SAIL: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. సెయిల్‌లో భారీగా ఉద్యోగాలు.. లక్షల్లో జీతం!

నిరుద్యోగులకు అలర్ట్. ప్రభుత్వ రంగ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) ఇటీవల రెండు నోటిఫికేషన్స్ జారీ చేసింది. బొకారో స్టీల్ ప్లాంట్‌లో మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్.. సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ ఆఫీసర్స్ పోస్టుల కోసం మరో నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు సెయిల్ అధికారిక పోర్టల్ sail.co.in విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. మేనేజర్ లెవల్ పోస్టులకు మే 8, మెడికల్ ఆఫీసర్, కన్సల్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి మే 7 తుది గడువు.

* ఖాళీలు, అర్హతలు

మేనేజర్ స్థాయి పోస్టుల్లో మొత్తం 55 ఖాళీలు, కన్సల్టెంట్, మెడికల్ ఆఫీసర్ పోస్టుల్లో 108 ఖాళీలు భర్తీ కానున్నాయి. మేనేజర్, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధిత ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో బీటెక్ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థికి కనీసం ఏడేళ్ల ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి. డిప్యూటీ మేనేజర్ పోస్టుకు నాలుగేళ్ల పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీ విభాగంలోని పోస్టులకు బీఈ, బీటెక్ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇండస్ట్రియల్ సెఫ్టీపై కనీసం ఒక సంవత్సరం PG డిగ్రీ లేదా డిప్లొమా తప్పనిసరి.

కన్సల్టెంట్/సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు, సంబంధిత విభాగంలో PG డిగ్రీ (MD/MS) లేదా DNB చదివి ఉండాలి. మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు MBBS డిగ్రీ/డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ హెల్త్/ఆక్యుపేషనల్ హెల్త్ చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

* అప్లికేషన్ ప్రాసెస్

- ముందుగా సెయిల్ అధికారిక పోర్టల్ sail.co.in ఓపెన్ చేయాలి.

- హోమ్‌పేజీలోకి వెళ్లి, మేనేజర్, మెడికల్ ఆఫీసర్స్- 2024 లింక్స్‌పై క్లిక్ చేయాలి. నోటిఫికేషన్ల వివరాలు పరిశీలించాలి.

- తర్వాత ‘అప్లై నౌ’ అనే ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.

- అనంతరం రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి.

- అన్ని వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ ఫారమ్‌ నింపాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

- అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్ సబ్‌మిట్ చేయాలి.

* సెలక్షన్ ఎలా?

అభ్యర్థుల ఎంపికలో ముందు రాత పరీక్ష నిర్వహిస్తారు. తర్వాత స్కిల్ టెస్ట్, చివరి దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. అభ్యర్థులు సాధించిన స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* జీతభత్యాలు

కన్సల్టెంట్ పోస్ట్‌కు నెలకు జీతం రూ.90,000 నుంచి రూ 2,40,000 మధ్య ఉంటుంది. సీనియర్ మెడికల్ ఆఫీసర్లకు రూ.70,000 నుంచి రూ. 2,00,000 వరకు, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్/మైనింగ్ ఫోర్‌మెన్, సర్వేయర్, మైనింగ్ మేట్, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ వంటి పోస్ట్‌లకు రూ. 26,600 నుంచి రూ. 38,920 మధ్య జీతం లభిస్తుంది. మేనేజర్ పోస్టులకు రూ.80,000 నుంచి రూ.2,20,000.. డిప్యూటీ మేనేజర్‌కు రూ. 70,000 నుంచి రూ.2,00,000 మధ్య జీతం ఉంటుంది.

2024-05-07T10:18:33Z dg43tfdfdgfd