RAHUL VS MODI: రిజర్వేషన్లపై నా సవాల్‌కు ప్రధాని మోదీజీ సిద్ధమా? రాహుల్‌ ప్రశ్న

Nirmal Jana Jathara: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రిజర్వేషన్ల అంశాన్నే ప్రధాన అస్త్రంగా చేసుకుంది. తాజాగా తెలంగాణ పర్యటనలో ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ అదే అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. రిజర్వేషన్ల అంశంపై సవాల్‌ చేశారు. రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగిస్తామని ప్రధాని మోదీ హామీ ఇవ్వగలరా? అని సవాల్‌ విసిరారు.

Also Read: Modi Vs Rahul: భయపడకు.. పారిపోకు: రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు

 

ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని నిర్మల్‌ జిల్లాలో ఆదివారం జన జాతర సభ నిర్వహించారు. ఈ సభలో రాహుల్‌ మాట్లాడుతూ.. జాతీయ అంశాలనే ప్రధానంగా ప్రస్తావంచారు. 'మోదీ రిజర్వేషన్ల వ్యతిరేకి. రిజర్వేషన్లను తొలగించాలని మోదీ ప్రయత్నిస్తున్నారు. రిజర్వేన్షన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగించడం చాలా కీలకమైన అంశం. రిజర్వేషన్లను పెంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపర్చింది. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగిస్తామని ప్రధాని మోదీ ప్రజలకు చెప్పాలి' అని కోరారు.

Also Read: Amit Shah: అమిత్‌ షా పర్యటనలో కలకలం.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం

 

'మోదీ ఇప్పటి వరకు తన ప్రసంగాలలో ఎక్కడా కూడా రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగిస్తామని చెప్పలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లను పెంచుతుంది' అని రాహుల్‌ తెలిపారు. ఈ ఎన్నికలు రెండు సమూహాల మధ్య జరుగుతున్నాయి. ఒకవైపు రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్  ఉంది. మరో వైపు రాజ్యాంగాన్ని మార్చే సమూహం ఉంది' అని వివరించారు.

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని రాహుల్‌ పునరుద్ఘాటించారు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తాడు అని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం వల్లనే ప్రజలకు హక్కులు సంక్రమించాయని గుర్తుచేశారు. పేదల హక్కులను హరించి ధనికులకు ప్రయోజనం చేకూర్చడమే బీజేపీ లక్ష్యమని విమర్శించారు. 'పెద్దలకు బీజేపీ రుణమాఫి చేస్తే మాత్రం ఎవరూ అడగటం లేదు. రైతులకు రుణమాఫీ చేస్తామంటే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు' అని రాహుల్ గాంధీ తెలిపారు.

తెలంగాణలో పాలనపై రాహుల్ స్పందిస్తూ.. 'తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేస్తున్నాం. ప్రతి మహిళకు రూ.2,500 బ్యాంక్ ఖాతాలో వేస్తున్నాం. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఈ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్నాం. ఆదివాసీలకు భూములపై హక్కులు కల్పించబోతున్నాం. ఢిల్లీలో కూడా ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం- ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని కాపాడే సమూహం' అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రజలకు రాహుల్‌ కొన్ని హామీలు ఇచ్చారు. 'కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కులగణన, ఆర్దిక సర్వే చేస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి మేం కట్టుబడి ఉన్నాం' అని వివరించారు. ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తామని ప్రకటించారు. రాజ్యాంగాన్ని మట్టు పెట్టేందుకు బీజేపీ చూస్తోందని.. అందరం కలిసి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అని పిలుపునిచ్చారు. పేదలు, రైతుల ప్రభుత్వం వస్తేనే రాజ్యాంగానికి రక్ష అని ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-05-05T12:55:13Z dg43tfdfdgfd