ROJA EDUCATION: మంత్రి రోజా ఎంత వరకు చదువుకున్నారో తెలుసా? చూస్తే మైండ్ బ్లాంక్..!

ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. అధికార వైసీపీ, విపక్ష కూటమి.. నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇటు జగన్.. అటు చంద్రబాబు, పవన్, పురందేశ్వరి పోటాపోటీగా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ప్రధాన అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నామినేషన్ వేయగా.. వారి ఆస్తులు, అప్పుల వివరాలు బయటకొస్తున్నాయి. మంత్రి రోజా  (Minister Roja) కూడా శుక్రవారం నామినేషన్ వేశారు. తన ఆస్తిపాస్తులు, చదువుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. గతంలో పోల్చితే.. ఇప్పుడు ఆమె ఆస్తులు భారీగా పెరిగాయి.

---- Polls module would be displayed here ----

మంత్రి రోజా తన ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించిన వివరాల ప్రకారం.. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడా విలువ రూ.4.58 కోట్లకు పెరిగింది. గత ఐదేళ్లలో రోజా చరాస్తుల విలువ 1.84 కోట్లు పెరిగాయి. ఇక స్థిరాస్తుల విషయానికొస్తే.. 2019 స్థిరాస్తుల విలువ రూ.4.64 కోట్లు. ప్రస్తుతం వాటి విలువ రూ.6.05 కోట్లకు చేరింది. రోజా స్థిరాస్తులు ఐదేళ్లలో రూ.81 లక్షల మేర పెరిగాయి. 2019లో మంత్రి రోజాకు ఆరు కార్లు, ఒక బైక్‌ ఉండేవి. వాటి విలువ రూ.1.08 కోట్లు. ఇప్పుడు ఆమెకు రూ.1.59 కోట్ల విలువైన 8 కార్లున్నాయి.

2019 ఎన్నికల అఫిడవిట్‌తో పోల్చితే.. కార్ల సంఖ్య పెరిగినప్పటికీ.. వాటి విలును మాత్రం బాగా తగ్గినట్లుగా అఫిడవిట్‌లో చూపించారు. గత ఐదేళ్లలో నగరి నియోజకవర్గంలో రోజా భర్త సెల్వమణి పేరిట 6.39 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. అంతేకాదు మంత్రి రోజాకు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పెట్టబడులు ఉన్నాయి. రూ.39.21 లక్షల విలువైన చిట్స్ ఉన్నట్లు తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మరో ప్రైవేటు చిట్‌లోనూ రూ.32,90,450 విలువైన మొత్తం ఉన్నట్లు వెల్లడించారు. గత ఎన్నికల సమయంలో మంత్రి రోజాపై నాలుగు కేసులు ఉండేవి. ఇప్పుడు ఒక్కటి కూడా లేదు. రోజా చదువు విషయానికొస్తే.. ఆమె ఇంటర్ వరకు మాత్రమే చదువుకున్నారు. తిరుపతిలోని  పద్మావతి మహిళా కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు.

కాగా, రోజా సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే 1998లో టీడీపీ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2004లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి బరిలోకి దిగి..అప్పుడు కూడా ఓటమి పాలయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు రోజా. వైఎస్సార్ మరణం తర్వాత.. వైఎస్ జగన్ సొంత పార్టీ వైసీపీ పెట్టడంతో.. రోజా కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. వైసీపీలో చేరారు. అనంతరం 2014 ఎన్నికల్లో మరోసారి నగరి నుంచే పోటీ చేసి.. తొలిసారి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో కూడా రెండోసారి గెలిచి.. ఆ తర్వాత మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. ఇప్పుడు మరోసారి నగరి నుంచే తన అదృష్టాన్ని పరిశీలించుకుంటున్నారు.

2024-04-20T10:36:13Z dg43tfdfdgfd