మలయాళం, మరాఠీ, తెలుగు , తమిళం భాషలలో నిర్వహించబడుతుంది. NEET UG 2024 కోసం 23లక్షల 81వేల 833 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. 

NEET 2024 అడ్మిట్ కార్డ్‌ని డౌన్ లోడ్ చేసుకోవాలి

exams.nta.ac.in లోకి వెళ్లి..NEET UG 2024 పేజీని తెరవండి. 

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ట్యాబ్‌ను క్లిక్ చేయాలి 

మీ అప్లికేషన్ నంబరు, పుట్టిన తేదీతో లాగిన్ కావాలి

అడ్మిట్ కార్డ్‌ని చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలి  

©️ VIL Media Pvt Ltd.

2024-05-02T05:15:06Z dg43tfdfdgfd