NEWS LIVE UPDATES:లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు .. అప్‌డేట్స్

News Live updates: దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి నెలకొంది. కొన్నిరాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో స్థానిక పార్టీలు, జాతీయ పార్టీల అభ్యర్ధులు, కీలక నేతలు ప్రచారంలో జోరు పెంచారు. శుక్రవారం దేశవ్యాప్తంగా తొలి విడత పోలింగ్ ముగిసింది. 102 నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కువినియోగించుకున్నారు.  మొత్తం 16.63 కోట్ల మంది ఓటర్లు.. 1.87 లక్షల పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. ఇందుకోసం మొత్తం 18 లక్షల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో హెలికాప్టర్లను కూడా వినియోగించారు.  50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ద్వారా లైవ్ పర్యవేక్షణ చేశారు.

ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ వైసీపీని ఓడించేందుకు జాతీయ పార్టీ బీజేపీతో పాటు టీడీపీ, జనసేన కలిసి కూటమి కట్టాయి. ఉప్పాడలో పవన్ కల్యాణ్, ఉత్తరాంధ్రలో చంద్రబాబు జోరుగా ప్రచారం చేస్తూ వైసీపీ పాలనను ఎండగడుతున్నారు. ఇక బీజేపీ తరపున రేపు అమిత్ షా ఎన్నకల ప్రచారంలో పాల్గొంటారు. మరోవైపు తెలంగాణలో లోక్ సభ ఎన్నకల్లో గెలుపుపై బీఆర్ఎస్ పార్టీ చీఫ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలను ప్రజలు విశ్వసించడం లేదని..బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారని ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో తేల్చి చెప్పారు. ఇక త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందనే సంకేతాన్నిచ్చారు. తమ పార్టీలోకి వచ్చేందుకు 25మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు కేసీఆర్.

2024-04-24T00:41:49Z dg43tfdfdgfd